Prema entha madhuram september 5th: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో అంజలి ఆర్యతో అనుని చూసిన విషయం అంతా చెప్తుంది.. ఏం పర్వాలేదు సార్ అను ఎప్పటికైనా కనిపిస్తుంది, తను ఎక్కడుందో తెలిసింది కదా ఇంకా మనం ఎక్కువ మందిని అక్కడ వెతికిద్దాము అని అంజలి అంటుంది. ఏం పర్వాలేదు అంజలి అదే నమ్మకంతో నేను ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాను మాన్సీ చేసిన కుట్రలు అనుకు తెలిసే వరకు అను ఇంటికి రాదు. ఏదో ఒక రోజు ఇంటికి వస్తుందని నమ్మకంతో నేను ఇప్పటివరకు ఉన్నాను అని శారదా దేవి అంటుంది.


అప్పుడు నీరజ్ మాట్లాడుతూ.. వదినమ్మ అవసరమైన ప్రతిసారి మన మధ్యలోనే ఉంటారు, దూరంగా ఉన్నా సరే మన క్షేమాన్ని కోరుకుంటారు అని ఆర్యకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత సీన్లో అను పిల్లలు ఇద్దరికీ క్యారేజ్ కట్టి హాల్లో కూర్చుంటుంది. త్వరగా రా అక్కి అని అభయ్ పిలవగా ఆర్య కొన్న లంగా వోని వేసుకుంటుంది ఆకాంక్ష . దాన్ని చూసి అను ఎంతో ఆనందిస్తుంది చాలా బాగుంది అని అంటుంది. కానీ అభయ్ మాత్రం నాకు అసలు ఏమీ నచ్చలేదు అని బుంగమూతి పెడతాడు. నీకు జలస్ రా అన్నయ్య అని అంటుంది ఆకాంక్ష.


అప్పుడు అనుతో అమ్మ నువ్వు కూడా ఈరోజు గుడికి వెళ్తావు కదా మా ఫ్రెండ్ ఇచ్చిన బట్టలే వేసుకో అమ్మ అని బలవంతం పెట్టగా సరే అని అంటుంది అను. తర్వాత కబోర్డ్ లో ఆర్య ఇచ్చిన చీరని చూస్తూ పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఒకరోజు అను కూర్చొని ఉండగా ఆర్య ఒక గిఫ్ట్ తెచ్చి అనుకి ఇస్తాడు. ఎందుకు సార్ గిఫ్ట్ తెచ్చారు అని అడగగా నా భార్యకి నేను గిఫ్ట్ తేవడానికి అకేషన్ ఉండాలా?. అవసరం లేదు కదా శ్రావణ శుక్రవారం పూజలు వస్తున్నాయి అందుకే కొత్త చీర తెచ్చాను. ఒకసారి వేసుకొని కనబడు అని అనగా అను వెళ్లి వేసుకొని వస్తుంది.


అనుని అలా చూసి ఆర్య మైమరిచిపోయి వెళ్ళి ముద్దు అడుగుతాడు ఆ జ్ఞాపకాలని అను గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు ఛాయాదేవి మాన్సితో కలిసి స్కూల్ ని మూసేందుకు మనుషుల్ని పిలిపిస్తుంది. అక్కడ ఉన్న టీచర్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తాను అని అనగా ప్రిన్సిపల్ అమ్ముడుపోయాడని వీళ్ళకి తెలియదు కదా పాపం అతను ఎంతకీ ఫోన్ ఎత్తడు అని అనుకుంటుంది మాన్సీ. ఇంతలో అక్కడున్న రౌడీలు పిల్లల్ని స్కూల్ నుంచి పంపిస్తూ ఉంటారు.


అప్పుడు అభయ్ వాళ్ళని రాయితో కొడతాడు. తిరిగి వాళ్ళు కొట్టబోతుండగా ఛాయాదేవి ఆపి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు. పిల్లల్ని బయటకు పంపించేయమని అంటుంది. ఈలోగా ఆకాంక్ష పరిగెత్తుకుంటూ వెళ్లి ఆర్య కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆర్య వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి జెండేకి జరిగిన విషయం అంతా చెప్పి కోర్టు ఇచ్చిన డేట్ కన్నా ముందే వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని బయలుదేరుతాడు ఆర్య.


Also Read: Trinayani september 4th: కొడుకు చెంప పగలగొట్టిన తిలోత్తమ.. విశాల్ శాపానికి సుమన ప్రసవనే కారణమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial