Meghasandesam Serial Today Episode: శివ మెట్ల మీద కూర్చుని చదువుకుంటుంటే రత్న వస్తుంది. అపూర్వ చూపించిన బొమ్మ కోసం ఇంట్లో పని మనిషిలా చేరాలనుకుంటుంది. రత్న. శివను సార్‌ అంటూ పిలుస్తుంది.

శివ: చూడమ్మా ఇంట్లో ఎవ్వరూ లేరు నేను ఏమీ ఇవ్వలేను అలా వెళ్లిరా..?

రత్న: అయ్యో సార్‌ నేను అడుక్కునే దాన్ని కాదు. పని అడుగుదామని..

శివ: వద్దు వద్దు ఇక నాకేం చెప్పొద్దు. పని కూడా అడుక్కోవడమే.. ఈ ఇంట్లో ఉండేది నలుగురం.  నేను ఈ ఇంటికి ఎక్ర్టా టికెట్‌ను. ఎవరి పని వాళ్లే చేసుకుంటాము నువ్వు బయలుదేరు అమ్మ. నీకే అమ్మా చెప్తుంది వెళ్లు.

ఇంతలో అక్కడికి పూర్ని వస్తుంది.

పూర్ణి: ఎవరండి

రత్న: నమస్తే అమ్మా పని అడుగుదామని వస్తే నా మాటలు పూర్తిగా వినకుండానే సార్‌ వెళ్లిపోమ్మంటున్నారు.

పూర్ణి: ఏంటి సారా..? వీడా..? ఏం శివ మా ఇంట్లో పని లేదని ఈవిడకు చెప్పేంత పెద్దొడివి అయ్యావా..?

శివ: అవును చెప్పాను..?

పూర్ణి: ఈ ఇంట్లో పని లేదని చెప్పడానికి నువ్వెవరు..? ఇదిగో నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో పని లేదు వెళ్లిపోండి..

రత్న: అది కాదు మేడం..

పూర్ణి: నేను వెళ్లిపో అని చెప్పిన తర్వాత ఇక మాట్లాడ్డానికి లేదు. వెళ్లండి..

రత్న: మేడం అది కాదు మేడం ఒకసారి నేను చెప్పేది వినండి.   

పూర్ణి: వెళ్లిపో అని చెప్తున్నాను కదా..? వినవేంటి..? వెళ్లిపో ఇక్కడి నుంచి

ఇంతలో శారద వస్తుంది. న

శారద: ఎవరమ్మా నువ్వు

రత్న: నమస్తే మేడం నా పేరు రత్న మేడం. పనికొచ్చానని చెప్పిన వెంటనే నా మాటలు పూర్తిగా వినకుండా వీళ్లిద్దరూ వెళ్లిపోమ్మని చెప్తున్నారు మేడం.

శారద: నేను వింటాను ఏమిటో చెప్పు..

రత్న: ఇంతకు ముందు మీ ఇంట్లో పని చేసే రమణమ్మ ఉండేది కదా మేడం.

శారద: అవును ఊరొదిలి పది రోజుల్లో వస్తానని చెప్పింది. నెల అవుతున్నా రాలేదు. ఏంటి విషయం.

రత్న: నేను ఆ ఊరి దాన్నే మేడం. వాళ్లాయన ఇప్పుడు ఖతార్‌ నుంచి బాగా సంపాదించి పంపిస్తున్నాడు.  వాళ్లకు తిండికి ఏ లోటు లేదు. మా పరిస్తితే చాలా గోరంగా ఉంది మేడం. మా ఆయన ఆరోగ్య పరిస్థితి అంతతమాత్రమే మా గురించి తెలిసి రమణమ్మ మీ గురించి చెప్పింది మేడం

అంటూ ఏడుస్తుంది రత్న. దీంతో శారద, రత్నను ఇంట్లోనే ఉండమని చెప్తుంది. తర్వాత భూమి అకాడమీలో డాన్స్‌ నేర్పింస్తుంటే మళ్లీ ఉదయ్‌ వెళ్తాడు. గుడ్‌ మార్నింగ్‌ భూమి అని చెప్పగానే.. భూమి చూసీచూడనట్టు ఉంటుంది. ఉదయ్‌ డల్లుగా అయిపోతాడు.

భూమి: మీరు కాసేపు వెయిట్‌ చేయండి నేను మీకు తర్వాత నేర్పిస్తాను.

ఉదయ్‌: గగన్‌ నిన్ను ఇంకా ప్రేమిస్తున్నట్టే ఉన్నాడు.

భూమి: నిజమా..? నాకు ఆ విషయం అర్తం కాలేదే..?

 అంటూ మాట్లాడుకుంటుంటే అప్పుడే కొంత మంది పిల్లలను తీసుకుని వచ్చి మీరు వెస్ట్రన్‌ డాన్స్‌ కూడా నేర్పిస్తారా..? అని అడగ్గానే..

భూమి: లేదండి ఇక్కడ నాట్యం మాత్రమే నేర్పిస్తాము..

అని చెప్పగానే వాళ్లు వెళ్లిపోతుంటారు.

గగన్‌: హలో ఆగండి ఇప్పటి నుంచి ఇక్కడ వెస్ట్రన్‌ డాన్స్‌ కూడా నేర్పిస్తాము.

భూమి: గగన్‌ గారు ఏం చెప్తున్నారు మీరు..?

గగన్‌: అవును నేర్పిస్తాము.. మీకు నేర్పించడం ఇష్టం లేకపోతే నేను నేర్పిస్తాను. ఈ మధ్య నేను కూడా శోభాచంద్ర గారి వీడియో చూశాను. అన్ని సంస్కృతులను గౌరవించడమే మన భారతీయ తత్వం అని చెప్పింది. పైగా వెస్ట్రన్‌ డాన్స్‌ కూడా నేర్పిస్తాం అంటే ఆవిడకే కదా మంచి పేరు వస్తుంది.

అంటూ గగన్‌ చెప్పి ఆ పిల్లలను అకాడమీలో చేర్పిస్తుంటే.. భూమి నవ్వుతుంది. ఉదయ్‌ ఇరిటేటింగ్‌గా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!