Brahmamudi November 24: ఈరోజు ఎపిసోడ్ లో హలో అందరూ ఉండగా అప్పుడే ఇంటికి వచ్చిన స్వప్నని ఆగమంటూ కేక వేస్తాడు రాహుల్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.


రాహుల్: ఎక్కడికి వెళ్లావు అని భార్యని అడుగుతాడు.


రుద్రాణి : అదేంట్రా అలా అడుగుతావు, తను పార్లర్ కి వెళ్తున్నాను అని నాకు చెప్పే వెళ్ళింది.


రాహుల్ : ఇంతసేపూ పార్లల్లోనే గడిపి వస్తుందా, ఇది ఎవడితోనో తిరుగుతోంది.


ఆ మాటకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చిట్టి రాహుల్ ని కోప్పడుతుంది.


అపర్ణ : బయటికి వెళ్ళిన భార్య ఇంటికి లేటుగా వచ్చినంత మాత్రాన అంత అసహ్యంగా మాట్లాడుతావా?


కావ్య: కొంచెం మర్యాదగా మాట్లాడు రాహుల్.


రుద్రాణి: ఆగండి అందరూ వాడి ఆవేశాన్ని చూస్తున్నారు కానీ స్వప్న మౌనాన్ని చూడటం లేదు. చిన్న విషయానికే యు షట్ అప్ అంటూ రెచ్చిపోయే స్వప్న ఇప్పుడు ఎందుకు అంతగా ఉంది.


సుభాష్ : ఏంట్రా ఆ మాటలు అయినా ఆ అమ్మాయిని అనుమానించడానికి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి.


రాహుల్: ఉన్నాయి మావయ్య అంటూ రాజేష్ తో స్వప్న ఉన్న ఫోటోలు అందరికీ చూపిస్తాడు. అందరూ ఒకసారి గా షాక్ అవుతారు.


స్వప్న: అవి నా కాలేజీ డేస్ ఫొటోస్ అతను నా ఫ్రెండ్. అంతమాత్రాన అనుమానించేస్తావా?


చిట్టి: ఇతను నీకు ముందే తెలుసా మరి ఎందుకు ఆ రోజు నేను అడిగినప్పుడు తెలియదని చెప్పావు.


రాహుల్ : అంతే కాదు అమ్మమ్మ ఆ ఫ్రెండ్ షిప్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తుంది. మొన్న అతను ఇంటికి వస్తే ఇంట్లోకి రానివ్వకుండా బయటే మాట్లాడి పంపించేసింది.


రాజ్: అవును అతను ఇంటికి రావడం స్వప్న ఇంటి బయట అతనితో మాట్లాడటం నేను కూడా చూశాను.


స్వప్న: ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయనే నాకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకున్నాను అమ్మమ్మ గారు.


రాహుల్ : మరి అతనికి డబ్బు ఎందుకు ఇచ్చావు?


రుద్రాణి : ఏమి తెలియనట్లుగా ఇంట్లో ఈ దరిద్రం కూడా జరుగుతుందా?


స్వప్న కోపంతో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూస్తుంది కానీ రాహుల్ డబ్బు ఇచ్చిన ఫోటోలు అందరికీ చూపిస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.


రుద్రాణి: నా కొడుక్కి, నాకు అన్యాయం చేసింది. ఆరోజు నా కొడుకు మోసం చేశాడని ఇంట్లో వాళ్ళందరూ వాడిని తిట్టి ఒప్పించి పెళ్లి చేశారు ఇప్పుడు తను ఇంటి పరువు తీసి ఏం బజారున పడేస్తుంది ఎవరు ఏమి మాట్లాడరేమీ? ఇలాంటి ఆడది ఇంట్లో ఉండకూడదు. అయినా నీకు అంత డబ్బు ఎక్కడిది?


రాహుల్ : నేను చెప్తాను మమ్మీ అంటూ నగలు తాకట్టు పెట్టిన బిల్ చిట్టికి చూపిస్తాడు.


చిట్టి : షాక్ అవ్వుతూ ఏంటమ్మా నిన్ను వెనకేసుకురావడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇన్ని సాక్షాలు చూపిస్తున్నాడు.


స్వప్న: అతను నా క్లాస్మేట్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. కానీ వదలకుండా ఈ ఫొటోస్ ఇంట్లో చూపిస్తాను అంటూ బెదిరిస్తున్నాడు.


అపర్ణ: అలాంటప్పుడు ఇంట్లో ఉన్న మా అందరికీ చెప్పాలి కదా.


రాహుల్: ఎందుకు చెప్తుంది ఇది వాడితో తిరుగుతుంది డబ్బే కాదు సర్వస్వం వాడికి దోచిపెట్టడానికి సిద్ధంగా ఉంది.


రుద్రాణి : ఈరోజు ఇంట్లో ఎవరు చెప్పినా వినేది లేదు ఇది ఇకమీదట ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ స్వప్న చెప్పేది వినిపించుకోకుండా స్వప్నని బయటికి గెంటేయాలని చూస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆


*T&C Apply