Prema Entha Madhuram August 19th: ఆర్య భాను కి డబ్బులు ఇవ్వమని నీరజ్ కి చెప్తాడు. నీరజ్ సరే అని అలాగే తనను హాస్పిటల్ లో చూయించి ఇంట్లో దిగి పెట్టేసి వస్తాను అని అంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరగా ఛాయాదేవి ఆర్య కు ఫోన్ చేస్తుంది. పక్కనే ఉన్న శారదమ్మ ఆ ఫోన్లో ఛాయాదేవి అని తెలియటంతో భయపడుతుంది. ఇక ఛాయాదేవి ఆర్యను ఎలా ఉన్నావు అని పొగరుగా అడుగుతుంది. నువ్వు పంపించిన కిరాయి క్రిమినల్స్ ను అడుగు అంటూ తన స్టైల్ లో సమాధానం ఇస్తాడు ఆర్య.
ఆ తర్వాత ఛాయాదేవి నేరుగా మ్యాటర్ లోకి దిగుతుంది. రేపు నువ్వు టెండర్ దక్కించుకుంటే ఈరోజు మీ ఇంటికి వచ్చిన క్రిమినల్స్ రేపు అను, పిల్లల దగ్గరికి వెళ్తారు అని బెదిరిస్తుంది. దాంతో ఆర్య కోపంగా అరిచి.. తను ఎలాగైనా టెండర్ దక్కించుకుంటాను అన్నట్లుగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక శారదమ్మ ఈ టెండర్ వదిలేయమని.. లేదంటే అనుని ఏమైనా చేస్తుందేమో అని భయపడుతుంది శారదమ్మ. కానీ ఆర్య తనకు ధైర్యమిస్తాడు.
తర్వాత రేష్మ అనుకి టీ ఇవ్వడానికి రాగా తన చేతికి ఉన్న గాయాన్ని చూసి ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంది. ప్రీతి కూడా ఏం జరిగింది అని టెన్షన్తో అడుగుతుంది. దాంతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది అను. ఇక ప్రీతి వాళ్ళు తనను జాగ్రత్తగా ఉండమని చెబుతారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తమది అని అంటారు.
ఇక టెండర్ దక్కించుకోవడం కోసం మదన్, ఛాయాదేవి టెండర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారు. ఇక మదన్ తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని.. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని.. ఎప్పుడెప్పుడు ఈ టెండర్ దక్కించుకోవాలా అని ఉందని ఆత్రుతంగా చెబుతూ ఉంటాడు. వెంటనే ఛాయాదేవి ఈ టెండర్ తమకే వస్తుందని.. పొగరుగా అంటుంది. ఇక ఆర్య రాకపోయేసరికి బెదిరించడంతో భయపడ్డాడు ఏమో అని అనుకుంటుంది.
అప్పుడే తనకు కృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేయగా తమతో పాటు ఇంకెవరు టెండర్ వేస్తున్నారు అనటంతో అతడు ఆర్య వర్ధన్ అని అనటంతో షాక్ అవుతుంది. ఫోన్ కట్ చేసి ఫోన్లో చూడటంతో ఆర్యవర్ధన్ కూడా టెండర్ వేసినట్లు తెలుస్తుంది. వెంటనే కోపంతో రగిలిపోతుంది. భార్య పిల్లల్ని చంపేస్తానని బెదిరించిన కూడా ఆర్య టెండర్ వేయడానికి సిద్ధమయ్యాడు అని.. ఈసారి ఆర్యనుండి కాదు అను నుండి నరుక్కుంటూ రావాలి అని అను కి ఫోన్ చేస్తుంది.
మరోవైపు అను ఫుడ్ ఆర్డర్లో బిజీగా ఉంటుంది. ఇక ఛాయాదేవి ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. నీ భర్తకు నీ మీద ప్రేమ లేదు.. నిన్ను చంపేస్తానని బెదిరించిన కూడా టెండర్ వేయడానికి వస్తున్నాడు అని అనటంతో అనుకూడా ఆ టెండర్ ఆర్య సర్ కే దక్కాలి అని పొగరుగా చెబుతుంది. దాంతో ఛాయాదేవి ఫోన్ కట్ చేసి మరింత కోపంతో రగిలిపోతుంది.
ఆ తర్వాత ఆర్య, జిండే ఆఫీస్ దగ్గరికి చేరుకోగా వారికి ఛాయాదేవి, మదన్ ఎదురుపడతారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్లబోతుంటే ఛాయాదేవి వచ్చి అడ్డు ఆపుతుంది. టెండర్ ఎలాగైనా తనకే దక్కుతుందని పొగరుగా మాట్లాడుతుంది. ఇక అంతే పొగరుగా ఆర్య, జిండే సమాధానం ఇస్తారు. దాంతో కోపం తో రగిలిపోయిన ఛాయాదేవి ఒక కర్ర తీసుకొని వచ్చి వారికి ఎదురుగా అడ్డంగా ఒక గీత గీసి ఇది దాటి వెళ్తే అనుని చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఇక ఆర్య వెనుకడుగు వేసినట్లే వేసి ముందుకు అడుగు వేసి గీత దాటుతాడు. అది చూసి మరింత షాక్ అవుతుంది ఛాయాదేవి.
also read it : Trinayani August 18th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమా, సుమనలకు నోట్లో మన్ను కొట్టిన విశాలాక్షి, విశాల్‌కు ప్రమాదం తప్పదా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial