Brahmamudi serial today Episode : రాజ్‌ బెడ్‌ రూంలో కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అక్కడ వస్తుంది. కావ్యను చూసిన రాజ్‌ అసహనంగా స్వప్నను తిడతాడు.


కావ్య: ఎవరి గురించి మీరు మాట్లాడేది.


రాజ్‌: ఇంకెవరు మీ అక్క గురించే..


కావ్య: మా అక్క తప్పు చేసిందని రాహుల్‌ లాగే మీరు నమ్ముతున్నారా?


రాజ్‌: తప్పు చేయలేదు అనడానికి తన దగ్గర నోరు తప్ప ఒక్క సాక్ష్యమైనా ఉందా?


కావ్య: శీలానికి సాక్ష్యం కావాలా? ఆడదాని పవిత్రతకి సాక్ష్యం కావాలా?


రాజ్‌: అంటే ఆ మాటలు చెప్పి విచ్చలవిడిగా బతకొచ్చా?


కావ్య: కొంచెం మర్యాదగా మాట్లాడండి. అది అందరికీ విడిగా బతికింది. విచ్చలవిడిగా బతకలేదు.


రాజ్‌: నువ్వే సర్టిఫికెట్‌ ఇవ్వాలి.  అక్క తప్పుకు చెల్లెలు సపోర్ట్‌ ఇస్తుందా? సమర్థించడానికి ఒక హద్దు ఉండాలి.


కావ్య: నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి.


రాజ్‌: హద్దులు గురించి తెలిసిన మనిషే అయితే పెళ్లైన తర్వాత ఆ అరుణ్‌తో పరిచయాన్ని రహస్యంగా ఉంచదు. నేను చూశాను వాణ్ణి కలవడం. కలిసి మాట్లాడటం.


కావ్య: ఒక ఆడపిల్ల ఒక మగాడితో పూర్వ పరిచయంతో మాట్లాడటం  మీ దృష్టిలో నేరమా?


రాజ్‌: నగలు తాకట్టు పెట్టి డబ్బు ఇవ్వడం నీ దృష్టిలో మంచిపనా?


అనగానే కావ్య కోపంగా నువ్వు చదువుకున్న చదువులు ఏమయ్యాయి. ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావ్‌ అంటుంది. నేనే మూర్ఖంగా ప్రవర్తిస్తే నేను నిజంగా మూర్ఖుడినే అయితే నిన్ను కూడా ఎప్పుడో ఇంట్లోంచి గెంటేసేవాడిని అంటాడు రాజ్.  దీంతో కావ్య షాక్‌ అవుతుంది. స్వప్న విషయంలో జరుగుతున్న నిజానిజాలు ఏంటో నేను ప్రూవ్‌ చేస్తాను. అంటూ కావ్య.. రాజ్‌తో చాలెంజ్‌ చేస్తుంది. స్వప్న బెడ్‌రూంలో రాహుల్‌ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్‌ లోపలికి వచ్చి..


రాహుల్‌: ఏంటే మహరాణిలా బెడ్‌ మీద కూర్చున్నావు.


స్వప్న: ఇక్కడ వేరే బెడ్‌ ఉందా?


రాహుల్‌: తప్పు చేసిన తర్వాత కూడా ఇంకా ఏంటే  మాట్లాడుతున్నావు.


స్వప్న: నేనేం తప్పు చేశాను.


రాహుల్‌: ఆ దరిద్రాన్ని మళ్లీ నా నోటితోనే చెప్పాలా?


స్వప్న: అలాంటి పనులు నీకు అలవాటు నాకు కాదు.


రాహుల్‌: అలా అనే ఇన్ని రోజులు నన్ను నమ్మించావు. పైగా ఇంట్లో అందరి ముందు నన్ను తిరుగుబోతునని చూపించావ్‌. కానీ అసలైన తిరుగుబోతువు నువ్వు.


స్వప్న: అలా అన్నందుకే ఇందాకా అందరి ముందు నీ చెంప మీద చాలా గట్టిగా సమాధానం చెప్పాను. అంటూ రాహుల్‌ను బెడ్‌రూంలోంచి బయటికి తోసేసి డోర్‌ వేసుకుంటుంది స్వప్న. రాహుల్‌ కోపంగా స్వప్నను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


అప్పు ఇంట్లో బెంగగా కూర్చుని ఉంటుంది. వాళ్ల నాన్న అప్పును ఓదారుస్తుంటాడు. కనకం అప్పు దగ్గరకు వచ్చి నాన్న అన్న మాటలకు బాధపడుతున్నావా? ఇంట్లో ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేదని ఏడుస్తున్నావా? అని అడుగుతుంది. అప్పుడు అప్పు ఏం లేదని చెప్తుంది. ప్రతి క్షణం మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నానని అప్పు చెప్తుంది. కళ్యాణ్‌ దూరం అవుతున్నాడన్న విషయాన్నే నేను తట్టుకోలేకపోతున్నానని బాధగా చెప్తుంది అప్పు. నా ప్రేమను కళ్యాణ్‌ ఎందుకు అర్థం చేసుకోలేదోనన్న బాధ మరింత బాధిస్తుంది అంటూ ఏడుస్తుంది అప్పు.


బెడ్‌రూంలో నిద్రపోతున్న రాజ్‌ను తదేకంగా చూస్తుంటుంది కావ్య. మెలుకువ వచ్చిన రాజ్‌, కావ్యను చూసి ఉలిక్కిపడతాడు.


రాజ్‌: ఏమైందే..


కావ్య: తెల్లారిందండి.. అలాగే నాకు జ్ఞానోదయం అయ్యిందండి.


అంటూ రాజ్‌ కాళ్లు స్వప్న మొక్కబోతుంటే రాజ్‌ దూరం జరిగి ఇందేటని అడుగుతాడు.


కావ్య: పతి పాదాలకన్నా సతికి ఇలలో వేరే దైవం లేదు.


అంటూ రాజ్‌ పాదాలు బలవంతంగా మొక్కుతుంది కావ్య. రాజ్‌ పాదాలు వదలమనడంతో ఆశ్వీర్వదించండి అని అడుగుతుంది కావ్య. శీగ్రమేవ సద్బుద్ది ప్రాప్తిరస్తూ అంటూ రాజ్‌ ఆశీర్వదిస్తాడు. కావ్య గుడ్‌ మార్నింగ్‌ చెప్పి వెళ్లిపోతుంది.


అప్పును టిఫిన్‌ చేయమని వాళ్ల పెద్దమ్మ పిలవడంతో నాకు టిఫిన్‌ వద్దని ఇంత విషం పెట్టమని కోపంగా చెప్తుంది అప్పు. అదే నాకు మా అమ్మకు మంచిదని చెప్పి బయటకు వెళ్తుంది అప్పు. కనకం షాకింగ్‌ అప్పును చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.