Brahmamudi Serial Today Episode: కల్యాణ్ పేరుతో గుడిలో అర్చన చేయిస్తారు. చాటు నుంచి చూస్తున్న కళ్యాణ్ ఎమోషనల్ గా ఫీలవుతాడు. అప్పు కళ్యాణ్‌ను ఓదారుస్తుంది. అయితే అప్పు కళ్యాణ్ లను చూసిన రాజ్ వారి దగ్గరకు వస్తాడు. బర్తుడే విషెస్ చెప్తాడు. పరాయివాడిలా ఎందుకు దూరంగా వెళ్లిపోతున్నావని నిలదీస్తాడు. దీంతో కళ్యాణ్ నేను అక్కడికి వస్తే జరిగే పరిణామాలు తెలుసు కాబట్టే దూరంగా చాటుగా ఉన్నానని కళ్యాణ్ చెప్తాడు. అయితే ఈ ఏర్పాట్లన్నీ పిన్ని చేసిందని రాజ్ అబద్దం చెప్తాడు. అయితే మా అమ్మకు నేను క్షేమంగా ఉండటమే కావాలని కానీ నాకేం కావాలో ఆలోచించదని బాధపడతాడు కళ్యాణ్. ఇవన్నీ కళ్యాణ్ కోసమే చేసినప్పుడు కళ్యాణ్ ను ఎందుకు పిలవలేదని అప్పు రాజ్‌ను అడుగుతుంది.
మరోవైపు అపర్ణ వంట చేస్తుంది. వంట ఘాటుకు దగ్గడంతో కావ్య ఇక మీరు కిచెన్‌లో ఉండొద్దు అత్తయ్య అని ఆమె చేతిలో గరిటె లాక్కుంటుంది. ఇంతలో కావ్యకు ఫోన్ వస్తుంది. రాహుల్ పురమాయించిన వ్యక్తి కావ్యకు ఫోన్ చేసి రాహుల్ చెప్పినట్లు చెప్తాడు. దీంతో కావ్య.. అదే విషయం అపర్ణకు చెప్పి ఆఫీసుకు వెళ్తుంది. మరోవైపు కళ్యాణ్ ను గుర్తు చేసుకుని ధాన్యలక్ష్మీ ఏడుస్తుంది.
ధాన్యలక్ష్మీ: అప్పును వదిలేసి కళ్యాణ్ ఒక్కడే ఇంటికి వస్తే బాగుండు.
ప్రకాష్: నువ్వు నన్ను వదిలేసి వెళ్తే.. కళ్యాణ్ కూడా అప్పును వదిలేస్తాడు.
ఇంతలో అప్పు, కళ్యాణ్ లను తీసుకుని అక్కడకు వస్తాడు రాజ్. అందరూ కళ్యాణ్‌కు విషెష్ చెప్తారు. ధాన్యలక్ష్మీ మౌనంగా ఉంటుంది.
ధాన్యలక్ష్మీ: వీళ్లను ఎదరు పిలిచారు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు. అన్నదానం అనగానే ఫ్రీగా బోజనం దొరుకుతుందని వచ్చారా?
ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు.. నీ బుద్ది ఎప్పుడూ కుక్క తోక వంకర అన్నట్లుగానే ఉంటుంది.
రాజ్: అదేంటి పిన్ని అలా మాట్లాడతావు. పంతాలు, పట్టింపులు వీడి అందరం కలిసిపోదామంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చా?
అప్పు: కళ్యాణ్ ఈ ఒక్కరోజు మీ వాళ్లతో కలిసి ఉండి రా.. నేను వెళ్లిపోతాను.
ధాన్యలక్ష్మీ: ఒక్క పూట కోసం నా కొడుకును నువ్వు నాకు దానం చేస్తున్నావా?
ప్రకాష్: ఈ గొడవల వల్ల నీ అహం చల్లారడం తప్పా మనకు ఒరిగేమీ ఉండదు.
ధాన్యలక్ష్మీ: ఈ విషయంలో నేను ఎవరి మాట వినేది లేదు. అప్పును వదిలేసి వస్తే ఈ క్షణమే నేను కళ్యాణ్‌ను దగ్గరకు తీసుకుంటాను. ఇంట్లోకి ఆహ్వానిస్తాను.
స్వప్న: అయితే కళ్యాణ్, అప్పు దూరమవడం ఈ జన్మలో జరగదు. ఈ జన్మంతా కొడుకును దూరం చేసుకొని ఉండటం మినహా మీకు మరో దారి లేదు.
ధాన్యలక్ష్మీ: ఇది మా కుటుంబ విషయం, నీ జోక్యం అవసరం లేదు.
స్వప్న: ఇది నా చెల్లెలి కాపురానికి సంబంధించిన విషయం.
కళ్యాణ్: ఒక్క పూట భోజనానికి నా భార్యను అన్నదానానికి తీసుకొచ్చే పరిస్థితికి నేనింకా దిగజారలేదు. నీ ఆస్తులు, ఐశ్వర్యాలు కూడా నాకు ఏమీ వద్దు. అన్నయ్యా ఇలా గొడవ జరుగుతుందనే నేను రానని చెప్పాను. చూశావా మా అమ్మా ఎలా మాట్లాడుతుందో..
రాజ్: నా తమ్ముడి బర్తుడే సందర్భంగా ఈ అన్నదానానికి నా భార్య చెల్లెలు, నా మరదలు అయిన అప్పును ఆమె భర్తను నేను అహ్వానించాను.
అని రాజ్ చెప్పి ధాన్యలక్ష్మీ చేత అప్పు, కళ్యాణ్ లకు భోజనం వడ్డిచేలా చేస్తాడు రాజ్. ఇష్టం లేకపోయినా ధాన్యలక్ష్మీ భోజనం వడ్డిస్తుంది. మరోవైపు ఆఫీసుకు వెళ్లిన కావ్య ఫైల్స్ చెక్ చేస్తుంది. ఇంకోవైపు ట్యాబ్లెట్స్ వేసుకున్న అపర్ణ కింద పడిపోయి కొన ప్రాణాలతో కొట్టుకుంటూ కావ్యకు ఫోన్ చేస్తుంది. ఫోన్ దూరంగా ఉండటంతో కావ్య ఫోన్ లిఫ్ట్ చేయదు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి