Prema entha madhuram september 16th: ఈరోజు ఎపిసోడ్ లో టీచర్ అక్కి అభయ్ లను ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకెళుతుంది.  అప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళ చదువు గురించి పంపించేస్తుంది. పిల్లల్ని చూసి ఛాయాదేవి మాన్సిలు షాక్ అవుతారు.


మాన్సి: వీళ్ళా బ్రొ యిన్ లా పిల్లలు అందుకే ఆరోజు అంత ధైర్యంగా మనల్ని ఎదిరించారు.


ఛాయాదేవి: ఆర్య వర్ధన్ వారసులు కదా పోలికలు వచ్చుంటాయి. నువ్వు ఇక్కడే ఉండి అనుని అబ్జర్వ్ చేస్తూ ఉండు. నేను వెళ్లి ఆర్యతో మాట్లాడి వస్తాను అని మాన్సిని అక్కడే ఉంచి ప్రిన్సిపల్ తో పాటు ఆర్య దగ్గరికి వెళుతుంది ఛాయాదేవి.


మాన్సి: ఇంతవరకు దాక్కొని భలే తప్పించుకున్నావ్ అను. ఇప్పుడు చూడు నువ్వెక్కడుంటున్నావో నీ అడ్రస్ అన్ని తెలుసుకొని నిన్ను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తానో అని తనలో తానే అనుకుంటుంది. మరోవైపు మీటింగ్ దగ్గర అందరూ అటెండ్ అవుతారు.


ఎమ్మెల్యే: కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కదా మళ్లీ ఎందుకు ఈ డిస్కషన్స్ అన్ని?


ఛాయాదేవి: ప్రిన్సిపల్ దగ్గర ఉన్న డాక్యుమెంట్ నకిలీవి అని కోర్టు చెప్పింది. ఇంకా ఈ స్కూల్ నాదే. అని చెప్పగా జెండే ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తాడు. ఇవి నకివి అని జెండే చెప్పగా ఆర్య మౌనంగా ఉంటాడు.


ఛాయాదేవి: మర్యాదగా నా దారిలోకి వచ్చి నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి ఆర్య వద్దన్.


ప్రిన్సిపల్: అవును సార్ ఇంక పరిస్థితి మన చేతిలో లేనట్టే ఉన్నది. జరిగిందేదో జరిగిపోయింది అనుకొని మర్చిపోదాం. అని అనగా ఆర్య ఏం మాట్లాడకుండా టైం చూస్తూ ఉంటాడు.


ఛాయాదేవి: ఏంటి ఏం మాట్లాడకుండా పదేపదే వాట్ చూస్తూ ఉన్నారు? మీకు బాడ్ టైం ఉన్నది అని ఇప్పుడే తెలుసుకుంటున్నారా?


ఆర్య: ప్రిన్సిపల్ గారు మీ స్కూల్ మెయిల్ కి ఒక డాక్యుమెంట్ వచ్చింది. దాన్ని ఇప్పుడే ప్రింట్ తీసుకొని రండి అని అనగా ప్రిన్సిపల్ వెంటనే డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకొని తెస్తాడు. వాటిని ఛాయాదేవికి ఇవ్వగా అవి చూసిన ఛాయాదేవి షాక్ అవుతుంది. దాన్ని ఛాయాదేవి తరఫున లాయర్ కూడా చదువుతాడు.


లాయర్: వికాస్ వర్మ అనే వ్యక్తికి మీరు ఈ ల్యాండ్ ని 12 ఏళ్ల క్రితం అమ్మినట్టు ఆధారాలతో పాటు ఈ పేపర్ లో ఉన్నాయి.


జెండే: 12 ఏళ్ల క్రితం నువ్వు వికాస్ వర్మకి ఆ ల్యాండ్ అమ్మితే తను స్కూల్కి దానం చేశాడు. దాన్ని మీరు తిరిగి కబ్జా చేద్దామని కుట్ర పండుతున్నారు తప్పు కదా! అందుకే ఆర్య ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నాడు.


ఎమ్మెల్యే: నాకు ఒక విషయం అర్థమైంది. మీరు ఆర్య సార్ కి చెక్ పెట్టాలనుకుంటే ఆయన చెక్కుచెదరకుండా కూర్చొని మీకన్నా పై ఎత్తేసి మీకు చెక్ పెట్టారు. ఇంక ఈ విషయం తేలిపోయింది కదా నేను బయలుదేరుతాను. ఒక విషయం ఆర్య గారు మీరు దయచేసి పాలిటిక్స్ లోకి మాత్రం రావద్దు. అందరినీ పాలిష్ చేసేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


ఛాయాదేవి: లేదు ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్


ఆర్య: ఏవీ నకిలీవో ఏవి అసలైనవో కోర్టులో తేల్చుకుందాం.


ఛాయాదేవి: ఇది ఇప్పుడే అయిపోయిందనుకోవద్దు. ఎలాగైనా నీకన్నా పై ఎత్తేసి ఈ ల్యాండ్ ని నా సొంతం చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రిన్సిపల్ ఆర్య ముందు తలదించుకొని ఉంటాడు.


ఆర్య: మొన్నటి వరకు ఒరిజినల్ గా ఉండే డాక్యుమెంట్స్ ఒకేసారి ఫేక్ గా ఎలా అయ్యాయి అని నేను అడగను. ఎందుకంటే లోకం అంటే ఏంటో తెలియని పిల్లలు కూడా ఈ స్కూల్ ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. లోకజ్ఞానం తెలిసిన మీరు డబ్బుకి అమ్మడు పడిపోతున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


ఆ తర్వాత సీన్ లో ఛాయాదేవి మాన్సి దగ్గరికి వస్తుంది. లోపల ఏమైంది అని మాన్సి అడగగా అదంతా తర్వాత ముందు పద కార్లోకి వెళ్లి అనుని ఫాలో అవుదాం అని అంటుంది ఛాయాదేవి. అదే సమయంలో పిల్లలు ఇద్దరు అను దగ్గరికి వస్తారు.


Also Read : 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: స్కూల్ ని కాపాడుతానని అక్కికి మాటిచ్చిన ఆర్య - అను పిల్లలని చూసిన ఛాయాదేవి, మాన్సీలు?


అను: రాఖీ పండగ బాగా జరిగిందా? ఇంక మన ఇంటికి బయలుదేరుదాము.


అక్కి: చూడమ్మా నా ఫ్రెండ్ నాకు చాక్లెట్ ఇచ్చారు.


అభయ్: నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను అక్కి ఆయనతో ఎక్కువ మాట్లాడొద్దు అని. మళ్లీ ఎందుకు ఇలాంటి గిఫ్ట్స్ తీసుకుంటున్నావు?


అక్కి: నేను కూడా వద్దనే చెప్పాను రా అన్నయ్య కాకపోతే ఆయనే బలవంతం చేసి నాకు ఇచ్చారు


అను: పర్లేదు అభయ్ ఈరోజు పండగ కదా ఏమిచ్చినా దాన్ని ఆశీర్వాదంలాగే తీసుకోవాలి. అని అనగా అభయ్  సైలెంట్ గా ఉంటాడు.  అప్పుడు అను అభయ్ నీ ఎత్తుకుని కితకితలు పెడుతూ ఉంటుంది. అప్పుడు అభయ్ నవ్వుతాడు. అభయ్ ని చూసి అక్కి కూడా నవ్వుతుంది. అదే సమయంలో ఆర్య అక్కడికి వచ్చి వెనక నుంచి అక్కి వాళ్ళని చూస్తాడు. ఆర్యకి అను వెనకనుంచి కనిపిస్తుంది.


ఆర్య: అను ఎక్కడుందో... ఏం చేస్తుందో? మా పిల్లలు కూడా ఈపాటికి ఇంతే వయసులో ఉండుంటారు కదా. నేను ఎప్పటికీ వాళ్లని  కలుస్తానో అని మనసులో అనుకుని కారు ఎక్కుతాడు. 


ఆ తర్వాత అను పిల్లలిద్దరిని ఆటోలో తీసుకొని ఇంటికి వెళుతుంది. వెనకన మాన్సీ ఛాయాదేవిలు వాళ్లని ఫాలో అవుతూ ఉంటారు. వెనక నుండి ఏదో కారు వస్తుంది అని గమనించిన అను రూట్ మార్చి వేరొక దిక్కు నుంచి వెళ్తుంది. అయినా సరే వాళ్ళు వెంబడించి ఇంటి వరకు చేరుకుంటారు. పిల్లలిద్దరూ ఇంటి లోపలికి వెళ్లిపోయిన తర్వాత మాన్సి, ఛాయాదేవిలు అను దగ్గరికి వస్తారు. వాళ్లని చూసిన అను షాక్ అవుతుంది


ఛాయాదేవి: అక్కడ మునిగిన దానివి ఇక్కడ తేలావనమాట


మాన్సి: పిల్లలు పెద్దవాళ్ళు అయినట్టున్నారు. మంచి అనుబంధమే ఉన్నట్టు ఉన్నది నీతో ఇప్పుడు వాళ్ళకి నువ్వు దూరమైతే ఏమవుతుందో మరి.


అను: నోరు మూయండి ఇలాంటివి జరుగుతాయనే నేను మీ అందరికీ కనిపించకుండా ఇక్కడకి వచ్చాను. అయినా సరే వెంట తరుముకుంటూ వచ్చారు. పిల్లల్ని నా దగ్గర నుంచి దూరం చేద్దామనే ఆలోచనతో గాని మీరు వచ్చి ఉంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు.


ఛాయాదేవి: పిల్లల్ని నీకు దూరం చేద్దామని కాదు, నిన్ను నీ పిల్లల్ని వాడుకొని నీ మొగుడిని సాధిద్దామని వచ్చాను.


అను: మహా అయితే ఏం చేస్తారు పెళ్లి చేసుకోమంటారు అంతే కదా అని అనగా ఆ మాటలకి ఛాయాదేవి, మాన్సీలు ఆశ్చర్యపోతారు.


Also Read: Brahmamudi September 16th: రాజ్ ప్రవర్తనకి తల్లడిల్లిన తల్లి హృదయం- స్వప్న ఏమైంది - ఆందోళనలో కనకం


Join Us On Telegram: https://t.me/abpdesamofficial