Brahmamudi Serial Today Episode: రాజ్‌కు నిజం తానే ముందు చెప్పాలని వెళ్లిన రుద్రాణి రాజ్‌ను మధ్యలో కలుస్తుంది. రుద్రాణిని చూసిన రాజ్‌ కావ్య రాకుండా తను వచ్చిందేంటి అనుకుంటాడు.

రాజ్: మీరెందుకు వచ్చారు

రుద్రాణి: కావ్య రాదు కాబట్టే నేను వచ్చాను

రాజ్: ఎందుకు రాదు

రుద్రాణి: తను రాకూడదు కాబట్టి రాలేదు

రాజ్: నేను అమెరికా వెళ్తున్నాను అంటే తప్పకుండా వస్తుంది. నాకు నమ్మకం ఉంది తను తప్పకుండా వస్తుంది

రుద్రాణి: నేను కూడా అదే నమ్మకంతో చెప్తున్నాను. తను రాదు

రాజ్‌: ఏంటా నమ్మకం

రుద్రాణి: తను నిన్ను ఫేస్‌ చేయలేదు కాబట్టి

రాజ్‌: ఎందుకు ఫేస్‌ చేయలేదు

రుద్రాణి: నిజం బయటపడుతుంది కాబట్టి

రాజ్: ఏంటా నిజం

రుద్రాణి: అది నేను చెప్పలేను రామ్‌

రాజ్‌: అబ్బా మీ అందరికీ ఏమైందండి అందరూ ఏదో నిజం ఉందంటారు. ఏంటా నిజం అంటే ఎవ్వరూ చెప్పరు ఎందుకు.. అయినా మీరు ఇప్పుడు ఇక్కడకు ఎందుకొచ్చారు చెప్పండి

రుద్రాణి: నిన్ను ఆపడానికి నువ్వు కావ్యను వదిలేసి ఇలా వెళ్లడం నాకు ఇష్టం లేదు..

రాజ్‌: అయితే మీరే ఉండండి నేను వెళ్లిపోతాను.

అంటూ రాజ్‌ వెళ్లిపోతుంటే..

రుద్రాణి: కళావతి కడుపుతో ఉంది రామ్‌

రాజ్‌ షాక్‌ అవుతాడు.

రాజ్: ఏంటండి మీరు చెప్పేది

రుద్రాణి: అవును నేను చెప్పేది నిజం రామ్‌.. ఇన్ని రోజులు నువ్వు తన వెంట పడుతున్నా..? నీ ప్రేమను ఓప్పుకోకపోవడానికి కారణం తను ప్రెగ్నెంట్‌ కాబట్టి ఒప్పుకోలేదు.

కావ్య వస్తుంది.

కావ్య:  ఏవండి మీతో ఒక విషయం చెప్పాలి

రాజ్‌:  నువ్వు ప్రెగ్నెంటా..?

కావ్య షాక్‌

రుద్రాణి: నన్ను క్షమించు కళావతి రామ్‌ను ఆపడానికి నిజం చెప్పక తప్పలేదు.

సడెన్‌ గా రాజ్‌ గట్టిగా నవ్వుతాడు

రాజ్‌: ప్లాన్‌ అదిరిపోయిందండి.. దీని మొత్తానికి సూత్రధారి ఎవరు..? మీరేనా..? అయినా మీరు కడుపుతో ఉన్నారంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నారు.

రుద్రాణి: ( మనసులో) ఓరి తింగరోడా..? నేను చెప్పిందంతా అబద్దం అనుకున్నావా ఏంటి..?

రాజ్‌: జోక్‌ అదిరిపోయిందండి. నవ్వలేక చచ్చిపోయాను అనుకోండి..  అయినా ఇలాంటి ప్రాంక్స్‌ అన్నీ వేరే వాళ్ల మీద వేసి ఉంటే నమ్మేవాణ్నేమో.. మీరేంటో.. మీ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా పెళ్లి కాకుండానే.. మీరు కడుపుతో ఉన్నారని చెబితే నమ్మడానికి నేను పిచ్చోణ్ని అనుకున్నారా..?

కావ్య: అయ్యో రామ్ గారు నమ్మండి నేను చెప్పేది నిజం నేను ప్రెగ్నెంట్‌ ని మీకు దూరంగా ఉండటానికి.. మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం కూడా ఇదే.. నేను తల్లిని కాబోతున్నాను.. ఇక నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంది.

అంటూ కావ్య వెల్లిపోతుంది.

రుద్రాణి: కళావతి గురించి నువ్వు బాగా అర్తం చేసుకున్నావు కదా రామ్‌.. తను ఏడుస్తూ చెప్పినా ఇంకా నమ్మవా..? తను కడుపుతో ఉంది. త్వరలోనే ఒక బిడ్డకు జన్మని కూడా ఇవ్వబోతుంది. ఇది నువ్వు నమ్మలేని నిజం

అంటూ రుద్రాణి వెల్లిపోతుంది. రాజ్‌ ఆలోచిస్తూ తల తిరిగిన వాడిలా కిందపడబోతూ కారును పట్టుకుంటాడు. కట్‌ చేస్తే రాజ్‌, అపర్ణ, ఇందిరాదేవిలతో మాట్లాడుతూ ఉంటాడు. కావ్య చెప్పేది నిజమేనా అని అడుగుతాడు. నిజమే అని అపర్ణ, ఇందిరాదేవి చెప్పగానే.. రాజ్‌ వాళ్లను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంట్లోకి వచ్చిన అపర్ణ, ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తిడతారు. మరోవైపు యామిని అమ్మానాన్న రాజ్‌ దగ్గరకు వెళ్లి ఓదార్చి యామినిని పెళ్లి చేసుకోమని అడుగుతారు. రాజ్‌ చేసుకోనని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!