Chinni Serial Today Episode మధుమితని లోహిత ఫాలో అవుతుంది. మధు ఇంటికి వచ్చే సరికి మధు ఫ్రెండ్ స్వప్న ఇంట్లో ఉంటుంది. ఎంత సేపు వెయిట్ చేయాలే అని అంటే మ్యాడీ వాళ్ల ఇంటికి వెళ్తున్నా అని అమ్మకి  చెప్పానే అంటుంది. ఇక తల్లికి వాయినం ఇస్తుంది. స్వప్నతో ఎలాగూ ఉన్నావ్ కదా తినేసి నోట్స్ తీసుకొని వెళ్దువులే అని అంటుంది. 

చంటి అక్కతో ఇలా పూజలు చేసి వాయినాలు తీసుకుంటే త్వరగా పెళ్లి అయిపోతుంది అక్క అంటాడు. తండ్రితో అక్కకి మంచి బంధం చూడు నాన్న అని అంటాడు. అంకుల్ మీరు చూస్తారో తనే చూసుకుంటుందో అని చెప్తుంది. దానికి మధు అంత సీన్ లేదు అంటే ఏమో మ్యాడీ సీన్ లోకి వస్తాడేమో అంటుంది. దాంతో మధు, స్వప్నని వెంటపడి తరుముతుంది. బయటకు వెళ్తూ లోహితను చూసి వెళ్తుంది. ఇక్కడున్నావేంటి లోహి అని అడుగుతుంది. దాంతో లోహిత పక్క వీధిలో ఫ్రెండ్ ఉంటే వెళ్లా నువ్వేంటి ఇంటి లోపలికి పిలవవా అని అడుగుతుంది. మధు లోహితను లోపలికి తీసుకెళ్తుంది. 

మధు లోహితను తన ఇంట్లో అందరికీ పరిచయం చేస్తుంది. భోజనం చేయమని స్వరూప అంటే ఇప్పుడు వద్దని లోహిత చెప్తుంది. ఇక మధుకి ఇళ్లు చూపించమని అంటుంది. మధు గది కూడా చూస్తుంది. అక్కడ చిన్ని ఫొటో చూసి బిత్తరపోతుంది. లోహిత టెన్షన్ పడటం మధు చూస్తుంది. లోహిత గోడ మీద ఉన్న చిన్ని ఫొటోలు అన్నీ చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్ అని మధు అడిగితే ఈ పాప ఎవరు అని లోహిత అడుగుతుంది. నేనే అని మధు చెప్తుంది. ఏంటి అంత షాక్  అవుతున్నావ్ అంటే అప్పుడు ఇప్పుడు వేరు వేరుగా అనిపించి అడిగా అని అంటుంది. లోహిత మధుని చూడటం మధు గమనిస్తుంది. స్వప్న మధుతో ఏంటి మధు లోహిత నిన్ను వెతుక్కుంటూ రావడం నిన్ను చూడటం ఏదో తేడాగా ఉందని అంటుంది. నాకు అదే అనిపిస్తుందని మధు అంటుంది. 

లోహిత రోడ్డు మీద కారు ఆపి ఇది ఎలా సాధ్యమైంది మళ్లీ అది నా జీవితంలోకి ఎలా వచ్చింది అని రగిలిపోతుంది. లోహిత ఫ్రెండ్ లోహికి కాఫీ ఇస్తే విసిరి కొడుతుంది. మధు గురించి ఆలోచిస్తున్నావా.. దాన్ని కాలేజ్‌లో దెబ్బకొడదాం అని అంటే మధు కాదు చిన్ని అని లోహిత అరుస్తుంది. చిన్ని ఎవరే అని లోహిని ఫ్రెండ్ అడిగితే పదేళ్ల క్రితం తప్పిన శని.. మళ్లీ నా జీవితంలోకి వచ్చింది. అది నా శత్రువు  దాని పేరు ఎత్తడమే నాకు చిరాకు.. దాని ముఖం చూడటమే నాకు చిరాకు అని చెప్తుంది.  ఆ మధు చిన్ని కాబట్టే నా కళ్లు దానిని గుర్తు పెట్టకపోయినా నా మనసు గుర్తు పట్టింది. అందుకే శత్రుత్వం కోరింది. నా తండ్రిని చంపిన దాన్ని వదలను  రేపటి నుంచి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటుంది. 

ఉదయం స్వప్న మధుకి కాల్ చేసి కాలేజ్‌కి రమ్మని చెప్తే ఈ రోజు రాను అని అంటుంది. మధు ఆటోలో వెళ్తుంది. ఇంతలో ఆటో రిపేర్ వస్తుంది. మధు నడుచుకుంటూ వెళ్తుంది. మనసులో ఈ టైంలో మ్యాడీ వస్తే నాకు లిఫ్ట్ వస్తే బాగున్ను కదా అనుకుంటుంది. అనుకోగానే మ్యాడీ వచ్చి మధు పక్కన ఆగుతాడు. మధు మనసులో ఇదేంటి మనసులో అనుకోగానే కళ్ల ముందు కనిపించాడు అని అనుకుంటుంది. మహి మధుతో నువ్వేంటి ఇక్కడ అంటాడు. మా ఫ్రెండ్ రాలేదు అని అంటుంది. మహి మధుతో సరేలే ఆటో కోసం వెయిట్ చేద్దాం అని అంటే చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఒక్క ఆటో కూడా రావడం లేదు అంటుంది. ఇక మధు మహితో నీ బైక్ ఎక్కించుకోవచ్చు కదా అంటే దానికి మహి నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని బైక్ ఎక్కించుకోలేదు అది కుదరదు కావాలంటే ఎంత సేపు అయినా వెయిట్ చేస్తా అంటాడు.  

మధు మహితో సరే ఒక పని చేద్దాం బొమ్మా బొరుసు వేద్దాం.. మూడు సార్లు బొమ్మాబొరుసు వేద్దాం రెండు సార్లు బొమ్మ పడితే నన్ను ఎక్కించుకో రెండు సార్లు బొరుసు పడితే నన్ను ఎక్కించుకోవద్దు అంటుంది. నీకు దేవుడు ఇష్టం కాబట్టి దేవుడు ఏం డిసైడ్ చేస్తే అది చేద్దాం అని మధు అంటుంది. మహి సరే అంటాడు. మొదటి సారి బొరుసు పడితే మహి ఎస్ అనుకుంటాడు. ఇక తర్వాత రెండు సార్లు బొమ్మ పడుతుంది. దాంతో మధు తనని బైక్ ఎక్కించుకోమని చెప్తుంది. మన ఇద్దరి మధ్య బ్యాగ్ అడ్డు పెట్టుకుందామని మహి అంటాడు. అసలే నేను త్రీ ఫీట్ దూరం పాటిస్తా కదా  అంటాడు. ఏం పర్లేదు అని మధు బైక్ ఎక్కుతుంది. లోహిత చూసి శ్రేయకి ఫొటో పెడతానని ఇద్దరినీ ఫొటో తీసి శ్రేయకి పంపిస్తుంది. 

శ్రేయ షాక్ అయి లోహిత దగ్గరకు పరుగున వస్తుంది. లోహిత తన ఫ్రెండ్స్ వాళ్లని చూపించి లవర్స్‌లా వస్తున్నారు అని అంటారు. మ్యాడీ నిన్నే ఎక్కించుకోడు అలాంటిది వాళ్లు ఎలా వస్తున్నారో చూడు అంటుంది. శ్రేయ వాళ్లు మహి దగ్గరకు వెళ్తారు. మహి శ్రేయకి విషయం చెప్తాడు. ఇంతలో సీనియర్స్ వచ్చి ఫ్రెషర్స్ డే పార్టీకి మీటింగ్ ఉందని పిలుస్తాడు. మరోవైపు నాగవల్లి, దేవాలు పోలీసుల్ని పిలిచి బాలరాజు గురించి చెప్పి ఫొటోలు పెట్టి బాలరాజు ఎక్కడున్నా కనిపెట్టి వివరాలు ఇవ్వమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.