Chinni Serial Today Episode మహి మ్యాడీగా పేరు మార్చుకొని ఇండియాకి వస్తాడు. మధుమితగా ఉన్న చిన్ని కూరగాయలు అమ్ముతూ ఉంటే మ్యాడీ వచ్చి గుద్దేస్తాడు. మధుమిత కూరగాయలు కింద పడిపోతాయి. బండి పోతుంది. దాంతో కూరగాయలు మ్యాడీ కారులో అమ్ముతానని అంటుంది. మ్యాడీ వద్దని చెప్పడంతో అక్కడున్నా అమ్మలక్కల్ని పిలిచి గొడవ పెడుతుంది. దాంతో మ్యాడీ ఒప్పుకుంటాడు.
మ్యాడీ కొత్త కారు మీద కూరగాయల గంప పెట్టి అమ్ముతుంది. మ్యాడీని డ్రైవర్ అంటూ పిలుస్తుంది. మ్యాడీ తెగ చిరాకు పడతాడు. డ్రైవర్ బాబు అంటూ ఎక్కడ పడితే అక్కడ ఆపి మ్యాడీకి చిరాకు పెడుతుంది. అందరూ మధుని చూసి ఏంటి మధమ్మా కూరగాయలు అమ్మి బాగా సంపాదించినట్లు ఉన్నావ్ కొత్త కారు కొన్నావ్ డ్రైవర్‌ని పెట్టుకున్నావ్ అని అడుగుతారు. మ్యాడీ బయటకు వచ్చి నేను డ్రైవర్‌నికాదు ఇది నా కారు అని అంటాడు. మధుమిత కూరగాయలు మొత్తం అమ్మేస్తుంది. పెట్రోల్ ఖర్చుకి డబ్బులు కావాలా అని అడుగుతుంది. వసేయ్ రాక్షసి అని అంటాడు. నేను రాక్షసి కాదు సీల్ రాక్షసి అని అంటుంది.
వరుణ్ మ్యాడీకి కాల్ చేసి మామయ్యకి నువ్వు వస్తున్నట్లు తెలిసిపోయింది అని అంటాడు. దాంతో వరుణ్ కాసేపట్లో అందరికీ తెలిసిపోతుంది. నేను డాడీని కూల్ చేస్తా అంటాడు. దేవేంద్ర వర్మ ఓ పెద్ద పొలిటీషియన్‌గా ఎంట్రీ ఇస్తాడు. నాగవల్లి, ప్రమీల దిష్టి తీయడానికి వెళ్తే ఇంతలో నాగవల్లి చెల్లి వసంత వాళ్లని ఆపి నేను ఈ ఇంటి ఆడపడుచుని నేను రాకుండా వెళ్లిపోతారా అని అంటుంది. నాగవల్లి, వసంత మాట్లాడుతుంటే వరుణ్ వెళ్లి మామయ్య వచ్చేశాడు పదండి అంటాడు. నాగవల్లి వెళ్లి బావ ఆగు నువ్వు హోం మినిస్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది. దేవా వల్లితో నేను ఎంత హోం మినిస్టర్ అయినా నువ్వే నా హోం మినిస్టర్‌వి అంటాడు. దాక్షారామంలో సెటిల్ అవడం వల్ల పది ఏళ్లలో మనం చాలా డెవలప్ అయిపోయాం అని అంటుంది.
దేవేంద్ర వర్మ ఇంట్లో వాళ్లకి మహి ఎక్కడ అని అడుగుతాడు. మహి యూఎస్‌లో ఉన్నాడు కదా అని నాగవల్లి అంటే వాడు ఇండియా వచ్చేశాడు అని దేవా అంటాడు. మహి ఎంట్రీ ఇస్తాడు. మహి వస్తున్నట్లు నాకు ఎందుకు చెప్పలేదు అని నాగవల్లి అడిగితే నాకే చెప్పలేదు అని దేవా అంటాడు. మహి ఇంట్లోకి వస్తాడు. మహి వచ్చి మమ్మీ అని నాగవల్లికి హగ్ ఇస్తాడు. దేవాకి కూడా హగ్ ఇస్తాడు. ఎందుకు వచ్చేశావ్ అంటే నేను అక్కడ ఉన్నా నా మనసు ఇక్కడే ఉంది.. దాన్ని వెతకడానికి వచ్చాను అంటాడు. వసంత తన అల్లుడు వచ్చాడని సందడి చేస్తుంది. నాగవల్లి దేవాతో వీడేంటి బావ ఆ చిన్ని కోసం వెతకడానికి వచ్చాడా.. వీడికి చెప్పాం కదా చిన్ని చనిపోయింది అని అంటుంది. దేవా వల్లితో వాడు ఇంకా చిన్ని బతికి ఉందనే భ్రమలో ఉన్నాడని అంటాడు.
వల్లి దేవాతో ఆడపడుచుకి మాటిచ్చావ్ శ్రియనే మన ఇంటి కోడలు అని మాటిచ్చాం అంటుంది. శ్రియ మహి మీద పూలు చల్లి విష్ చేస్తుంది. మహి మూడు అడుగుల దూరం నిల్చొని మాట్లాడుతాడు. ఇంత అందమైన మరదలు ఉంటే మూడు అడుగుల ఫోబియా ఏంటి బావ అంటుంది. ఇక మహి ముఖ్యమైన పని ఉంది ఇక ఇక్కడే ఉంటానని అంటే శ్రియ తనని పెళ్లి చేసుకవడానికే ఉంటానని అన్నాడని అనుకుంటుంది. ఇక మహి గదిలోకి వెళ్లి చిన్ని ఫోటోలు చూస్తూ ఉంటాడు. శ్రియ లోపలికి రాబోతే ఆపి నా గదిలోకి ఎవరికీ ఎంట్రీ లేదు అంటాడు. వరుణ్ వచ్చి అత్తకే లేదు మనకు ఇంక ఎందుకు ఎంట్రీ ఉంటుంది అంటాడు.
మహి చిన్ని ఫొటోలు చూస్తూ చిన్ని ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ నువ్వు లేవని ఎంత మంది చెప్పినా నా మనసు వినదు. నువ్వు ఉన్నావ్ నేను నీ కోసమే వచ్చా.. తొందర్లోనే నిన్ను కలుస్తా అని చిన్ని ఇచ్చిన పెళ్లి కూతురి బొమ్మ పట్టుకొని చూస్తాడు. మహి గది మొత్తం చిన్ని ఫొటోలే ఉంటాయి. మధుమిత స్కూల్ పక్కనుంచి వెళ్తూ అక్కడ పిల్లల్ని చూసి మహి, చందు వాళ్లని గుర్తు చేసుకుంటుంది. చందు మహి వాళ్లు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అనుకుంటుంది. కావేరిని గుర్తు చేసుకొని నేను బాగా చదువుకొని నీ కల నెరవేరుస్తా అమ్మా అని అనుకుంటుంది. మహి కూడా బొమ్మ పట్టుకొని త్వరలోనే కలుస్తా చిన్ని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!