Chinni Serial Today Episode ఉష టీచర్ చనిపోయిందని తెలిసి మహి చాలా బాధ పడతాడు. గోడ మీద ఉన్న ఫొటో ఫోన్‌లో తీసుకొని మిస్‌యూ టీచర్ అని అంటాడు. మధుమిత ఓ బస్తీకి వచ్చి ఆఫ్‌ టికెట్ కోసం వెతుకుతుంది. కనిపించిన అందర్ని అడుగుతుంది. 

Continues below advertisement


ఓ ఇంటిని చూసి అది ఆఫ్ టికెట్ ఇళ్లని గుర్తించి అక్కడికి వెళ్లి అడుగుతుంది. దాంతో ఆయన ఆఫ్ టికెట్ పదేళ్ల  క్రితమే వెళ్లిపోయారని చెప్తారు. మధు చాలా బాధ పడుతుంది. నాన్న గురించి ఎలా తెలుసుకోవాలా అని ఏడుస్తుంది. మరోవైపు మహి కూడా చిన్ని గురించి ఎలా తెలుస్తుందని తన ఫ్రెండ్ రాహుల్‌లో చెప్పుకొని బాధ పడతాడు. ఉష టీచర్ గురించి బాధ పడతాడు. రాహుల్ మహిని చూసి ఇలా కాదురా స్ట్రాంగ్ టీ తీసుకొస్తా నీ మనసు సెట్ అవుతుందని చెప్పి వెళ్తాడు. ఇంతలో పెద్ద వర్షం పడుతుంది. మహి వర్షంలో బయటకు వచ్చి నిల్చొని కళ్లు మూసుకొని చిన్నిని తలచుకుంటాడు. ఇంతలో మధు వచ్చి మహికి గొడుగు పడుతుంది. 


మహి మధుని చూసి ఏయ్ మధు నువ్వా అంటాడు. కాలేజ్‌కి వెళ్లలేదా అంటే చిన్న పని ఉండి బయటకు వచ్చా అంటుంది. ఇద్దరూ ఓ చోట కూర్చొంటారు. మహి మధుతో ఏంటి కేరింగా అని అంటాడు. దానికి మధు ఫైటింగ్ చేసి మరీ నన్ను కాపాడావు ఆ మాత్రం కేరింగ్ ఉండదా అని అంటుంది. మళ్లీ మధు థ్యాంక్స్ చెప్తుంది. దాంతో మహి ఎన్నిసార్లు చెప్తావ్ అని అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నిజానికి నువ్వు కాపాడింది నా ఒక్క దాని ప్రాణమే కాదు నా ఫ్యామిలీలో అందరి ప్రాణం కాపాడావు. నాకు ఏమైనా అయితే వాళ్ల బతకలేరు అని మధుమిత చెప్తుంది. 


మధు, మహి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అటుగా వచ్చిన శ్రేయ, లోహిత చూస్తారు. ఇదేంటి శ్రేయ అమ్మాయిలకు 3 అడుగులు దూరం పాటించే మీ బావ దానితో ఏంటి 3 అంగులాలు కూడా దూరం పాటించకుండా అలా అతుక్కుపోయాడేంటి అని అంటుంది. శ్రేయ రగిలిపోతుంది. మధు మహితో మన ఇద్దరం కాలేజ్‌లో గొడవ పడుతుంటాం కదా నన్ను ఎందుకు కాపాడావ్ అని అడుగుతుంది. అదేంటి అలా అడిగావ్ ప్రాబ్లమ్‌లో ఉంటే వదిలేయాలా అంటాడు. ఇక మూడు అడుగులు దూరం పాటిస్తావ్ కదా మరి నన్ను ఎందుకు ఎత్తుకున్నావ్‌ అని అడుగుతుంది. ప్రాణం ముఖ్యం కదా అంటాడు. దాంతో మధు దట్ ఈజ్ మహి అంటుంది. తర్వాత మధు మహితో పానీపూరి తిందామని తీసుకెళ్తుంది. 


శ్రేయ రగిలిపోతుంది. ఇప్పటి వరకు నేనే మా బావకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇదేంటి ఇన్ని సార్లు ఇస్తుంది. దాని అంతు చూస్తానని అంటుంది. లోహిత శ్రేయని ఆపుతుంది. ఇంతలో శ్రేయ పరీక్షల టైం టేబులు వస్తుంది. ఈ పరీక్ష నాకు కష్టం అని ఏడుపు మొఖం పెడుతుంది. దాంతో లోహిత నువ్వు పరీక్ష పాస్ అవుతావ్ అని ఎక్జామ్ పేపర్ కొట్టేయడం కోసం ప్లాన్ చెప్తుంది. నా కోసం ఇంత రిస్క్ చేస్తున్నావ్ థ్యాంక్స్ అని శ్రేయ అంటుంది.


మధు, మహి సరదాగా మాట్లాడుకుంటూ పానీ పూరీ బండీ దగ్గరకు వెళ్తారు మహి మధుని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్ అని మధు అడుగుతుంది. ఇక ఇద్దరికీ పానీ పూరీ ఇస్తారు. మహి ఎలా తినాలో అర్థం కాక పానీ పూరీ పట్టుకొని పైకి కిందకి చూస్తాడు. మధు తినమని చెప్తుంది. ఎలా తినాలో అర్థం కావడం లేదని మహి అంటాడు. దానికి మధు పానీపూరీ తినడం పెద్ద ఆర్ట్ నేను అందులో ఆర్టిస్ట్‌ని బాబు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది తిను అంటుంది. మహి మాత్రం చిన్నితో పానీ పూరీ తినడం గుర్తు చేసుకుంటాడు. సేమ్ డైలాగ్‌చిన్నప్పుడు చిన్ని చెప్పడం గుర్తు చేసుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.