Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ ఏం నేరం చేయలేదని రుజువవుతుంది. సుధాకర్ ఇందిరతో గణ నిన్ను చూసేశాడు.. ఇంటికి వెళ్లాడని చెప్తాడు. ఇందిర చాలా కంగారు పడుతుంది. దాంతో వంట చేస్తా మీరు వచ్చేయండి అని చెప్పి వెళ్లిపోతుంది.
సిద్ధూ రంజిత్‌తో మీకు పరాంకుశం ఎలా కలిశాడు అని అడుగుతాడు. దానికి రంజిత్ తప్పు చేయని వాళ్లని నేచర్ కూడా సాయం చేస్తుందని ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తారు. రంజిత్, ఐశ్వర్యలు సాక్ష్యాల కోసం వెళ్తుంటే వాళ్లదగ్గరకి పరాకుంశం వచ్చి రంజిత్, ఐశ్వర్యలను కూడా మీరు ప్రేమికులు అది నాకు తెలిసిపోయింది అని మాట్లాడుతాడు. ఐశ్వర్య పరాంకుశాన్ని లాగిపెట్టి కొడుతుంది. అప్పుడే రంజిత్ సిద్ధూ, ప్రేరణల పెయింటింగ్ చూస్తాడు. విషయం అడిగితే వాళ్లు మీలా లవర్స్ అనుకున్నా డ్రాయింగ్ వేశా అని నిన్నే వచ్చా ఫాలో అయ్యానని విషయం చెప్తాడు. వీడియో కూడా తీశానని పరాంకుశం చూపించడంతో రంజిత్ పరాంకుశాన్ని సాక్షిగా తీసుకొచ్చిన విషయం చెప్తాడు.
సిద్ధూ, ప్రేరణలు పరాంకుశానికి థ్యాంక్స్ చెప్తారు. ఇప్పుడే మీ పెయింటింగ్ కొనేస్తామని అంటారు. పరాంకుశం అవసరం లేదు మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం చెప్తా అప్పుడు కొనండి అని అడవిలో ఓ చిన్న గని ఆ గనికి చాలా గదులు గదికో సిపాయి.. సిపాయికో తుపాకీ దాని సమాధానం తేనేటీగ అని చెప్తాడు. కరెక్ట్ అని ప్రేరణ, సిద్ధూ చెప్తారు. అందరూ నవ్వుకుంటారు. సిద్ధూ వెళ్లిపోతాడు. ఆటో తీసుకొస్తా అని సుధాకర్ అంటే అవసరం లేదులే మా మమయ్య మా ఓనర్ గారి కారు ఉంది కదా అంటే హలో నేను మీ అక్కని కేసు నుంచి విడిపించాలని వచ్చా మిమల్ని ఇంటికి తీసుకెళ్లడానికి కాదు అని వెళ్లిపోతాడు. సుధాకర్ ఆటో తీసుకొస్తా అని వెళ్లిపోతాడు.
విజయానంద్ సిద్ధూని పిలిచి నీ కోసమే వెయిట్ చేస్తున్నా అంటాడు. నేను బయటకు వస్తానో రానో అని వెయిట్ చేస్తున్నావ్ అని సిద్ధూ అంటాడు. దానికి విజయానంద్ నువ్వు జైలులో ఉండాలి అనుకునే వాడినే అయితే ఇలా స్టేషన్లు, కోర్టుల వెంట తిరగను అయినా నాకు నీ నమ్మకం అవసరం లేదు అక్కడ మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకొని ఉంది నువ్వు కనిపిస్తే తను మామూలు మనిషి అవుతుంది. అందుకే నిన్ను ఒకసారి ఇంటికి తీసుకెళ్దాం అని ఇక్కడ ఆగాను రా కారు ఎక్కు అని విజయానంద్ అంటే సిద్ధూ కోపంగా చూస్తాడు. నేను పిలిస్తే నువ్వు రావు అని నాకు తెలుసు ఒక్క నిమిషం అని మంజులకు కాల్ చేస్తాడు. మంజుల ఆనందంతో త్వరగా ఇంటికి రా అని పిలుస్తుంది. సిద్ధూ విజయానంద్‌తో రాను అని ఆటోలో వస్తానని చెప్తాడు.
సిద్ధూ, విజయానంద్‌తో మాట్లాడుతున్నాడేంటి అని ప్రేరణ అనుకుంటుంది. గణ స్పీడ్‌గా ఇంటికి వెళ్లి పని మనిషి ఎక్కడ అని ఇళ్లంతా ఇందిర కోసం వెతుకుతాడు. ఇందిర కాఫీ తీసుకొని వస్తుంది. గణ ఇందిరతో ఈ రోజు నువ్వు కోర్టుకి వచ్చావా అని అడుగుతాడు. నేను కోర్టుకి ఏంటి బాబు నాకు ఏం పని నేను రాలేదు అని అంటుంది. ఈశ్వరి గణతో నువ్వు ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తున్నావ్ గంగ అక్కడ ఎందుకు ఉంటుందిరా అని అడుగుతుంది. కేసు గురించి తెలుసుకొని డిసప్పాయింట్ అయిపోతుంది.
సిద్ధార్థ్ ఇంటికి వెళ్తాడు. చెల్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. సిద్ధూని లోపలికి తీసుకెళ్లబోతే సిద్ధూ లోపలికి రాడు. మంజుల చాలా ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు బయట అనాముకుడిలా ఉండకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అసలు నిన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చింది నీ నిజాయితీ కాదు.. మీ నాన్న పరపతి.. ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ అని అంటుంది. అలా చెప్పుకున్నాడా ఈయన.. నన్ను నిర్దోషిలా బయటకు తీసుకొచ్చింది ఓ అమాయకుడు తీసుకొచ్చిన సాక్ష్యం.. ఈయన దయాదాక్షిణ్యాల మీద నేను రాలేదు. లేని గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఇలాంటి పేరు వాడుకోవాల్సి వస్తే నేను బయటకే రాను నీకు తెలుసుకదమ్మా.. అని అంటాడు. ఆయన అవసరం నీకు వద్దు కానీ నీ భవిష్యత్ మాకు ముఖ్యం అని మంజుల అంటుంది. ఏదో ఒకరోజు నువ్వు పశ్చాత్తాపపడతావురా అని మంజుల అంటే నువ్వు కోరుకున్నది జరగాలి అని నన్నే కాదు ఆ దేవుడిని అడగకు అమ్మా ఆయన కూడా ఒప్పుకోడు అని సిద్ధూ వెళ్లిపోతాడు.
రంజిత్‌కి కృతజ్ఞతగా ప్రేరణ, ఐశ్వర్య, ఇందిరలు సంతోషంగా భోజనం వడ్డిస్తారు. ఏంటి ఇదంతా అని రంజిత్ అడిగితే మీరే లేకపోతే నా కూతురి భవిష్యత్ ఏంటి అని ఇందిర ఎమోషనల్ అయిపోతుంది. నన్ను పొగిడి గొప్ప వాడిని చేయకండి ఇందులో నా స్వార్థం ఉంది.. నా ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్లు కూడా క్లీన్‌చీట్‌తో ఉండాలి అందుకే మీ అమ్మాయి తప్పు చేయలేదు అని ఇదంతా చేశానని అంటాడు. నా రూల్స్ బ్రేక్ చేస్తే అస్సలు ఊరుకోను అని ముఖ్యంగా నువ్వు అని ఐశ్వర్యకి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.