Brahmamudi Serial Today Episode:  రాహుల్‌, రుద్రాణి కలిసి అపర్ణను చంపేసి ఆ నేరం కావ్య మీద పడేలా చేయాలనుకుంటారు. తర్వాత సీతారామయ్య రాజ్‌తో మాట్లాడుతాడు. జరిగిన దానికి భయంగా ఉందని ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలు అవుతుందేమోనని సీతారామయ్య చెప్పడంతో రాజ్ ఓదారుస్తాడు. దీంతో తన కోరిక ఒక్కేనని తన ఊపిరి ఉన్నంత వరకు కుటుంబం కలిసే ఉండాలని కోరుతాడు సీతారామయ్య. దీంతో తాతయ్య మీరు భయపడుతున్నట్లు ఏమీ జరగదు. వెళ్లిపోయిన కళ్యాణ్‌ ను ఇంటికి తీసుకొస్తాను. అందరం కలిసు ఉండేలా చూస్తానని రాజ్‌ మాట ఇస్తాడు. దీంతో సీతారామయ్య హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు రాహుల్ నవ్వుతాడు. కావ్యను ఎలా దెబ్బ కొట్టానో చూశావా అని రాహుల్ అంటాడు.


రుద్రాణి: అవును ఇంతకీ పోలీసులు నిన్ను ఎందుకు వదిలేశారు. ఎలా బయటపడ్డావు.


రాహుల్‌: ఈ సమస్య వస్తుందని నాకు ముందే తెలుసు మామ్‌. అందుకే నా ప్లేస్‌లో నేరం ఒప్పుకునేందుకు ఒకడిని సెట్ చేశాను.


రుద్రాణి: వావ్‌ ఇప్పుడు నా కొడుకువి అనిపించుకున్నావురా..


రాహుల్‌: ఆ కావ్య మనకు చేసిన ద్రోహానికి ఇంటి నుంచి పంపించేలా చేస్తాను. ఈరోజు నేను చేసిన పనికి కావ్యపై రాజ్ కోపంగా ఉంటాడు.


 అని ఇరిటేటింగ్‌ గా చూస్తుంటాడు రాహుల్‌. మరోవైపు కావ్య పాలు తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్లి భోజనం చేయలేదు కదా కనీసం ఈ పాలైనా తాగండి అని చెప్తుంది. దీంతో ఇరిటేటింగ్‌ గా రాజ్‌ పాలు విసిరికొట్టక ముందే ఇక్కడి నుంచి తీసుకెళ్లు అంటాడు.  


కావ్య: అయినా ఎందుకండి నాపై మీకంత కోపం


రాజ్‌: ఒక్క రోజు ఆగి ఉంటే అయిపోది కదా. నీ వల్ల రాహుల్ అరెస్ట్ అయ్యాడు. ఇంకా నువ్వు రాహుల్ తప్పు చేశాడని నమ్ముతున్నావా?


కావ్య: నేను నమ్ముతున్నాను. ముమ్మాటికి రాహుల్ తప్పు చేశాడు. తెలివిగా తప్పించుకున్నాడు.


రాజ్: నీ అర్థంలేని అభిప్రాయాల వల్ల ఇల్లు ముక్కలైపోయేలా ఉంది. తాతయ్య ఆరోగ్యం దెబ్బతినేలా ఉంది.


కావ్య: ఇప్పుడు ఇల్లు ముక్కలు ఎందుకు అవుతుందో నాకు అర్థం కావడం లేదు.


రాజ్‌: రాహుల్ బదులు నేను అరెస్ట్ అయి ఉంటే.. నేను కూడా బెయిల్ మీద వచ్చేవాడిని


కావ్య: లేదు. రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి సాక్ష్యాలు తారుమారు చేసి వచ్చాడు. మీరైతే నిజాన్ని బయటకు రానిచ్చేవారు కాదు. జైలుకు వెళ్లేవారు. బెయిల్ కూడా వచ్చేది కాదు.


రాజ్: అది నా సమస్య నేను చూసుకునేవాడిని.


కావ్య: నేను మీరు వేరు కాదండి. మిమ్మల్ని కాపాడుకోవడమే కాదు కంపెనీ బాగోగులు కూడా చూసుకోడం కూడా నాకు ముఖ్యం.  నా భర్త ఏ స్థానంలో ఉండాలో దాన్ని పదిలంగా కాపాడటం కోసం నేను ఎవరినైనా ఎదురుకుంటాను. తాతయ్య నిర్ణయాన్ని అయినా సరే తప్పు పడతాను.


రాజ్: నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు లేని పోని పెద్దరికాలు ఎక్కువయ్యాయి. అలుసు ఇచ్చాను కదా అని నచ్చినట్లు చేయకు.


 అంటూ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక నుంచి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది చెప్పి చేయాల్సిన బాధ్యత నీకుంది. అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు.  మరోవైపు నిద్రలోంచి లేచిన కళ్యాణ్‌ అప్పు పక్కన లేకపోయేసరికి టెన్షన్‌ పడతాడు. అప్పుకు కాల్‌ చేస్తాడు. ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుంది. కంగారుగా మొత్తం వెతుకుతాడు. ఎక్కడా అప్పు కనిపించదు. బాధగా మెట్ల మీద కూర్చున్న కళ్యాణ్‌కు ఎదురుగా అప్పు డెలివరీ బ్యాగ్‌తో కనిపిస్తుంది. కళ్యాణ్‌ అప్పును తిట్టి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. అప్పు కళ్యాణ్‌ కళ్లు మూసుకో అని చెప్పి బ్యాగులోంచి కేక్‌ తీసి బర్తుడే విషెష్‌ చెప్తుంది. కళ్యాణ్‌ ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత ఇద్దరూ కలిసి లైఫ్‌ గురించి ఆలోచిస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 


ALSO READ:  ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్, గౌరిల జాతకం చెప్పిన సోదమ్మ – అకిని తిట్టిన అభయ్