Brahmamudi Serial Today Episode: డ్రెస్సులు తీసుకుని ఇంటికి వచ్చిన రాజ్‌ను పర్సనల్‌గా మాట్లాడాలని బయటకు వెళ్దామా అంటాడు కళ్యాణ్. సరేనని రాజ్ చెప్పి ఇద్దరూ వెళ్లబోతుంటే కావ్య వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. బయటకు అని రాజ్ చెప్పగానే మీ ఇద్దరికీ అంత పర్సనల్ విషయాలు ఉన్నాయా.. సరే వెళ్లండి ఏం చేద్దాం అంటూ కావ్య లోపలికి వెళ్లిపోతుంది. రాజ్, కళ్యాణ్ కారులో వెళ్తుంటారు.
రాజ్: ఇప్పుడు చెప్పరా కళ్యాణ్ ఏంటి విషయం
కళ్యాణ్: అదే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అన్నయ్య
రాజ్: ఎలా చెప్పడం ఏంటిరా..? నోరు ఉంది కదా నోటితో చెప్పు
కళ్యాణ్: కానీ ధైర్యం సరిపోవడం లేదు అన్నయ్య
రాజ్: అరే పెద్ద సమస్యే వచ్చి పడిందే.. పోనీ మందేసి మాట్లాడుకుందాం అనుకుంటే మనకు ఆ అలవాటు లేదు. ఓకే నేనే గెస్ చేస్తాను. ఇంత రాత్రి పూట అంత అర్జెంట్‌గా మాట్లాడాలి అన్నావంటే ఏదో పెద్ద మ్యాటరే అయ్యుంటుంది.
కళ్యాణ్: (మనసులో) అవును అన్నయ్య చాలా పెద్ద మ్యాటరే కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు
కారు పక్కన ఆపి ఏం చెప్పాలో ఇప్పుడు చెప్పరా..? అని అడుగుతాడు రాజ్. దీంతో తాము హాస్పిటల్‌కు వెళ్లిన విషయం చెప్పి కావ్యకు బదులు అప్పుకు ప్రాబ్లం అని చెప్తాడు కళ్యాణ్.
కళ్యాణ్: అప్పుకు అబార్షన్ చెయ్యాలని చెప్పారు.
రాజ్: ఏంట్రా నువ్వు చెప్పేది
కళ్యాణ్: అవును అన్నయ్య ఒకవేళ వినకుండా అలాగే 9 నెలలు క్యారీ చేస్తే అప్పు ప్రాణానికే ప్రమాదం. తనని కాపాడే అవకాశం లేదు అని చెప్పారు. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తే తర్వాత అబార్షన్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందన్నారు
రాజ్: మరి ఈ విషయం అప్పుకు చెప్పావా..?
కళ్యాణ్: ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అన్నయ్య అసలు ముందు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకే తెలియడం లేదు. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోని బిడ్డ ఒకవైపు.. తన మీద ఆశలు పెంచుకున్న తల్లి మరొక వైపు. ఇప్పుడు చెప్పు అన్నయ్య నన్నేం చేయమంటావు. నా పరిస్థితుల్లో నువ్వే ఉంటే ఏం నిర్ణయం తీసుకుంటావు
రాజ్: నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తే డాక్టర్ చెప్పిన మాట వినడం మంచిది అనిపిస్తుంది. వెంటనే ఈ విషయం అప్పుకు చెప్పి తనను ఎలాగైనా ఒప్పించాలిరా..?
కళ్యాణ్: అయితే ఒప్పించు అన్నయ్య
రాజ్: నేను ఒప్పించడం ఏంటిరా..? భర్తగా తనను నువ్వే ఒప్పించాలి.
కళ్యాణ్: అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను అన్నయ్య.. వదినకు ఆ నిజాన్ని నువ్వే చెప్పు
రాజ్: ఏంటి వదినకు చెప్పాలా..? అరేయ్ ఏం మాట్లాడుతున్నావురా..?
కళ్యాణ్: అవును అన్నయ్య ప్రాబ్లం వచ్చింది అప్పుకు కాదు వదినకు అన్నయ్య
రాజ్: ఏంటిరా.. ఏం మాట్లాడుతున్నావు...?
కళ్యాణ్: ఇది నువ్వు నమ్మడానికి నీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు.. కానీ ఇది నిజం అన్నయ్య.. వదినకే వచ్చింది ఈ ప్రాబ్లం.. నేను అప్పు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు అక్కడ డాక్టర్ ఈ విషయం చెప్పారు. అసలు ఈ విషయం నేరుగా వదినకే చెప్పాలనుకున్నాం. కానీ తను ఎదురుపడిన ప్రతిసారి మాలో మేమే కుమిలిపోయాం. అందుకే ఈ విషయం నీకు చెబితే ఆ బాధ్యత నువ్వు తీసుకుంటావని చెప్పాను అన్నయ్య.. ఇప్పటికే మేము చాలా టైం తీసుకున్నాము వెంటనే నువ్వు వదినను హాస్పిటల్ కు తీసుకెళ్లి వదినను బతికించు అన్నయ్య
రాజ్: నిజం చెప్పాలి అంటూ ఇంత పెద్ద శిక్ష వేశావేంట్రా.. నా నోటితో ఈ నిజాన్ని మీ వదినకు ఎలా చెప్పగలను.. చెబితే ఆ పిచ్చిది బతకగలదా..? నన్ను పెళ్లి చేసుకున్న దగ్గరి నుంచి తనకు ఏ సంతోషం లేదురా..? ఇప్పుడిప్పుడే దానిలో సంతోషాన్ని చూస్తున్నానురా..? ఇప్పుడు ఆ సంతోషం కూడా దూరం చేయాలా..?
అని రాజ్ బోరున విలపిస్తుంటాడు. కట్ చేస్తే కావ్య, అపర్ణ, ఇందిరాదేవి హాల్లో కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు. రాజ్, కళ్యాణ్ వస్తారు. రాజ్ ఏమీ మాట్లాడకుండా దేవుడి రూంలోకి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. మరోవైపు రూంలో కళ్యాణ్ రాగానే నిజం చెప్పావా అని అప్పు అడుగుతుంది చెప్పానని కళ్యాణ్ చెప్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!