Chinni Serial Today Episode మధు లోహితతో తన ఫ్రెండ్స్‌ని రెండు నిమిషాల్లో తన వైపు తిప్పుకుంటానని చెప్తుంది. అలా అంటూనే లోహిత స్నేహితులకు ఓ ఫొటో పంపిస్తుంది. ఆ ఫొటోలు, వీడియో చూడగానే లోహిత ఫ్రెండ్స్ మధుమిత వైపు వెళ్లిపోతారు. 

లోహిత ఏమైందని తన ఫ్రెండ్స్‌ని అడగటంతో మందు కొట్టినట్లు ఫొటోలు వీడియో మధు పంపిందని అందుకే మధు గ్యాంగ్‌లోకి వెళ్లిపోతున్నాం అని వాళ్లు అంటారు. మధు లోహితతో నీ పొగరు అణచాలని ఇలా చేశా అంతే కానీ నీ తొక్కలో ఫ్రెండ్స్ నాకు అవసరం లేదు అంటుంది. లోహిత రగిలిపోతుంది. రాత్రి మధుమిత పడుకొని ఉంటే కావేరి గుర్తొచ్చి అమ్మా అని కంగారు పడుతుంది. తల్లిదండ్రులతో పాటు చంటి లేచి మధుని హగ్ చేసుకొని దేవుడి బొట్టు పెట్టి పడుకోమని చెప్తారు. మధు తండ్రిని ఓడిలో పడుకొని కంగారు పడుతుంది. సుబ్బు భార్యతో రేపు ఒకసారి మధుని గుడికి తీసుకెళ్లమని చెప్తాడు.

లోహిత తనని మధు ఓడించిందని గుర్తు చేసుకొని రగిలిపోతూ ఉంటుంది. సరళ వచ్చి ఏమైందే అంత కోపం అని అడుగుతుంది. చందు కూడా వచ్చి ఏమైందని అడిగితే ఓ రాక్షసి మీద పిచ్చ కోపం ఉందని ఇంటర్, బీటెక్‌లో నేను అంటే అందరికీ హడల్‌ అలాంటిది ఆ రాక్షసి నన్ను హడల్ పెడుతుందని మధు గురించి చెప్తుంది. మధు అనగానే చందు గుర్తు చేసుకొని తను చాలా మంచిది అని అంటున్నారు అని అంటాడు. దానికి లోహిత తల్లితో మీ ఆయనకు నీ కొడుకుకి మనం తప్ప అందరూ మంచోళ్లులానే కనిపిస్తారని అంటుంది. అప్పట్లో చిన్నిని ఇప్పుడు ఈ మధుని సపోర్ట్ చేస్తున్నావని అలిగిపోతుంది. చిన్ని మీద అకారణంగా ద్వేషం పెంచుకున్నావ్ ఇప్పుడు మధు మీద పెంచుకుంటున్నావ్ అవన్నీ తగ్గించుకొని చదువు మీద ఇంట్రస్ట్‌ పెట్టు అని అంటాడు. 

మహి అమెరికా నుంచి వచ్చాడని పూజ చేయించడానికి నాగవల్లి  గుడికి వస్తుంది. నాగవల్లితో పాటు మహి, శ్రేయ, వసంత వస్తారు. మహి వాళ్లకి పూజారి వాళ్లు పూర్ణ కుంభంతో ఎదురు వచ్చి స్వాగతం పలుకుతారు. మహికి గొడుగు పట్టుకొని తీసుకెళ్తారు. ఇక మధుమితని తీసుకొని తల్లి, తమ్ముడు వస్తారు. చంటి మహిని గొడుగుతో తీసుకెళ్లడం చూసి తల్లిని కారణం అడిగితే గొప్పవాళ్లని అలాగే తీసుకెళ్తారని అంటుంది. దాంతో చంటి వెంటనే తల్లికి డబ్బులు అడిగి బయటకు వెళ్లి ఓ గొడుకు కొనుక్కొని వచ్చి అక్కకి ఫోన్ అడిగి అందులో దేవుడి పాట పెట్టి అక్కపై గొడుగు పెట్టి నువ్వు గొప్పదానివే నీకు ఇలా తీసుకెళ్తా అంటాడు. తమ్ముడి ప్రేమకి మధు కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మానాన్న నన్ను గొప్పగా ప్రేమిస్తే వాళ్లని మించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా అని ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు మా ఇంటి దేవతవి అక్క అని చంటి అంటాడు. కొడుకు ప్రేమకు తల్లి కూడా కన్నీరు పెట్టుకుంటుంది. మహిని గొడుగు కింద తీసుకెళ్తుంటే వెనకాలే చంటి అక్కని గొడుకు కింద తీసుకెళ్తాడు. అందరూ గుడిలోకి వెళ్తారు. పంతులు మహిని కోనేటి దగ్గరకు తీసుకెళ్లమని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!