Illu Illalu Pillalu Serial Today Episode భాగ్యం భద్రావతి, విశ్వని ఇంటికి పిలిచి మీ ప్రేమ వేరో ఎవరో కుర్రాడితో పెళ్లికి ముందు తప్పు చేసిందని రామరాజు ఇంట్లో మీ మేనకోడలు గురించి అంటున్నారని  చెప్తుంది. రామరాజు ఆ ఫొటోలు పట్టుకొని నీకు వీడికి సంబంధం ఏంటి.. వాడితో ఎందుకు అంత క్లోజ్‌గా ఉన్నావ్ అని నిలదీయడానికి రెడీ అయ్యారు.. కావాలంటే వెళ్లి చూడండి అని అంటుంది. 

Continues below advertisement

రామరాజు సంగతి తేల్చేద్దాం పదరా అని విశ్వని తీసుకొని భద్రావతి వెళ్తుంది. ప్రేమ ఇంటికి వస్తుంది. ప్రేమని చూసి వల్లి ఎక్కడ లేని సంతోషంతో ప్రేమ వచ్చేశావా అని మామయ్యగారు ప్రేమ వచ్చేసింది రండి అని పిలుస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. రామరాజు వచ్చి ప్రేమ నీతో మాట్లాడాలి అని చెప్పి అందర్ని వెళ్లిపోమని చెప్తారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రామరాజు, వేదవతి మాత్రమే ఉంటారు. రామరాజు ప్రేమకి ఫొటోలు చూపించి ఏంటమ్మా ఇది అని అడుగుతాడు. ప్రేమ ఈ విషయాన్ని ఎలా అడగాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదమ్మా.. నా కూతురి లాంటి నిన్ను ఇలా అడగాలి అంటే ఇబ్బందిగా ఉందమ్మా కానీ నా కోడలిని ఎవరూ వేలెత్తి చూపించకూడదు అని అసలేం జరిగిందో తెలుసుకోవాలని అడుగుతున్నానమ్మా.. ఏం అనుకోకుండా ఈ ఫొటోలు ఉన్నది ఎవరో చెప్పమ్మా.. వాడు ఎవడో కల్యాణ్‌ అంట ఫోన్ చేసి ఏవేవో చెప్తున్నాడు.. అసలేంటి అమ్మ ఇదంతా ఏమైనా ఉంటే నేను చూసుకుంటా నాకు చెప్పు అని అడుగుతాడు.

రామరాజు ప్రశ్నలకు ప్రేమ మౌనంగా ఉంటుంది. మామయ్య అది.. మామయ్య అది.. అని చెప్పబోతే విశ్వ, సేన కోపంగా వస్తారు. సేన కోసంగా రేయ్ రామరాజు నా కూతురికి లవ్‌ ఎఫైర్ పెడతారా అని రామరాజు కాలర్ పట్టుకొని కొట్టడానికి వచ్చి కాలర్ పట్టుకొని కొట్టుకుంటారు. అందరూ గొడవ పడతారు. విశ్వ సాగర్‌ని కొట్టడం.. సాగర్, చందు కలిసి విశ్వని కొట్టడం నడి రోడ్డు మీద అందరూ తన్నుకుంటారు. సేన ఏకంగా గొడ్డలి పట్టుకొని వచ్చి రామరాజుని చంపేస్తా అని అంటాడు. ఇంతలో ధీరజ్ వచ్చి అందర్ని ఆపుతాడు. 

Continues below advertisement

సేన ఆవేశంగా నా కూతురి మీద నిందలు వేస్తాడా.. మిమల్ని చంపేస్తా అని మరోసారి గొడ్డలి పట్టుకొని వెళ్తాడు. ధీరజ్ గొడ్డలి పడేసి ఏం మాట్లాడుతున్నారురా.. మా నాన్న నా భార్యని కూతురిలా చూసుకుంటారురా అని అంటాడు. విశ్వ వచ్చి ధీరజ్ కాలర్ పట్టుకొని నా చెల్లికి ఎఫైర్ అంటగడుతున్నారు అని అంటే నా భార్య గురించి అలా అంటే చంపేస్తా అని ధీరజ్ విశ్వని నెట్టేస్తాడు. ఆ ఫొటోలో ఉన్న వాడు నాకు ఫ్రెండే అందరితో ఎలా ఫొటోలు దిగిందే వాడితో అలాగే దిగింది కాకపోతే వాడు పెద్ద వెధవ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నా భార్య గురించి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు కాబట్టి అందరికీ కలిపి చెప్తున్నా వినండి.. అని ప్రేమ చేయి పట్టుకొని మేం ఇద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకొని తిట్టుకొని బద్దశత్రువుల్లా పెరిగాం కానీ గొడవల్లోనే నిజమైన ప్రేమ పుడుతుందని మా ఇద్దరి విషయంలో జరిగింది.. ఇద్దరి మధ్య తెలీకుండా ప్రేమ పుట్టింది.. అది చావు అయినా బతుకు అయినా ఇద్దరం కలిసే బతకాలి అనే వరకు తీసుకెళ్లింది.

అందుకే మన రెండు కుటుంబాలు ఒప్పుకోవు కాబట్టి మేం బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది.. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది.. అంతే తప్పు తన మనసులో ఇంకెలాంటి ఉద్దేశాలు లేదు.. వ్యక్తిత్వంలో నా భార్య ఆకాశం అంత ఎత్తులో ఉంది.. తను ఎలాంటి తప్పు చేయలేదు.. దయచేసి నా భార్య గురించి మరోసారి ఇలాంటి పంచాయితీ పెట్టకండి తనని నలుగురిలో నవ్వుల పాలు చేయకండి.. చూండి అని ప్రేమని దగ్గరకు తీసుకొని మూడు ముళ్ల సాక్షిగా ఒక్కటైన మేం కలిసే బతుకుతాం.. దయచేసి మమల్ని ఇలాగే బతకనివ్వండి..  ప్రేమని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను.. ప్రేమిస్తూనే ఉంటాను తనే నా జీవితం తనే నా సర్వస్వం అని చెప్తాడు. అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. ప్రేమ ఎమోషనల్ అయిపోతుంది. 

గొడవ పడి ఆవేశ పడిన అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక లొల్లిల వల్లి అయితే తన ప్లాన్ వర్కౌట్ అవ్వనందుకు తెగ ఫీలైపోతుంది. అంతా బ్రాంతి ఏనా అంటూ అక్కడ ఇడ్లీబాబాయ్ మందు తాగుతూ ఏదో అనుకున్నాం ఏదో జరుగుతుంది అనుకుంటే ఇలా అయిపోయింది ఏంటి అని భార్యని అంటాడు. ఇక్కడ కూతురు కూడా తెగ ఫీలైపోతుంది.  పెద్ద కథ అల్లాం కానీ మనకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చారని అంటుంది వల్లి. కల్యాణ్ గాడి వెనక ఏదో ఉంది.. అది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని భాగ్యం అంటే ఏంటి వచ్చేది.. ధీరజ్, ప్రేమ లైలా మజ్నూలని ఆనంద్‌రావ్ అంటే వల్లి హర్ట్ అయి ఫోన్ పెట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.