Brahmamudi Serial Today Episode: రాజ్ కిందకు వస్తూ అందరూ నన్ను బతిమాలడానికి రెడీగా ఉన్నట్లున్నారు అనుకుంటాడు. కానీ ఎవ్వరూ రాజ్‌ను పట్టించుకోరు దీంతో ఏదో తేడాగా ఉందే అని తనే ఒక్కొక్కరిని పలకరిస్తుంటే ఎవ్వరూ సరిగ్గా రెస్పాండ్‌ కారు. ఇంతలో ప్రకాష్‌ పిలిచి నాకు నిన్నటి నుంచి నీకేదో చెప్పాలి అనిపిస్తుందిరా అనగానే నాకు తెలుసు బాబాయ్‌ నువ్వేం చెప్తావో అనగానే మర్చిపోయానురా అంటాడు ప్రకాష్‌. అందరూ నవ్వుతుంటారు. ఇప్పటి నుంచి నువ్వు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక బోర్డు మీద రాసి పెట్టుకో అని రాజ్‌ చెప్తాడు.


ధాన్యలక్ష్మీ: ఆ బోర్డు కూడా ఎక్కడ పెట్టారో మర్చిపోతాడు రాజ్‌.


ప్రకాష్‌: నువ్వు ఉన్నవు కదే గుర్తు చేయడానికి అయినా నీకు కూడా రాజ్‌ లాగా పని పాట ఏం లేదు  కదా? ఎప్పుడు అక్కడ కూర్చుని కాఫీలు తాగుతుంటావు కదా? నువ్వే గుర్తు చేయ్‌.


రాజ్‌: గుడ్‌ మార్నింగ్‌ డాడీ..


సుభాష్‌: గుడ్‌ మార్నింగ్‌ రాజ్‌..


రాజ్‌: మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా..?


సుభాష్‌: అవును రాజ్‌ నిజమే..


రాజ్: పర్వాలేదు చెప్పండి పితృవాక్య పరిపాలన చేయడం పుత్రుల ధర్మం.


సుభాష్‌: కానీ చెప్తే నువ్వు ఒప్పుకోవేమోరా..?


రాజ్‌: అయితే నాకు అర్థం అయింది. మీరు చెప్పినా నేను ఒప్పుకోను


అంటాడు రాజ్‌. దీంతో నా కారు సర్వీస్‌కు ఇచ్చాను కదా? నీ కారు అడుగుదామనుకున్న కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు అంటాడు సుభాష్‌. అయినా వాణ్ని అడగడం ఏంటి అన్నయ్యా వాడికి ఎలాగూ పనిపాట లేదు కదా? వెళ్లి నువ్వే తీసుకో అంటాడు. ఇంతలో అపర్ణ రాజ్‌ అని పిలుస్తూ వస్తుంది.


రాజ్‌: మమ్మీ గ్యారంటీగా అదే అడుగుతుంది. మమ్మీ ఏంటి మమ్మీ..


అపర్ణ: నీతో ఇదే చిక్కురా.. ఏదైనా చెబితే ఒక పట్టానా ఒప్పుకోవు.


రాజ్‌: ముందు విషయం ఏంటో చెప్పు మమ్మీ.. ఒప్పుకోవాలా వద్దా నేనే డిసైడ్‌ చేస్తాను.


అపర్ణ: అదేంటంటే…


రాజ్‌: నాకు తెలుసు మమ్మీ..


రుద్రాణి: వాడేం తెలుసు అంటున్నాడు.  


రాహుల్‌ : నాకేం తెలుసు మమ్మీ నేను నీ పక్కనే ఉన్నానుగా..


అపర్ణ: నీకు ముందే తెలుసా..? నేను నిన్ను కూరగాయలు తీసుకురమ్మని చెప్తానని నీకు ముందే తెలుసా..?


రాజ్‌: నేనే కూరగాయలా..?


అపర్ణ: అవును నువ్వే.. ఇంట్లో ఖాళీగానే కూర్చున్నావుగా పైగా ఆ కావ్యకు జడుసుకుని ఆఫీసుకు కూడా వెళ్లడం లేదు కదా?


   అనగానే మీరు రూటు మార్చారా..? అనుకుని సరే తీసుకొస్తాను లిస్ట్‌ ఇవ్వండి అని రాజ్‌ అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు. లిస్ట్‌ రాసుకుని రాజ్‌ వెళ్లిపోతాడు. అపర్ణ, కనకానికి ఫోన్‌ చేసి రాజ్‌ కూరగాయలకు వస్తున్నాడు అని చెప్తుంది. ఇక మిగిలింది నాకు వదిలేయండి అంటుంది కనకం. ఆఫీసుకు కావ్య వస్తుందని.. రాజ్‌ వస్తుందని ఎంప్లాయీస్‌ పందెం వేసుకుంటారు. ఇంతలో కావ్య వచ్చి అందరినీ తిడుతుంది. ఎవరి పనులకు వాళ్లే వెళతారు. శృతిని పిలిచి ఒక మీటింగ్‌ అరెంజ్‌ చేయమని కావ్య చెప్తుంది.  మరోవైపు రాజ్‌ కూరగాయల షాపు దగ్గరకు వెళ్తాడు.


రాజ్‌: గుమ్మడి కాయ ఎంత..?


షాపు అతను: ఎంత బాబు వంద రూపాయలే..


రాజ్‌: ఏంటి ఇంత చిన్న యాపిల్‌ కే యాభై రూపాయలు తీసుకుంటుంటే దానికంటే సైజులో ఎంతో పెద్దది. దీనికి రెండు వందలు తీసుకోవాలి. లేకపోతే నేను హర్ట్ అవుతాను. ఇలా అయితే ఎలా బతుకుతావు.


షాపు అతను: వీడెవడో డబ్బున్న అమాయకుడిలా ఉన్నాడు. ఇవాళ నాపంట పండినట్టే.. (అని మనసులో అనుకుంటాడు) నిజమే బాబు మా ఆవిడ కూడా ఆ మాటే అంటుంది. నీ లాంటి దొరబాబును చూస్తుంటే సగానికి సగం తగ్గించి చెప్పాలనిపిస్తుంది.


అని రాజ్‌ దేని గురించి అడిగినా డబుల్‌ రేటు చెస్తుంటాడు. దీంతో రాజ్‌ సరే అంటాడు. అంతా గోడ చాటు నుంచి గమనిస్తున్న కనకం నీ పని చెప్తా ఉండు అనుకుంటుంది. ఇంతలో రాజ్‌ తీసుకున్న కూరగాయలకు మొత్తం బిల్లు 6200 అయిందని 6వేలు ఇవ్వండని చెప్పగానే ఇంతేనా అని రాజ్‌ డబ్బులు ఇవ్వబోతుంటే కనకం వచ్చి ఆపుతుంది. ఆరు వందలు కూడా చేయని కూరగాయలకు ఆరు వేలు వేస్తావా? అంటుంది. రాజ్‌.. కనకాన్ని కోపంగా చూస్తుంటే


కనకం: షాక్‌ అయ్యావా బాబు..


రాజ్‌: అవును వాడు రేట్లు ఎక్కు వ చెప్పినందుకు కాదు.


కనకం: మరి


రాజ్‌: ఈ టాఫిక్‌ లోకి నేను ఖాళీగా ఉన్నానని ఎందుకు తీసుకొచ్చారు.


కనకం: అది కాదు బాబు వీడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు బాబు.


రాజ్‌: మీరు చేసింది ఏంటి కాన్సర్ కనకం గారు. మీరు క్యాన్సర్‌ అని రాలిపోయే పువ్వు అని వాలిపోయే పొద్దు అని నన్ను మోసం చేయలేదా?


అంటూ రాజ్‌ తిడుతుంటే కనకం ఆ విషయంలో కావ్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. రాజ్‌ వినకుండా తిట్టగానే కనకం ఏవేవో సామెలు చెబుతూ రాజ్‌ను కన్పీజ్‌ చేస్తుంది. దీంతో రాజ్‌ కూరగాయలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కావ్య దగ్గరకు వచ్చి శృతి క్లయింట్స్‌ ఎవరూ మీటింగ్‌ కు రానంటున్నారని చెప్తుంది. ఇంతలో అనామిక ఫోన్‌ చేసి నీ క్లయింట్స్‌ అందరినీ నేను లాక్కున్నానని చెప్పడంతో కావ్య అనామికకు వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!