Brahmamudi November 23 Episode : ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. స్వప్న మాటలు వింటాడు రాహుల్.
రాహుల్: నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేయటంలో తప్పే లేదు, అవసరం వచ్చేసరికి నువ్వు భర్తనే ఇరికించేయాలని చూస్తున్నావు అనుకుంటాడు.
స్వప్న నగలన్నీ తీసి బ్యాగ్ లో పెట్టుకొని బయటికి వెళ్తుంది.
రాహుల్ : దొరికేశావు, అఫీషియల్ గా నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించడానికి నాకు అవకాశం ఇచ్చావు అనుకుంటాడు.
మరోవైపు నిద్రలేచిన రాజ్ కట్లు విప్పుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి కావ్య ఇంకా నిద్ర లేవలేదు ఏమిటి అనుకుంటూ అక్కడికి వచ్చి తలుపు తడుతుంది.
రాజ్ : భార్యని లేపుతూ పిన్ని వచ్చింది అంటాడు.
కావ్య అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఎంతకీ తలుపు తీయకపోవటంతో ధాన్యలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది. కాళ్ళకి చేతులకి కట్లు కట్టుకుని దగ్గరగా పడుకున్నా భార్యాభర్తలను చూసి సిగ్గుపడుతుంది.
ధాన్యలక్ష్మి : అదేం కర్మో, చూడకూడనివి అన్ని నేనే చూస్తాను, అయినా ఇలా కట్లు కట్టుకోవడం ఏమిటి?
రాజ్ ఏదో చెప్పబోతుంటే కావ్య ఆపుతుంది.తనే మాట్లాడుతూ..
కావ్య : ఇదంతా మీ అబ్బాయి సరదాగా ఆడుతున్న ఆట అని అబద్ధం చెప్తుంది. తర్వాత కట్లు విప్పమని అడుగుతుంది కావ్య.
ధాన్యలక్ష్మి : కట్లు విప్పేసి, ఈ సంగతి ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
రాజ్ : ఎందుకు అబద్ధం చెప్పావు.
కావ్య: నిజం చెప్తే సింగిల్ దొంగను కూడా హ్యాండిల్ చేయలేదని మిమ్మల్ని అందరూ అంటారు నేను మిమ్మల్ని సేవ్ చేశాను.
రాజ్: సరే ఆకలవుతుంది వెళ్లి టిఫిన్ చెయ్యు.
కావ్య: ఏం చేయమంటారు.
రాజ్: ఏదో ఒకటి చెయ్యు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు.
మరోవైపు దొంగ చాటుగా వెళుతున్న స్వప్నని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది.
స్వప్న : బ్యూటీ పార్లర్ కి అని అబద్ధం చెప్తుంది.
రుద్రాణి: దానికి నువ్వు వెళ్లడం ఎందుకు వాళ్ళని ఇంటికి రప్పిద్దాం, అయినా బ్యూటీ పార్లర్ కి వెళ్లడానికి అంత పెద్ద బ్యాగ్ ఎందుకు అని స్వప్న చేతిలో బ్యాగ్ ని చూపిస్తూ అడుగుతుంది.
స్వప్న: తను నా ఫ్రెండ్, తను హెడ్ మసాజ్ బాగా చేస్తుంది అని చెప్తూ ఫేస్ క్రీములు అయిపోయాయి తెచ్చుకోవటానికి ఈ మాత్రం బ్యాగ్ ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
రుద్రాణి : అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ తో తను డబ్బులు ఇస్తుండగా ఫోటోలు కావాలి అని ఆ రాజేష్ తో చెప్పు అని చెప్తుంది.
మరోవైపు టిఫిన్ చేయకుండా మూడీగా ఉన్న అప్పునే తనతో పాటు టిఫిన్ చేయడానికి రమ్మంటాడు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి : కూతురికి టిఫిన్ తినిపిస్తూ చిన్నప్పుడు మీకు ఇలాగే కనిపించే వాడిని కానీ మీరు పెద్ద అయ్యారు తినడం నేర్చుకున్నారు. నువ్వు ప్రేమించడం తప్పు కాదు కానీ నీలో ప్రేమను పుట్టించిన ఆ దేవుడు ఆ ప్రేమకి ఆయువుని ఇవ్వలేదు, నిజాన్ని తెలుసుకో అప్పు, ఆ బాధ నుంచి బయటికి రా అని చెప్పటంతో ఎమోషనల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు.
మరోవైపు ఏదో ఒక టిఫిన్ చెయ్యు అని చెప్పడంతో అలాగే దోశ వేసి తీసుకువస్తుంది కావ్య.
రాజ్ : మూత తీసి చూసేసరికి డిఫరెంట్ గా ఉన్న ఆ దోశను చూసి షాక్ అవుతాడు ఏంటిది అని అడుగుతాడు.
కావ్య: మీరే కదా ఏదో ఒకటి చేయమన్నారు అందుకే అలా చేశాను అంటుంది.
అది చూసి చిరాకు పడుతున్న భర్తని ఆవేశ పడకండి కింద అన్ని టిఫిన్లు వెయిట్ చేస్తున్నాయి రండి అని చెప్పి కిందికి తీసుకువెళ్తుంది. అది చూసిన ధాన్యలక్ష్మి ఏంటమ్మా ఇదంతా అని అడుగుతుంది ఊరికే అత్తయ్య సరదాగా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు స్వప్న దగ్గరికి వచ్చిన రాజేష్ డబ్బులు ఇమ్మని అడుగుతాడు.
స్వప్న: ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే మళ్లీ అడగవు అని గ్యారెంటీ ఏంటి.
రాజేష్: హాస్పిటల్ కట్టడం కోసమే అడుగుతున్నాను అంతేగాని నీ దగ్గర డబ్బులు వసూలు చేయడం నా ఉద్దేశం కాదు.
స్వప్న: నా కాపురం సజావుగా సాగినంత సేపే నీ ఆటలు చెల్లుతాయి. అక్కడ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తూ డబ్బులు రాజేష్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు రాజేష్ స్వప్న ఇద్దరూ ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరూ కలిసిపోతారేమో మన బండారం బయట పెట్టేస్తారేమో అని కంగారు పడుతూ ఉంటుంది రుద్రాణి.
రాహుల్: కంగారు పడకమ్మా ఇదిగో రాజేష్ ఫొటోస్ పంపించాడు అని చెప్పి తల్లికి ఫోటోలు చూపిస్తాడు రాహుల్.
రుద్రాణి : దీని కథ కంచికి చేరే సమయం వచ్చేసింది, ఇక దీనిని కాపాడటం ఎవరి తరం కాదు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.