Trinayani August 18th: నయని దంపతులు కలిసి తింటుండగా హాసిని తన భర్త ఎప్పుడు ఇలా తినిపించలేదు అంటూ తనను బాగా తిడుతూ ఉంటుంది. దాంతో పావని మూర్తి ఆయన బిజీనేమో అమ్మ అని అనడంతో.. అమ్మ కొంగు పట్టుకోవడంలోనా అని వెటకారం చేస్తుంది. ఈ పూటకే అమ్మ దగ్గర లేడు అని అనటంతో అప్పుడే వల్లభ కంగారుగా కిందికి వచ్చిపైనున్న మట్టి కింద పడటం లేదు అలానే ఆగిపోయింది అనటంతో అందరూ కూడా పైకి చూడడంతో అక్కడున్న మట్టిని చూసి షాక్ అవుతారు.


సరిగ్గా నయని వాళ్ళు అన్నం తినే ప్లేట్లో పడేలాగా ఉంది అని దురంధర అనటంతో విశాలాక్షి అమ్మ నాన్న అన్నం తింటున్నారు అని అది పడకుండా ఉంది అని అంటుంది. దాంతో నయని ఇక భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యంగా తినొచ్చు అని అంటుంది. ఇక సుమన మరి అది కింద పడదా అని అనడంతో.. పడుతుంది కింద కాదు పైన అని విశాలాక్షి ఆ మట్టిని ఆ ముగ్గురిపై చల్లటంతో ఆ మట్టి వారి నోట్లో పడుతుంది. దాంతో వాళ్ళు కోప్పడుతూ విశాలాక్షిపై అరుస్తారు. 


ఇక అక్కడ నుంచి స్నానాలు చేయడానికి వెళ్తారు. ఇక నయని విశాలాక్షి అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచే జరుగుతుందని అనగా ఇటువంటి వాళ్లకి ఇలాగే జరుగుతుంది అని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇక విశాలాక్షి నయని దంపతులతో త్వరలో గౌరీ అమ్మవారి వ్రతం చేయమని చెబుతుంది. దానికి నయని దంపతులు తప్పకుండా చేస్తాము అనటంతో నాన్న లేకున్నా కూడా చేయాల్సి ఉంటుంది అని అంటుంది. ఆ మాటలకు నయనితోపాటు అందరూ షాక్ అవుతారు. 


అంటే విశాల్ కు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్నట్లు అనిపిస్తుంది. ఇక ఎందుకలా అన్నావు అని అనటంతో ఈ విషయం ఆ రోజే నయని అమ్మకు అర్థమవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుమన స్నానం చేసి రెడీ అవ్వగా అక్కడికి విశ్రాంత్ వచ్చి తల స్నానం చేశావు జలుబు చేయదా అంటాడు. దాంతో సుమన ఇప్పుడు నన్ను అనకు..  ఏదైనా ఉంటే ఆ గారడి పిల్లని అను అని కోపంగా మాట్లాడుతుంది. మా మీద మట్టి చల్లెలాగా చేసింది అని ఫైర్ అవుతుంది.


దాంతో విక్రాంత్ అన్న, వదిన కలిసి తింటున్నారని మట్టి పడేయాలని చూశారని అందుకే విశాలాక్షి మీపై మట్టి చల్లిందని అర్థమవుతుంది అని అంటాడు. దానితో సుమన తన భర్త చాలా తెలివైనవాడు అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డ గురించి టాపిక్ తీసి ఆస్తి గురించి మాట్లాడుతుంది.  ఇప్పటికైనా మా వైపు ఉండు అని విక్రాంత్ తో అంటుంది. కానీ విశ్రాంత్ సన్యాసమైన తీసుకుంటాను కానీ సన్నాసిని కాను అంటూ చిరాకు పడి అక్కడ నుంచి వెళ్తాడు.


ఆ తర్వాత విశాలాక్షి హాల్లో దీపం ప్రమిదలు,  తమలపాకుతో ఉన్న ఫోటోను పెడుతుంది. నయని వచ్చి ఏదైనా సహాయం చేయాలో అనటంతో.. నీకే నేను సహాయం చేస్తున్నాను అని అంటుంది విశాలాక్షి. అప్పుడే అక్కడికి డమ్మక్క పాశం మోసుకుంటూ వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అనటంతో విశాలాక్షి చంద్రోదయ దర్శనంలో నయని అమ్మకు కనిపించిన దృశ్యం గురించి వివరణ ఇవ్వడానికి అని అంటుంది.


ఇక పాశం మోస్తున్న బరువు అనిపించడం లేదా అని డమ్మక్క అనటంతో వెంటనే ఎద్దులయ్య ఆడవాళ్ళ శక్తి గురించి పొగుడుతాడు. కానీ అక్కడే ఉన్న వల్లభ తను ఇంతే ఉంది ఎలా మోస్తుంది అని ఆ పాషాన్ని పట్టుకోగా వెంటనే షాక్ కొట్టి దూరం జరుగుతాడు. ఇక తిలోత్తమా వారి వస్తువులు పట్టుకోకు అని అంటుంది. ఇక తర్వాత  మధ్యలో సుమన వెటకారం చేయటంతో అక్కడ వేరే టాపిక్ వచ్చి అదే చర్చగా జరుగుతుంది.


ఇక సుమన మళ్లీ ఆస్తి గురించి తన డెలివరీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈసారి మీ అమ్మ వస్తుంది అని విశాలాక్షి అనటంతో.. అమ్మ వస్తే సంతోషమే కదా అని అంటుంది. కానీ సుమన మాత్రం తను అసలు రావద్దు అని కోప్పడుతుంది. ఇక విశాలాక్షి నీ కన్న తల్లి కాదు నువ్వు అమ్మ అని పిలిచే అమ్మ వస్తుంది అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే వల్లభ ఆ టాపిక్ లన్ని ఆపిస్తాడు. ఆ తర్వాత విశాలాక్షి నయనికి కనిపించిన దృశ్యం గురించి చూపించబోతుంది. ఇక డమ్మక్క నెత్తి మీద ఉన్న పాశం అదంతట అదే కి వెళ్లి ఆ తర్వాత తమలపాకులు ఉన్న ఫోటో దగ్గరికి వెళ్లగా.. ఆ ఫోటోలో శివుడు కనిపిస్తాడు. అందరూ దేవుని చూసి ఆశ్చర్యపోతారు. ఇక నయని శివుడిని తలుచుకుంటూ దండం పెడుతుంది.


also read it : Prema Entha Madhuram August 17th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అనుకు వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవ, ఆర్యకు కాల్ చేసిన అను?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial