Ammayi garu Serial Today Episode కోమలి సూర్యప్రతాప్‌ ఇంట్లో డబ్బు దొంగతనం కోసం తన లవర్‌ అశోక్‌ని పిలిపిస్తుంది. అశోక్ పార్టీలో సర్వర్ అవతారం ఎత్తుతాడు. అందరికీ కూల్ డ్రింక్‌లు పంచుతూ ఉంటాడు. కోమలి అశోక్‌కి మేడ మీద డబ్బు ఉన్న గదికి పంపిస్తుంది. 

Continues below advertisement


విజయాంబిక కోమలితో ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నావ్.. డబ్బు దొంగిలించేస్తానని అన్నావ్ ఏం చేస్తున్నావా లేదని అడుగుతుంది. కోమలి విజయాంబికకు చెప్తే ప్రమాదం అని చెప్పదు.. అశోక్ డబ్బు ఉన్న గదిలోకి కూల్‌డ్రింక్స్‌ పట్టుకొని వెళ్తే రాజు చూసి పిలిచి అక్కడ ఎవరూ ఉండరు కిందకి వెళ్లు అని చెప్తాడు. విజయాంబిక కోమలిని చూసి ఏదో జరుగుతుందని అనుకుంటుంది. రాజు అశోక్‌ని చూసి అనుమానపడతాడు. కోమలి కవర్ చేయడానికి సూర్యప్రతాప్‌ దగ్గరకు వెళ్లి రాజు వచ్చాడు కేక్ కటింగ్ చేయిద్దామని అంటుంది. మందారానికి రూప సైగ చేస్తుంది. 


రూప సైలెంట్‌గా పక్కకి వచ్చేస్తుంది. విజయాంబిక చూసి ఏంటి ఇది ఇంత సైలెంట్‌గా ఉంది అని అనుకుంటుంది. బంటీ దేవుడికి దండం పెట్టుకుంటూ నేను అమ్మ తెచ్చిన కేకే తినేలా చేయు స్వామి అని మొక్కుకుంటాడు. కోమలి కేక్ తీసుకొస్తూ ఉంటుంది. కోమలి రూపని చూసి తీసుకొస్తూ ఉంటుంది. రూప పొగరుగా చూస్తూ ఉంటుంది. కోమలి కేక్ తీసుకొస్తుంటే రూప కోమలి కాళ్లలో కాలు పెట్టేస్తుంది. దాంతో కోమలి కింద పడిపోతుంది. కేక్ ముఖానికి అంటుకుంటుంది. రూప, రాజులు నవ్వుకుంటారు. సూర్యప్రతాప్‌ వచ్చి అమ్మా రూప చూస్తూ నడవాలి కదా అని అంటుంది. రూప కోమలిని చూసి కళ్లు ఎగరేస్తూ నవ్వు ఆపుకుంటూ నవ్వుతుంది. కోమలి ఉడికిపోతుంది. 


రాజు సూర్యప్రతాప్‌తో కేకు లేదు ఇప్పుడు ఎలా అంటే విరూపాక్షి రాజుతో మన రుక్మిణి కూడా కేక్ తెప్పించింది. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకొస్తుందని అంటుంది. సూర్యప్రతాప్‌ రుక్మిణికి కేక్ తీసుకురమ్మని చెప్తాడు. కోమలి ముఖం కడుక్కోవడానికి వెళ్తుంది. రూప కేక్ తీసుకురావడంతో బంటీ చాలా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. కోమలి లవర్ అశోక్ కోమలితో నా మందు నీకు అవమానం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా రూపని చంపేస్తా అంటాడు. 


కోమలి అశోక్‌ని ఆపి ముందు డబ్బు కొట్టేద్దామని అంటుంది. ఇక విరూపాక్షి, రూపలు సైగ చేసుకొని బంటీకి సైగ చేస్తారు. దాంతో బంటీ ఆకలేస్తుంది త్వరగా కేక్ కట్ చేద్దామని అంటాడు. కాసేపు ఆగుదామని సూర్యప్రతాప్‌ అంటే రాజు, బంటీ అందరూ సూర్యప్రతాప్‌ని ఒప్పిస్తారు. దాంతో రూప, రాజులు బంటీతో కేక్ కట్ చేయిస్తారు. సూర్యప్రతాప్‌ రుక్మిణికే తినిపించమని అంటారు. అందరూ సంతోషంగా భర్త్‌డే చేస్తారు. కోమలి చూసి రగిలిపోతుంది. కోమలి దగ్గరకు రాజు, రూపలు వెళ్లి చెప్పా కదా బంటీ నేను తెచ్చిన బట్టలే వేసుకుంటాడు.. నేను తెచ్చిన కేక్ కట్ చేస్తాడని చెప్పా కదా అంటుంది. ఈ సారి నేను మిమల్ని దెబ్బ కొడతా తట్టుకోలేరు రెడీగా ఉండండి అంటుంది. 


బేరర్‌లు ఇద్దరూ మరోపార్టీ ఉంది అక్కడికి వెళ్దాం మన ఇద్దరికీ ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటారు. రాజు ఆ మాట విని మీరు ఎంత మంది అని అడుగుతాడు. మేం ఇద్దరమే అని అంటారు. మూడో వాడు ఎవరు అని రాజు అడిగితే మాకు తెలీదు సార్ మీరే పిలిపించారని అనుకున్నాం అంటారు. ఏదో జరుగుతుందని రాజు మేడ మీదకు వెళ్తాడు. అప్పటికే అశోక్‌ డబ్బు దొంగతనం చేస్తాడు. రాజు ఆ గదికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.