Prema entha madhuram september 6th: ఎపిసోడ్ ప్రారంభంలో ఆకాంక్ష ఆర్య కి ఫోన్ చేసి స్కూల్ ని ఎవరో పడగొడుతున్నారు ఫ్రెండ్. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉంది అని ఆర్యకు చెప్తుంది.
ఆర్య: స్కూల్ ని పడగొడుతున్నారా? నువ్వేం భయపడొద్దు నేను ఇప్పుడే వస్తున్నాను.
ఆకాంక్ష: త్వరగా రా ఫ్రెండ్. అని ఫోన్ పెట్టేస్తుంది.
పక్కనే జెండే మాటలు విని ఏమైంది అని అడుగుతాడు.
ఆర్య: ఛాయాదేవి కోర్ట్ ఇచ్చిన డెడ్ లైన్ కన్నా ముందే యాక్షన్ తీసుకుంటుంది.
జెండే: తను ఏ ప్లాన్ వేసినా తెలుసుకోమని మన వాళ్ళని పెట్టాను. అయితే తను చాలా సైలెంట్ గా స్టెప్స్ తీసుకుంటుంది అందుకే మనకి ముందుగా ఇన్ఫర్మేషన్ రాలేదు.
ఆర్య: సరే వెళ్దాం పద అని ఇద్దరు అక్కడి నుంచి స్కూల్ కి వెళ్తారు. తర్వాత ఆకాంక్ష ఫోన్ ఎవరికో తిరిగి ఇచ్చి థాంక్యూ అని చెప్పి గొడవ జరుగుతున్న చోటికి వస్తుంది. అక్కడ ఉన్న రౌడీలు పిల్లలందరినీ కొడుతూ ఉండగా అభయ్ ఒక రౌడీని గట్టిగా కొడతాడు. వాడు వెనక్కి వచ్చి పడతాడు. ఇంతలో ఆకాంక్ష అక్కడికి వస్తుంది.
ఆకాంక్ష: నువ్వు గొడవ పడొద్దు రా అన్నయ్య. నేను నా ఫ్రెండ్ కి ఫోన్ చేశాను ఇక్కడికి వస్తున్నారు.
అభయ్: ఏం అవసరం లేదు మన స్కూల్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుందాం బయటోల్లని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? అని అంటాడు. ఇంతలో స్కూల్లో ఒక క్లాస్మేట్ వాళ్ళ అమ్మకి అను కి ఫోన్ చేసి గొడవ జరుగుతుంది అని, అభయ్ గొడవలో దిగుతున్నాడు అని చెప్తుంది. అప్పుడు అను పరిగెత్తుకుంటూ స్కూల్ కి వస్తుంది. మరోవైపు ఆర్య కూడా కారులో స్కూల్ కి బయలుదేరుతాడు. ఇంతలో ఎమ్మెల్యే కి ఫోన్ చేస్తాడు ఆర్య.
ఆర్య: స్కూల్ ని పడగొడుతున్నారు అని సంగతి మీకు తెలుసా తెలీదా?
ఎమ్మెల్యే: తెలిసినా తెలినట్టే ఉండాలి కదా సార్. ఓట్లు కావాలి అంటే కొన్నిసార్లు తెలియనట్టు వదిలేయాలి.
ఆర్య: మీరేం చేస్తారో తెలీదు పది నిమిషాల్లో మీరు స్కూల్ దగ్గర కనబడాలి.
ఎమ్మెల్యే: ఒక గ్రామంలో సేవా కార్యక్రమం ఉంది రావడం కుదరదు.
ఆర్య: వస్తావు. పది నిమిషాల్లో అక్కడ ఉండాలి ఉండి తీరాలి అని ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు ఎమ్మెల్యేకి ఆర్య కఠినమైన గొంతు చూసి చెమటలు పడతాయి. ఇదిలా ఉండగా అను పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వచ్చి ఛాయాదేవిని, మాన్సిని చూసి స్కూల్ పడగొట్టాలనుకుంటుంది వీళ్ళా? అని అనుకుంటుంది.
Also Read: అను ఆర్య మధ్య రొమాంటిక్ సీన్.. రౌడీలతో గొడవపడుతున్న అభయ్!
ఛాయాదేవి: మీరు బుల్డోజర్ పనిని ఎందుకు ఆపారు వెళ్లి కొల్లగొట్టండి?
కరెక్ట్ గా అదే సమయంలో లాయర్ వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు.
మాన్సి: ఆర్య వర్ధన్ కంపెనీ లాయర్. అని ఛాయ దేవి చేవి లో చెప్తుంది.
లాయర్: ఆపండి. స్కూల్ ని ఇలా దౌర్జన్యంగా పడగొట్టడం అన్యాయం.
ఛాయాదేవి: మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాము.అయినా ఈ లాండ్ మా పేరు మీద ఉంది దీనికి కోర్ట్ ప్రూఫ్ కూడా ఇచ్చింది.
లాయర్: మీరు ఇలాంటి లా పాయింట్లు మాట్లాడుతారని గొడవ తేలే వరకు పాఠశాలకు ఏ అడ్డంకి రాకూడదు అని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చాను. అయినా మీకు అంత సీన్ లేదు లెండి ఎందుకంటే సీన్లోకి ఆల్రెడీ ఒకళ్ళు ఎంటర్ అయ్యారు అని అంటాడు. ఇంతలో ఆర్య కార్ దిగి అక్కడికి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. ఆర్య ని చూసిన అను పయటతో ముఖాన్ని కప్పుకుంటుంది.
ఛాయాదేవి: ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆపడానికి నువ్వెవరు?
ఆర్య: సమాజంలో తప్పు చేస్తే ఎందుకు? ఏంటి? అని అడిగే హక్కు ఈ ప్రతి ఒక్కరికి ఉన్నది. నువ్వు నీ హక్కుల కోసం కోర్టుకెళ్లావు. చదువు పిల్లల ప్రాధాన్య హక్కు. నేను వాళ్ళ హక్కు కోసం స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను నీకు డెవలప్మెంట్ కోసం ల్యాండ్ అడిగితే ఇవ్వలేదు. ఆఖరికి పిల్లలు ఉన్న ఈ ల్యాండ్ ని కూడా కావాలని నాశనం చేస్తానంటే కుదరదు.
ఛాయాదేవి: నేను సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే నా పనిని తేల్చుకుంటాను.
జెండే: ఆర్య తలుచుకుంటే ఒక సూపర్ డీలక్స్ స్కూల్ ని కట్టించి మంచి ఫెసిలిటీ ఇవ్వగలరు కానీ ఇక్కడ చిన్నా చితకా పనులు చేసుకుంటున్న అందరి పిల్లలు ఇక్కడే ఉన్నారు. చదువుకి డబ్బులు అవసరం లేదు అని తెలియజేయడానికే ఎక్కువ కోస్ట్ పెట్టకుండా స్కూల్ డెవలప్మెంట్ కి ఆర్య సహాయపడుతున్నాడు.
ఛాయాదేవి: నేనుంటుండుగా ఈ స్కూల్ ని అలా డెవలప్ చేస్తారో నేను చూస్తాను. ఒక్కల్ని కూడా స్కూల్ కి రానివ్వను.
ఆర్య: పిల్లలు ప్రతిరోజు లాగే స్కూల్ కి వస్తారు.
ఛాయాదేవి: ఈ స్టేట్ పొలిటీషియన్స్ అందరూ నా చెప్పు చేతుల్లో ఉన్నారు అని అనబోతూ ఉండగా ఎమ్మెల్యే పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఈ సంఘటన అంతా అను ఒక చాటు నుంచి చూస్తుంది.
ఎమ్మెల్యే: సారీ సార్ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. ఇంక నేను చూసుకుంటాను
ఛాయాదేవి: చూసి చూడనట్టు ఉంటాను అన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు?
ఎమ్మెల్యే: చేయాల్సి వస్తుంది ఊరికే లైట్ తీసుకుంటారు అనుకున్నాను కానీ సార్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ మేటర్ లో నాకు ఆల్రెడీ సెంట్రల్ నుంచి వాచిపోతుంది. ప్రస్తుతానికి కామా పెట్టండి ఫుల్ స్టాప్ పెట్టించే బాధ్యత నాది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మ అని బతిమిలాడుతాడు.
Also Read: సామ్రాట్ గురించి షాకింగ్ న్యూస్- బాధలో తులసి, ఒంటరైన హనీ
చేసేదేమీ లేక ఛాయాదేవి, మాన్సి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్తున్న వాళ్ళని ఆర్య ఆపుతాడు.
ఆర్య: వన్ మినిట్ మీకు నాతో పోటీ పడాలని ఉంటే బిజినెస్ లో పోటీ పడండి, నలుగురికి మంచి చేయడంలో పోటీ పడండి అంతేకానీ ఉన్న మంచిని ఆపడానికి చూడొద్దు. మంచి చేయకపోయినా పర్లేదు చెడు చేయాలని ఉద్దేశాన్ని మానుకోండి అని అంటాడు. ఇంక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఎమ్మెల్యే: ఇంక మీరు భయపడొద్దు సార్ ఈ స్కూల్ మీద ఒక్క గీత కూడా పడనివ్వను. ఒక సోషల్ సర్వీస్ పనిని వదిలి వచ్చాను సర్ ఇంక నేను బయలుదేరొచ్చా?
ఆర్య: ఎమ్మెల్యే అంటే నలుగురు ముందు నడాలి కానీ నలుగురు తోని తప్పు చేయకూడదు. మీ పార్టీని చూసి, మీకు పదవి ఇవ్వలేదు. మీ మీద ఉన్న నమ్మకాన్ని చూసి ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోండి అని అనగా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎమ్మెల్యే.
ఆకాంక్ష: థాంక్యూ ఫ్రెండ్ ఫోన్ చేయగానే వచ్చినందుకు
ఆర్య: నేనే మీకు థాంక్స్ చెప్పాలి రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి టైంకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ డియర్. మీ అందరినీ నిజంగా మెచ్చుకోవాలి స్కూల్ కాపాడడం కోసం ఇలా అడ్డుగా నిలబడ్డారు.
టీచర్: దీనికి కారణం ఆకాంక్ష సార్. ధైర్యంగా స్టాండ్ తీసుకుంది.అలాగే అభయ్ కూడా బాగా పోరాడాడు
ఆకాంక్ష: మీరే కదా ఫ్రెండ్ చెప్పారు ధైర్యం గా ఉండమని. అందుకే నేను స్టాండ్ తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు ఆర్య గతంలో తను ఇచ్చిన స్పీచ్ ని గుర్తుతెచ్చుకుంటాడు. ఈ మాటలు అన్నీ విని అను మురిసిపోతూ ఉంటుంది. వాళ్లది మీ రక్తం సర్ అందుకే మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు మీలాగే ఆలోచిస్తారు అని మనసులో అనుకుంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial