Prema entha madhuram september 22nd: ఇలాగే ఉంటే నోటికొచ్చింది వాగుతుంది మర్యాదగా తనని బయటికి వెళ్లిపోమని చెప్పు అంజలి అని నీరజ్ అంటాడు.


అంజలి: విన్నావు కదా ఇంక బయలుదేరు 


మాన్సి: ఇప్పుడుక వెళ్తాను మళ్ళీ పెళ్లిలో కలుసుకుందాం ఈ శుభలేఖలు మీరే ఉంచుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సి. 


మాన్సి: ఇక్కడ నిప్పు బాగా అంటుకుంది తర్వాత ఎక్కడ నిప్పు పెట్టబోతున్నాం అని ఛాయాదేవిని ఫోన్లో అడుగుతుంది.


ఛాయాదేవి: ఇంకెక్కడ డైరెక్ట్ గా అను దగ్గరకే పదా అని అంటుంది ఛాయాదేవి.


ఆ తర్వాత సీన్లో అను హాల్లో కూర్చుని ఉంటుంది.


అను: దేవుడి దయవల్ల పేపర్ ని కాలనీలో ఎవరు చూసి ఉండరు అందుకే నన్నేమీ అడగలేదు అని అనగా ఇంతలో తనకి ఇంటి తలుపు శబ్దం వినిపిస్తుంది. బయటకు వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ ఉండదు కింద ఒక కవర్ ఉంటుంది. అది తీసి లోపలికి తెస్తుంది. అది తీసేసరికి ఒక కేక్ ఉంటుంది. హ్యాపీ యానివర్సరీ అని దానిమీద రాసి ఉంటుంది ఇంతలో మాన్సీ, ఛాయాదేవిలు లోపలికి వస్తారు.


Also Read: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!


అను: మీరెందుకు ఇక్కడికి వచ్చారు?


ఛాయాదేవి: ఇది నీ చివరి వెడ్డింగ్ యానివర్సరీ కదా అందుకే సెలెబ్రేట్ చేసుకుందామని వచ్చాము


అను: లాస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా?


మాన్సి: అదేంటో నేను చెప్తాను అని చేతిలో ఉన్న శుభలేఖను ఇచ్చి ఆర్య వర్ధన్ కి ఛాయాదేవికి పెళ్లి జరగబోతుంది దాని తర్వాత నా స్థానం లాగే నీది కూడా మాజీ అయిపోతుంది అని అనగా అను శుభలేఖని చించి మాన్సి చెంపపై కొడుతుంది.


అను: నీలాగ నేను భర్తకు విలువకుండా తాళిని తెంచి ముఖం మీద కొట్టలేదు ఈ మంగళసూత్రమే నా జీవనాధారం అని బతుకుతున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. ఆర్య సార్ భార్య స్థానం ఎప్పటికీ నాదే


ఛాయాదేవి: కంగారెందుకు అను చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా నువ్వే ఈ పెళ్లి చేయాలి. అప్పుడు ఎలాగైతే టెండర్ దక్కించుకోమని ఇన్స్పైరింగ్ ఆర్య కి రాశావో ఈసారి కూడా మా ఇద్దరి పెళ్లి అలాగే చేయాలి అప్పుడే నీ పిల్లలు సురక్షితంగా ఇంటికి వస్తారు, మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉంటారు. అని అనగా అను భయపడుతుంది 


మాన్సి: ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి మీనింగ్ ఏంటి అను భయమా? లేకపోతే కోపమా?


Also Read: ముకుందకి అడుగడుగునా చెక్ పెడుతున్న కృష్ణ- మొత్తం గమనిస్తున్న భవానీ!


ఛాయాదేవి: నన్నేమీ చేయలేని చేతకానితనం అని చెప్పి ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయి కారెక్కుతారు. అదే సమయంలో ఆర్య కార్ అను ఇంటి ముందు ఆగుతుంది. ఆర్య కార్ రావడానికి కారులో నుంచి మాన్సీ, ఛాయాదేవిలు చూస్తారు


మాన్సి: అది మా బ్రో ఇన్ లా కార్ లా ఉంది ఏంటి? అను గురించి అడ్రస్ తెలిసిపోయిందా?


ఛాయాదేవి: ఆగు ఇక్కడ ఉండి ఏం జరుగుతుందో తెలుసుకుందాం 


మాన్సి: అను జాడ తెలిస్తే ఇంక మన ప్లాన్ ఫ్లాప్ అయిపోయినట్టే అని టెన్షన్ గా ఉంటుంది.


మరోవైపు గిఫ్ట్ తెచ్చినందుకు థాంక్స్ మీరు కూడా లోపలికి రండి అమ్మ చేసిన స్వీట్ తినండి అని బలవంతంగా ఆర్యని లోపలికి తీసుకొని వస్తుంది అక్కి. ఇంతలో ఆర్య కి ఫోన్ వస్తుంది


ఆర్య: నువ్వు లోపలికి వెళ్ళు డియర్ నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని అనగా అక్కి లోపలికి వెళ్లి అనుకి చీర ఇస్తుంది.


అక్కి: నీకు ఈ చీర గిఫ్ట్ గా తెచ్చాను అమ్మ


అను: చీర చాలా బాగుంది కానీ నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి అని అనగా కిడ్డి బ్యాంకులో వి అని అంటుంది అక్కి. ఇంతలో అభయ్ అక్కడికి వస్తాడు


అభయ్: ఈ ప్లాన్ గురించి నాకెందుకు చెప్పలేదు అక్కి?


అక్కి: దీన్నే సుప్రైజ్ అంటారురా అన్నయ్య నేను నా ఫ్రెండు వెళ్లి తెచ్చాము ఇప్పుడు క్యస్షన్స్ ఆపండి నువ్వు వెళ్లి చీర కట్టుకో అమ్మ అని అన్నగా అను ఇప్పుడు వద్దు తర్వాత కట్టుకుంటాను అని అంటుంది. కానీ పిల్లలు బలవంతం చేయడంతో లోపలికి వెళ్లి చీర కట్టుకుంటుంది. ఇంతలో ఆర్య ఇంటి లోపలికి వస్తాడు. ఆర్య లోపలికి రావడంతో మాన్సి, ఛాయాదేవిలు ఇంటి కిటికీ నుంచి లోపల జరుగుతుందంతా చూస్తూ ఉంటారు.


అభయ్: హలో మీరేంటి ఇక్కడ?


అక్కి: నేను నా ఫ్రెండ్ మీ అమ్మకి గిఫ్ట్ కొనడంలో హెల్ప్ చేయమని చెప్పాను అందుకే అమ్మని విష్ చేయమని లోపలికి తీసుకొని వచ్చాను.


అభయ్: మీరు అందరికీ ఇలాగే హెల్ప్ చేస్తారా? అక్కి యే ఎందుకు అంత స్పెషల్?


ఆర్య: బికాస్ షి ఈజ్ మై ఫ్రెండ్ అని అక్కికి హైఫై ఇస్తాడు ఆర్య. ఆర్య మాటలు లోపల అనుకి వినబడి ఆర్య సార్ ఇక్కడికి వచ్చారా అనుకోని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కి నేను వెళ్లి అమ్మను తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్తుంది. అమ్మా రా అని అనుని గదిలో నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. 


Also Read: Bigg Boss Telugu Season 7 Episode 19: మగాళ్లకు సెన్స్ ఉండాలి, ఆడవాళ్ల ముందు షర్టులు విప్పుతున్నారు: శోభాశెట్టి కామెంట్స్ - గౌతమ్‌కు అన్యాయం?


Join Us On Telegram: https://t.me/abpdesamofficial