Prema entha madhuram september 15th: ఈరోజు ఎపిసోడ్ లో అభయ్ అక్కికి పట్టీలు పెట్టగా అక్కి సంతోషంగా పట్టీలను కదుపుతూ ఉంటుంది. అప్పుడు ఇద్దరూ వెళ్లి లవ్ యూ అనీ అనూనీ హద్దుకుంటారు.
అను: లవ్ యూ బంగారాలు
అక్కి: అమ్మ ఈ రోజు స్కూల్ కి త్వరగా వెళ్లాలి. స్కూల్లో అందరికీ కూడా రాఖీ కట్టేస్తాను అని అనగా అను సరే అని అంటుంది. ఆ తర్వాత సీన్లో ఛాయాదేవి వాళ్ళ లాయర్ వాళ్ళ ఇంటికి వస్తాడు.
లాయర్: ఆ స్కూల్ ల్యాండ్ మనదే అని ఆ ప్రిన్సిపల్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నకిలీ వి అని కోర్టులో రుజువైంది. ఇంక ఆ లాండ్ అఫీషియల్ గా మీ సొంతమే.
ఛాయాదేవి: మంచి మాట చెప్పారు లాయర్ గారు
లాయర్: మరి నేనున్నానంటే ఆ కేసు గెలవాల్సిందే.
ఛాయాదేవి: ఆ ప్రిన్సిపల్ కి డబ్బులు ఇచ్చి ఒరిజినల్స్ బయట పెట్టకుండా ఆపించింది నేను. క్రెడిట్ అంతా మీ మీద వేసుకోవద్దు. ఇంక ఈ శుభవార్తతో ఆర్యని ఎలా ఆడుకుంటానో చూడండి అని అంటుంది. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి కోర్టులో గెలిచిన విషయం అంతా చెప్తుంది ఛాయాదేవి.
ప్రిన్సిపల్: చాలా మంచిది ఛాయాదేవి గారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
ఛాయాదేవి: ఈ విషయం ఆర్య కి చెప్పి నేనేం చెప్తే అది చేయండి అప్పుడే స్కూల్ దక్కుతుంది అని సలహా ఇవ్వండి. అని అనగా సరే అని ఫోన్ పెట్టేస్తాడు ప్రిన్సిపల్. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆర్య కి ఫోన్ చేస్తాడు.
ప్రిన్సిపల్: సార్ కోర్టులో ఛాయాదేవి వాళ్ళు గెలిచారు. ఆ లాండ్ వాళ్ళదే అని అంటున్నారు. ఇక స్కూల్ మన చేజారిపోయేలా ఉన్నది సార్. నాకెందుకో ఛాయాదేవితో పంతాలు పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడడం మంచిది అనిపిస్తుంది సర్. వందల మంది పిల్లలు జీవితాలు కదా మీరు సరే అంటే మీటింగ్ అరేంజ్ చేపిస్తాను ఏదో ఒకటి చేద్దాం.
ఆర్య: పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది ఆలస్యం చేయొద్దు. మీటింగ్ ఏర్పాటు చేయండి. అని అనగా ఫోన్ పెట్టేసిన ప్రిన్సిపల్ ఛాయాదేవికి తిరిగి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు.
ఛాయాదేవి: పిల్లల విషయం అంటే ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాడు ఆర్య వర్ధన్. ఇప్పుడు చెప్తాను నా దారిలోకి ఎలా తెప్పించుకోవాలో అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో అంజలి, వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.
అంజలి: ఏంటి మామ్ నువ్వు చెప్పేది మన ప్రాపర్టీస్ లో చాలా మటుకు ఇంకెవరికో వెళ్లిపోయాయా అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? నేను ఆర్య సార్ తో మాట్లాడి కనుక్కుంటాను ఏం భయపడొద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో తనకి ఒక టెలిగ్రామ్ వచ్చింది అని సెక్యూరిటీ ఆ పేపర్లను అంజలికి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ పేపర్లను చూసిన అంజలి షాక్ అవుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నీరజ్ ఏమైంది అని అడుగుతాడు.
అంజలి: ఆ ఛాయాదేవి, ప్రాపర్టీస్ విషయంలో నేను ఫ్రాడ్ చేశానని కోర్టు నోటీసు పంపించింది నీరజ్. అని చెప్తూ ఉండగా ఛాయాదేవి అంజలికి ఫోన్ చేస్తుంది.
ఛాయాదేవి: ఛాయాదేవి ఇక్కడ.
అంజలి: నువ్వా? అసలు నీకు ఎంత ధైర్యం ఫేక్ పేపర్స్ క్రియేట్ చేసి నాకే కోర్టు నోటీసు పంపుతావా?
ఛాయాదేవి: అది ఫేక్ ఆ ఒరిజినల్ ఆ అనేది అనవసరం. 1400 కోట్లు మీ దగ్గర తీసుకుంటాను లేకపోతే అంజలి కన్స్ట్రక్షన్స్ అంతా నా పేరు మీద రాయించుకుంటాను.
అంజలి: నువ్వలా చేస్తే చేతకాని దానిలాగా చూస్తూ కూర్చోను. ఆర్య సార్ ఈ విషయం డీల్ చేస్తారు.
ఛాయాదేవి: ఈలోగా నీదంటూ ఏదీ లేకుండా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
తర్వాత అంజలి ఆర్య కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది.
ఆర్య: నువ్వేం భయపడొద్దు అంజలి. నేను ఈ విషయం తెలుసుకున్నాను. మీ పేరెంట్స్ ఒక వ్యక్తిని నమ్మి తనని బినామీగా పెడితే తను ఫేక్ సిగ్నేచర్ తో ప్రాపర్టీస్ అన్ని తన వైపు లాక్కుంది. ఛాయాదేవి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి షేర్స్ తీసుకోవాలనుకుంటుంది. నువ్వు కంగారు పడొద్దు ఈ విషయాన్ని నేను డిల్ చేస్తాను. అని ఫోన్ పెట్టేస్తాడు.
జెండే: ఛాయాదేవి మనల్ని అన్ని రకాలుగా అటాక్ చేయాలని చూస్తుంది.
ఆర్య: చెయ్యనీ జెండే మనకి ఇవన్నీ అలవాటే కదా. తన ఆటలుకి కూడా చెక్ పెట్టే రోజు త్వరలోనే వస్తుంది అని అంటాడు.
ఆ తర్వాత సీన్లో అను పిల్లలు ఇద్దరినీ స్కూల్ కి తీసుకొని వస్తుంది. మీరు వెళ్లి రాఖీలు కట్టుకొని రండి నేను ఈ బెంచ్ దగ్గర వెయిట్ చేస్తాను అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పి స్కూల్లో గ్రౌండ్ దగ్గర ఒక బెంచ్ లో కూర్చుంటుంది అను. అదే సమయంలో ఛాయాదేవి మాన్సీలు అక్కడికి వస్తారు. అనుని చూసి ఆశ్చర్యపోతారు.
మాన్సి: అను ఏంటి ఇక్కడుంది?
ఛాయాదేవి: ఇక్కడున్నదంటే తన పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదువుతూ ఉండుంటారు.
మాన్సి: కొంచెం సేపు ముందు వచ్చినా బాగుండేది ఆ పిల్లలు ఎవరో తెలుసుకునే వాళ్ళము
ఛాయాదేవి: ఏం పర్లేదు ఇక్కడే ఉండి ఆ పిల్లలు ఎవరో తెలుసుకుందాము. అప్పుడు ఆర్యతో ఒక ఆట ఆడుకోవచ్చు. అని అనుకొని అనునే గమనిస్తూ ఉంటారు. మరోవైపు ఆర్య స్కూల్ కి వస్తాడు. ఆర్యని గమనించిన అను అక్కడి నుంచి వెళ్లి చెట్టు వెనకన దాక్కుంటుంది.
మాన్సి: చూసావా బ్రో ఇన్ లా ని చూసిన వెంటనే ఎలా దాక్కుంటుందో అని ఛాయాదేవితో అంటుంది.
మరోవైపు ఆర్య స్కూల్లోకి వెళ్ళగా పిల్లలందరూ అక్కడ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. అక్కి తో సహా ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్య కి హాయ్ చెప్తారు.
ఆర్య: ఏంటి ఎవరు క్లాస్ కి వెళ్లలేదా బయట తిరుగుతున్నారు?
అక్కి: ఈరోజు రాఖీ కదా అందరికీ రాఖీలు కడుతున్నాము
ఆర్య: మరి వాళ్ళు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు? అని అడుగుతాడు. మాకు ఎవరూ ఏ గిఫ్ట్ ఇవ్వలేదు అని పిల్లలు అనడంతో జెండే కి చెప్పి డ్రైవర్ చేత వెళ్లి చాక్లెట్లు కనిపించుకుని రమ్మంటాడు ఆర్య. ఆ చాక్లెట్లని పిల్లలందరికీ పంచుతూ ఉంటాడు. ఈ సంఘటన అంతా అను ఆనందంగా చెట్టు వెనుక నుంచి చూస్తూ ఉంటుంది.
మాన్సి: చూడు అను ఎంత ఆనందంగా ఉన్నాదో? అయితే ఆ పిల్లల మధ్య అను పిల్లలు కూడా ఉండే ఉంటుంటారు. అని అనుకుంటారు. ఇంతలో పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోగా అక్కీ ఒక్కత్తే అక్కడ ఉంటుంది. ఆర్య అక్కికి కూడా చాక్లెట్ ఇస్తాడు. ఇంకేమైనా చెప్పాలా అని అడుగుతాడు.
అక్కి: మొన్న మా స్కూల్ లాగేసుకోవడానికి ఇద్దరు చెడ్డ ఆంటీస్ వచ్చారు కదా వాళ్ళు మళ్ళీ స్కూలు లాగేసుకుంటున్నారట కదా మా టీచర్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఆర్య: అలా ఏం జరగదు స్కూల్ ని నేను కాపాడుతాను.
అక్కి: నేను కూడా అదే చెప్పాను. మా ఫ్రెండ్ వచ్చి మళ్ళీ కాపాడతాడు మనల్ని అని. ఆ స్కూల్ ని కాపాడతాను అని నాకు మాట ఇవ్వు ఫ్రెండ్ అని అనగా ఆర్య అక్కికి ప్రామిస్ చేస్తాడు.
ఛాయాదేవి: స్కూల్ని కాపాడతాను అని ప్రామిస్ చేసావు ఎలా కాపాడతావో నేను చూస్తాను అని అనుకుంటుంది ఛాయాదేవి. ఇంతలో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి ఆర్య సార్ వాళ్ళందరూ వచ్చారు లోపలికి రండి మేడం అని అంటారు.
ఛాయాదేవి: అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా తన పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారా? వాళ్ళు ఎవరు? అని అను ను చూపిస్తూ అడుగుతుంది ఛాయాదేవి.
ప్రిన్సిపల్: ఈ స్కూల్లోనే చదువుతారు అనుకుంటాను మేడం. ఒకసారి ఆగండి అని చెప్పి అటువైపుగా వెళ్తున్న టీచర్ని పిలిచి ఆ అమ్మాయి పిల్లలు ఎవరు? ఒకసారి వాళ్ళని నన్ను కలవమనండి అని టీచర్తో అంటాడు ప్రిన్సిపల్.
ఛాయాదేవి: మీరు ఆ పిల్లలతో మాట్లాడుతుండండి మేము ఒక మూల నుంచి వాళ్ళు ఎవరో చూస్తాము. అని అంటుంది.
ఇంతలో టీచర్ వెళ్లి అభయ్ అక్కిలను కిందకి తెస్తుంది. వాళ్ళని చూసిన ఛాయాదేవి, మాన్సిలు ఒకేసారి ఆశ్చర్యానికి గురవుతారు. గతంలో వీళ్ళిద్దరూ స్కూల్ లాక్కుంటున్నాము అని గొడవ జరిగినప్పుడు ఎదుర్కొన్న సంఘటనను గుర్తు తెచ్చుకుంటారు.
మాన్సి: వీళ్ళా బ్రొ యిన్ లా పిల్లలు? అందుకేనా రోజు అంత ధైర్యంగా మనల్ని ఎదిరించారు.
ఛాయాదేవి: ఎంతైనా ఆర్య వర్ధన్ పిల్లలు కదా. అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial