Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌ సాంగ్‌ పాడతాడు. పాట బాగుందని ప్రోడ్యూసర్‌, రైటర్‌ మెచ్చుకుంటారు. ప్రోడ్యూసర్‌ డబ్బులు ఇచ్చి రైటర్‌ చెప్పి ఎలాగైనా ఈ అబ్బాయితో మన సినిమాకు ఒక పాట రాయించండి అని చెప్పి వెళ్లిపోతాడు. సరేనని రైటర్‌ కళ్యాణ్‌ చేతిలో డబ్బు తీసుకుని కొన్ని డబ్బులు ఇచ్చి ఫోన్‌లో టచ్‌లో ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు ఆఫీసుకు వచ్చిన రాజ్‌ చైర్మన్‌ చైర్‌లో ప్యూన్‌ కూర్చుని ఉండటం చూసి  తిడతాడు. ఎవడూ పడితే వాడు కూర్చోవడానికి ఇదేమైనా బస్టాడ్‌లో వేసిన సీటా అంటాడు. మరోవైపు ఇంటికి వెళ్లిన కళ్యాణ్‌ సంతోసంగా అప్పును పిలుస్తాడు.


అప్పు: అబ్బా ఎందుకు అలా అరుస్తున్నావు.


కళ్యాణ్‌: ఏం జరిగిందో చెప్తే నువ్వు నాకంటే గట్టిగా అరుస్తావు.


అప్పు: అరుస్తానో కరుస్తానో ముందు ఏం జరిగిందో చెప్పు.


కళ్యాణ్‌: ఇదిగో ఐదు వేలు..


అప్పు: ఇంత డబ్బు  ఎక్కడిది.


కళ్యాణ్‌: ఎక్కడిది ఏంటి.. సంపాదించాను..


అప్పు: నిజం చెప్పు నువ్వు ఆటో నడిపిస్తున్నావా? లేక స్మగ్లింగ్‌ చేస్తున్నావా?


కళ్యాణ్‌: నన్ను అనుమానిస్తే నీ కళ్లు పోతాయి.


అప్పు: ఇంత డబ్బులు ఒకేసారి చూస్తే  అనుమానాలే వస్తాయి.


కళ్యాణ్‌: అవి నా కష్టార్జితం..


అప్పు: ఏంటి ఎవరైనా కోటీశ్వరుడు నీ ఆటో ఎక్కాడా? టిప్పుగా ఇంత డబ్బు ఇచ్చారా?


కళ్యాణ్‌: కోటీశ్వరుడు కాదు పొట్టి లిరిక్‌ రైటర్‌ లక్ష్మీ కాంత్‌ గారు నా ఆటో ఎక్కారు. ఆయనతో పాటు ప్రొడ్యూసర్‌ కూడా ఎక్కారు. ఏదో పాట కావాలని అడగ్గానే నేను ఆక్కడే పాట పాడాను. అందుకే  ఈ డబ్బులు ఇచ్చారు.


అని చెప్పగానే అప్పు ఏదేదో ఊహించుకుంటుంది. అప్పుడే అంత దూరం వెళ్లకు ఇంకా ఆయన నన్ను అసిస్టెంట్‌గా పెట్టుకోలేదు. ఆయన నన్ను ఆసిస్టెంట్‌ గా పెట్టుకున్నాక ఆటో నడిపేస్తానని చెప్తాడు కళ్యాణ్‌. మరోవైపు కావ్య దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది.


కావ్య: దుగ్గిరాల వారి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన  స్వరాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌లో సీఈవోగా అడుగుపెట్టే మొదటి  రోజు ఇది. ఒక సర్కస్‌ కంపెనీలో ఫీట్స్‌ చేయడానికి వెళ్తున్నట్టు ఉంది. అక్కడ పులిని నేనే కావాలి. బఫూన్‌ ను నేనే కావాలి. జంపింగ్‌ లు నేనే చేయాలి. పులి నోట్లో తల నేనే పెట్టాలి. కంపెనీ వైభవం కోల్పోకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరూ నామీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని నేను ఏ పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. నన్ను ఆశీర్వదించు స్వామి


 అని మొక్కి హల్లోకి వెళ్లి కృష్ణమూర్తిని ఆశీర్వదించమని అడుగుతుంది.


కనకం: నాకు పాదాలు ఉన్నాయి.


కావ్య: నువ్వు ఏమని దీవిస్తావో నాకు తెలుసు మిసెస్‌ క్యాన్సర్‌ కనకం.


కనకం: నేను దీవించిందే జరగాలని కోరుకుంటున్నాను మిసెస్‌ కావ్య దుగ్గిరాల.  


కావ్య: ఇందులో తమరి హస్తం కూడా ఉందని నాకు అర్థం అయింది. కానీ నీ పప్పులు ఉండకవు. నేను ఆఫీసుకు వెళ్తేది ఆయనతో కలిసిపోవాలని మళ్లీ ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టాలని ఆశతో కాదు. నీ మీద కంపెనీకి నష్టం జరిగింది. నా మీద నింద పడింది. వాటిని పూడ్చాలని వెళ్తున్నాను.


కనకం: విజయశాంతి.  


కావ్య: ఏంటి..?


కనకం: విజయము,  శాంతి రెండు కలగాలని అన్నానే


కావ్య: నాన్నా నేను వెళ్లి వస్తాను.


కనకం: నాకు చెవులు ఉన్నాయి.


కావ్య: అమ్మో ఆఫీసులో మొదటి రోజు అడుగుపెడుతున్నాను.


కనకం: అంటే..


కావ్య:  నువ్వు క్షేమంగా వెళ్లి లాభంగా రా అంటాడు. నాకు జరిగిన నష్టం ఈ జన్మలో లాభంగా మారదు.


    అని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. తర్వాత ఇందులో నీ హస్తం కూడా ఉందని అంటుంది కావ్య మళ్లీ ఏం రోగం తెచ్చుకున్నావే అని ప్రశ్నిస్తాడు మూర్తి. అయ్యోయ్యో ఏం లేదని అంటుంది కనకం. దీంతో ఏదైనా ఉంటే నీకు బొమ్మలా రంగేలేసి మార్కెట్‌ లో పెట్టి అమ్మేస్తాను అని తిడతాడు. ఆఫీసుకు వచ్చిన రాజ్‌ సీఈవో చాంబర్‌ లోకి వెళ్తుంటే శృతి వచ్చి ఆపుతుంది. ఈ రోజు నుంచి ఈ గది మీది కాదు సార్‌ అని చెప్తుంది. కంపెనీకి కొత్తగా లేడీ బాస్‌ వచ్చారని చెప్తుంది. కోపంతో లోపలికి వెళ్లిన రాజ్ కు సీఈవో సీట్లో కావ్య కనిపిస్తుంది.    


రాజ్‌: ఏయ్‌ నువ్వేంటి ఇక్కడ..?


కావ్య: ఇట్స్‌ మై క్యాబిన్‌


రాజ్‌: ఎంత ధైర్యం ఉంటే నా చైర్‌ లో కూర్చుంటావు.  నా పర్మిషన్‌ లేకుండా నా క్యాబిన్‌లో ఎలా అడుగుపెడతావు.


కావ్య: బాస్‌ క్యాబిన్‌ లోకి రావడానికి మే ఐ కమిన్‌ మేడం అని అడగాలి. తెలియదా? మిస్టర్‌ మేనేజర్‌.


రాజ్‌: మేనేజరా.. నన్నే లిమిట్స్‌ లో ఉండమంటావా? ఉండవే నిన్ను సెక్యూరిటీతో గెంటిస్తాను..


 అని బయటకు వెళ్లి సెక్యూరిటీని పిలచి ఎవరిబడితే వాళ్లను ఆఫీసులోకి రానిస్తావా? అంటూ కోప్పడగానే మేడం సీఈవో గారని అపాయింట్‌ లెటర్‌ లో రాశారు సార్‌ అని చెప్తాడు. కావ్య తన అపాయింట్‌ మెంట్‌ ఆర్డర్‌ ను రాజ్ కు ఇస్తుంది.  అది చదుకుకుని రాజ్‌ షాక్‌ అవుతారు. తాతయ్యగారే నన్ను సీఈవోగా అపాయింట్‌ చేశారు అంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!