Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌కి విరూపాక్షి హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. రూప, రాజు వాళ్లు చాలా సంతోషిస్తారు. సూర్యతో తన పెళ్లిని విరూపాక్షి గుర్తు చేసుకుంటుంది. ఏనాడో రాసుందేలో కనుకే నీ తోడయ్యాలే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే.. అంటూ బ్యాగ్‌ గ్రౌండ్ సాంగ్ అక్కడి పరిస్థితికి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక అందరూ సూర్య ప్రతాప్ గారు జై అంటూ ముందుకు సాగుతారు. మరోవైపు జీవన్ వాళ్లు వెళ్తారు. రాఘవని కనిపెడితేనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని విరూపాక్షి అంటే నేను కనిపెడతా మీరు టెన్షన్ పడొద్దని రాజు చెప్తాడు.


మరోవైపు హారతి దగ్గరు దీపక్ వెళ్తాడు. నువ్వు దూరం అయిపోతున్నావ్ అనే భయం ఉందని ఏడుస్తుంది. దానికి దీపక్ ఎమ్మెల్సీ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని నీకు నీ బిడ్డకు గోల్డెన్ లైఫ్ ఇస్తాను అంటాడు. ఇంతలో మందారం వచ్చి నా సంగతి  నా బిడ్డ సంగతి ఏంటి అని అడుగుతుంది. హారతి మందారాన్ని చూసి నువ్వేంటి మందారం అంటే ఇక్కడ హారతి ఇవ్వకముందే చిదిమేసిన మందారాన్ని అని పెళ్లి చేసుకోకముందే తల్లి అయినదాన్ని అంటుంది. నువ్వు ఎలా వచ్చావ్ మందారం అంటే రూప, రాజులు వచ్చి మేమే తీసుకొచ్చాం అని అంటుంది. దీపక్ షాక్ అయిపోతాడు. దీపక్ తనకు పుట్టిన బాబుకి తండ్రి అని మందారం హారతితో చెప్తే హారతి షాక్ అయిపోతుంది.


దీపక్ నిన్ను పెళ్లి చేసుకోడని రాజు అంటాడు. ముందే పెళ్లి అయిపోయిందని ఎందుకు చెప్పలేదని హారతి దీపక్‌ని చితక్కొడుతుంది. మందారం అడ్డుకొని దీపక్‌ని చితక్కొడుతుంది. ఇక చూస్తే మందారం కొట్టొద్దు కొట్టొద్దు అని దీపక్ అరుస్తాడు. అరుస్తూ బెడ్ మీద నుంచి లేస్తాడు. చూస్తే ఇదంతా దీపక్ కల. మందారం ఏమైందని అడుగుతుంది. నువ్వు నా రూంలో ఎందుకు ఉన్నావని మందారాన్ని అడిగితే నువ్వే కదా రమ్మన్నావు కదా దీపక్ బాబు అని మందారం వస్తుంది. ఇంతలో విజయాంబిక అక్కడికి వస్తుంది. దీపక్ తల్లితో తనకు వచ్చిక కల చెప్తాడు. దానికి విజయాంబిక నీ కలల వల్ల ఎవరికీ తెలియని నిజాలు కూడా తెలిసేలా ఉన్నాయని రూప ఈ విషయం ఎవరికీ చెప్పదని అంటుంది. 


ఎలక్షన్ పూర్తయిపోతుంది. జీవన్ గ్యాంగ్ అంతా ఓ చోట చేరుతారు. సూర్యప్రతాప్‌కే ఎక్కువ ఓట్లు వచ్చుంటాయని జీవన్ అంటాడు. సూర్యప్రతాప్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన గెలవడానికి అవకాశం ఇవ్వకూడదని అంటాడు. దానికి గౌతమ్ పోస్టల్‌ బ్యాలెట్లు దొంగిలించేద్దామని అనుకుంటారు. అందుకు గౌతమ్, రేణుక ఆ పని మీద వెళ్తారు. మరోవైపు రూప రాజు ఫొటో చూసి ఏం ఆలోచిస్తున్నావ్ రైస్ పీస్ అని అనుకుంటుంది. ఇక రాజు కూడా రూప ఫొటో చూస్తూ మాట్లాడుతాడు. ఇక రూప రాజుకి కాల్ చేస్తుంది. ఇంటికి ఎప్పుడు వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నాం అని రాజు రూపతో చెప్తాడు. ఇక రూప రాజుతో క్యాండిల్‌ లైట్ డిన్నర్ చేయాలని ఉందని చెప్తుంది. దానికి రాజు పది నిమిషాలు వెయిట్ చేయండని అంటాడు. నేను బయటకు రాలేను వద్దు అంటుంది. దాంతో రాజు మీరు బయటకు రావొద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత దారుణం జరిగిపోయింది.. ఇంటిళ్ల పాది ఏడుపులు.. బావే నా మొగుడంటోన్న జ్యోత్స్న!