Ammayi garu Serial Today Episode విరూపాక్షిని విజయాంబిక కిడ్నాప్ చేయిస్తుంది. రూప, మందారం, రాజులు చాలా టెన్షన్ పడతారు. సుమ, చంద్రలు వచ్చి టైం అయింది పంతులు పిలుస్తున్నారని రుక్మిణి, రాజులను తీసుకెళ్తారు. విజయాంబిక కీర్తిని తీసుకెళ్తుంది. విరూపాక్షి చాలా ఏడుస్తుంది. రెండు జంటల్ని చూసి సూర్యప్రతాప్ చాలా సంతోషపడతాడు.
రుక్మిణి సూర్యప్రతాప్‌తో నాన్న మా అమ్మకి ఏమైందా అని భయంగా ఉంది అమ్మ వచ్చే వరకు ఈ పెళ్లి ఆపుదాం.. నా పెళ్లి చేయడం మా అమ్మ కల నాన్న అని అంటుంది. మిమల్ని బాధ పెట్టాలని కాదు కానీ ఏ ఆడపిల్లకి అయినా పెళ్లిలో అమ్మ లేకపోతే ఎలా నాన్న అని ఏడుస్తుంది. విజయాంబిక వాళ్లు రుక్మిణి మీ అమ్మ ఇక్కడే ఉంటుంది. మేం తీసుకొస్తా అని అంటుంది. సూర్యప్రతాప్ రుక్మిణితో వెళ్లి పీటల మీద కూర్చొమ్మా లేదంటే మీ అమ్మ ఈ పెళ్లి ఆపాలి అన్న దురుద్దేశంతో ఇలా కనిపించకుండా పోయిందని అనుకుంటా అని అంటారు. దాంతో రుక్మిణి వెళ్లి పీటల మీద కూర్చొంటుంది.
రాజు, కీర్తి, రూప, చైతన్యలు పెళ్లి పీటల మీద కూర్చొంటారు. రాజు, రూపలు ఒకర్ని ఒకరు చూసుకొని బాధ పడతారు. రెండు జంటలకు జీలకర్రా బెల్లం పెట్టుకోమని పంతులు ఇస్తారు. రాజు, రూపలు గతంలో తమ పెళ్లిని గుర్తు చేసుకొని బాధ పడతారు. జీలకర్రా బెల్లం పెడితే సగం పెళ్లి అయిపోయినట్లే పెట్టను అని రూప, రాజు ఇద్దరూ అనుకుంటారు. రెండు జంటలు జీలకర్రా బెల్లం పెట్టుకునే టైంకి విరూపాక్షి వచ్చి ఆపండి అని అరుస్తుంది. ఈ పెళ్లి జరగకూడదు అంటుంది. సూర్యప్రతాప్ విరూపాక్షితో పచ్చని పందిరిలో పెళ్లి జరుగుతుంటే ఆపుతున్నావ్ నీకు బుద్ధి ఉందా.. అసలు నువ్వు ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేయనిచ్చావు గనక అని అంటారు.
విరూపాక్షి భర్తతో నువ్వు ఏమైనా అనుకో సూర్య కానీ ఈ పెళ్లి జరగకూడదు అని అంటుంది. కీర్తి అసలు కీర్తినే కాదు అని తెలిసినా ఈ పెళ్లి జరిపిస్తావా సూర్య అని అడుగుతుంది. విజయాంబిక, దీపక్, కీర్తిలు షాక్ అయిపోతారు. విరూపాక్షి భర్తతో ఈ కీర్తి అలియాస్ దీప్తి జీవన్ మనిషి అని తెలిసినా పెళ్లి జరిపిస్తావా సూర్య అని అడుగుతుంది. విజయాంబిక అడ్డుకోవడానికి వస్తే విరూపాక్షి తిడుతుంది. కీర్తి జీవన్ పంపిస్తే వచ్చింది.. ఈ పెళ్లి అంతా మాయ.. నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి జీవన్ పన్నిన పన్నాగం అని చెప్తుంది. దీప్తి ఏం తెలీనట్లు అసలు ఆవిడ ఏం అంటున్నారో నాకు తెలీదు సార్ ఈ దీప్తి ఎవరో జీవన్ ఎవరో నాకు తెలీదు.. ఆ రోజే నేను చనిపోయి ఉంటే బాగుండేది నేను వెళ్లిపోతా అని అంటుంది.
సూర్యప్రతాప్ ఆపి విరూపాక్షి మీద కోప్పడతాడు. నేను నా ఫ్యామిలీ సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. విరూపాక్షి తన ఫోన్‌లో రికార్డ్ చేసిన వీడియో గుర్తు చేసుకొని ఆ ఫోన్ రౌడీలు తనని కొట్టినప్పుడు పడిపోవడం గుర్తు చేసుకొని సాక్ష్యంతో నిరూపిస్తా అని విరూపాక్షి అంటుంది. చంద్రకు తన ఫోన్‌కి రింగ్ ఇవ్వమని చెప్పి ఫోన్ కోసం వెతుకుతుంది. విరూపాక్షికి ఫోన్ దొరుకుతుంది. వెంటనే తాను రికార్డ్ చేసిన వీడియో సూర్యప్రతాప్‌కి చూపిస్తుంది. కీర్తి అలియాస్ దీప్తి జీవన్‌తో మాట్లాడటం చూసిన సూర్యప్రతాప్ బిత్తరపోతాడు. రాజు, రూప, చంద్ర అందరూ షాక్ అయిపోతారు. దీప్తి దొరికిపోయా అని తలదించుకుంటుంది.
సూర్యప్రతాప్ కీర్తిని కోపంగా చూస్తుంది. కీర్తి అని అరుస్తాడు. కీర్తి అదంతా అబద్ధం అని అంటే సూర్యప్రతాప్ లాగి పెట్టి కొట్టి నిన్ను ఎంత నమ్మాను బంగారం లాంటి నా మనవడిని రాజుని నీకు అప్పగించాలని అనుకున్నా అని అంటాడు. కీర్తి తనని క్షమించమని వేడుకుంటుంది. నిన్ను క్షమించను అని సూర్యప్రతాప్ అని పోలీసులకు పిలిచి విషయం చెప్పి అరెస్ట్ చేయిస్తారు. లేడీ కానిస్టేబుల్ దీప్తిని తీసుకెళ్తుంది. విజయాంబిక రుక్మిణి పెళ్లి అయినా జరిపించేస్తే రుక్మిణి పీడ ఉండదు అనుకొని అంటుంది. సూర్యప్రతాప్ రాజుకి మరో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా ఈ ముహూర్తానికి రుక్మిణి, చైతన్యల పెళ్లి చేయమని చెప్తారు. పంతులు ముహూర్తం దాటిపోయిందని కాసేపు ఆగుదామని అంటారు. జీవన్ అంతు చూడాలని ఎవరో వాడికి సాయం చేస్తున్నారని చంద్ర, సుమలు సూర్యప్రతాప్‌తో చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!