Brahmamudi Serial Today Episode: కళ్యాణ్‌కు తెలియకుండా కళ్యాణ్‌ మీద డాక్యుమెంటరీ చేయాలని డైరెక్టర్‌ కు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అనామిక. దీంతో ఇప్పుడు డాక్యుమెంటరీ చేసి ఏం చేస్తావని సామంత్ అడిగితే ఆ డాక్యుమెంటరీతో దుగ్గిరాల కుటుంబం పరువు తీస్తానని చెప్తుంది అనామిక. దాని వల్ల మన కంపెనీకి ఏం లాభం అని అడుగుతాడు సామంత్‌. ఆ కుటంబం పరువు పోయాక..  స్వరాజ్‌ కంపెనీ క్రెడిట్‌ పడిపోతుందని అనామిక చెప్తుంది. మరోవైపు ఇందిరాదేవి, సీతారామయ్య దగ్గరకు వెళ్లి కావ్య కంపనీకి లాభం తీసుకొచ్చిన విషయం చెప్తుంది. మరోవైపు అందరూ హాల్‌ లో కూర్చుని ఉంటారు.


రుద్రాణి: ఏమిటీ ఈ అకాల సమావేశం


స్వప్న: నీకు పోయే కాలం వచ్చినట్టు ఉంది. ఇప్పుడు అమ్మమ్మగారు ఏదో చెప్పబోతున్నారు.


సుభాష్‌: ఏదీ అమ్మా..


అపర్ణ: వస్తున్నారండి.. అందరినీ పిలవమన్నారు.


ప్రకాష్‌: పిలవమన్న విషయం అమ్మ మర్చిపోయిందేమో…


ధాన్యలక్ష్మీ: ఈ ఇంట్లో మతిమరుపు ఉన్నది మీ ఒక్కరికే అన్న సంగతి మీరు మర్చిపోయినట్టు ఉన్నారు.


ప్రకాష్‌: గుర్తు చేయడానికే కదా నువ్వు ఉన్నది.


ఇంతలో ఇందిరాదేవి, సీతారామయ్య వస్తారు.


సుభాష్‌: ఏంటమ్మా ఏదైనా ముఖ్యమైన విషయమా..?


ఇందిర: అవునురా.. దీపావళి పండగ వస్తుంది కదా దాని గురించి


సీతారామయ్య: ఈ సారి పండగకి మన కంపెనీ వర్కర్స్ కు బోనస్‌ ఇవ్వాలి కదా..? ప్రతి సంవత్సరం మన గెస్ట్ హౌస్‌ లో ఇచ్చేవాళ్లం. ఈసారి చిన్న మార్పు.


రుద్రాణి: ఈ సంవత్సరం అన్ని నష్టాలే కదా..?


స్వప్న: ఆ నష్టాలన్నీ నీ కొడుకు వల్లే వచ్చాయి కదా..?


రుద్రాణి: నువ్వు ఆగు ఎవరైనా కంపెనీ లాభాల్లోనే బోనస్‌ లు ఇస్తారు.


సీతారామయ్య: కంపెనీ లాభనష్టాలు ఎప్పుడు ఆలోచించి కూడదు. అయినా బోనస్‌ లు ఇస్తేనే కంపెనీకి నష్టాలు వస్తాయని నువ్వెలా అనుకుంటావు.


అపర్ణ: లాభనష్టాల గురించి చింత నీకెందుకు రుద్రాణి


రుద్రాణి: అంటే తనకు మాలిన ధర్మం ఎందుకని


స్వప్న: అలా అయితే ఫస్ట్ మన ముగ్గరిని ఇంట్లోంచి గెట్‌ అవుట్‌ అనాలి.


ప్రకాష్‌: బాగా చెప్పావు స్వప్న.. నువ్వు సూపర్..


సుభాష్‌: బాగుంది నాన్నా.. కానీ ఈసారి చిన్న మార్పు అన్నారు అదేంటి..?


సీతారామయ్య: ఈసారి బోనస్‌ లు గెస్ట్‌ హౌస్‌ లో కాకుండా  ఇంట్లోనే ఇస్తున్నాను.


 అని చెప్పి ఈసారి నా చేతుల మీదుగా ఇప్పించడం లేదని సీఈవోగా ఉన్న కావ్య చేతుల మీదుగా ఇప్పించాలనుకుంటున్నాను అంటాడు. దీంతో సుభాష్‌, అపర్ణ, ప్రకాష్‌, స్వప్న హ్యాపీగా ఫీలవుతూ గుడ్‌ ఆలోచన అంటారు. రుద్రాణి, ధాన్యలక్ష్మీ మాత్రం బాగోదని చెప్తారు. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. ఇక పండగకి నేను నా కొడుకు కోడలిని ఇంటికి తీసుకొస్తానని ప్రకాష్‌ వెళ్లబోతుంటే.. ధాన్యలక్ష్మీ కూడా తాను వస్తానంటూ ప్రకాష్‌ తో కలిసి వెళ్తుంది. తర్వాత కావ్యను ఎవరు తీసుకురావాలని స్వప్న అడగ్గానే అత్తయ్య వెళ్లి తీసుకురావాలని అపర్ణ చెప్తుంది. కావ్యను తీసుకురావడానికి ఇందిరాదేవి వెళ్తుంది. కనకం ఇంటికి ఇందిరాదేవి వెళ్లగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు.


కావ్య: అమ్మమ్మా రండి అమ్మమ్మా..


ఇందిర: నేను కూడా నిన్ను పిలవడానికే వచ్చాను.


కావ్య: ఎక్కడికి అమ్మమ్మా..?


ఇందిర: మన ఇంటికి..


కావ్య: మన అని మీరు అంటున్నారు. మీ మనవడు కదా? అనాల్సింది.


కనకం: ముందు మీరు కూర్చోండి అమ్మా..


ఇందిర: పర్వాలేదులే కనకం..


మూర్తి: మీరు ఏదో శుభవార్త తెచ్చినట్టు ఉన్నారు.


ఇందిర: అవును మూర్తి. కావ్యను దీపావళి పండగకి రమ్మని చెప్పడానిక వచ్చాను.


కావ్య: నేనా.. నేను దీపావళి పండగకి వస్తే.. మీ మనవడి కళ్లల్లోనే టపాసులు పేలతాయి. అది మీకు బాగా తెలుసు.


ఇందిర: ఆ టపాసుల మీద నీళ్లు చల్లడానికి నేను రెడీగా ఉంటాను కదా..?


అంటూ ఇందిరాదేవి చెప్పగానే కావ్య మొదట ఒప్పుకోదు కానీ కనకం, ఇందిరాదేవి కన్వీన్స్‌ చేస్తారు. దీంతో కావ్య సరే వస్తానని చెప్తుంది. మరోవైపు ప్రకాష్‌, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి కళ్యాణ్‌ ఇంటికి వెళ్తారు. వాళ్లను చూసిన కళ్యాణ్‌, అప్పు షాక్‌ అవుతారు. కళ్యాణ్‌ ఎమోషనల్‌ గా ఫీలవుతూ.. ధాన్యలక్ష్మీని పలకరిస్తాడు. అప్పు కూడా ధాన్యలక్ష్మీని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.


ప్రకాష్‌: ఎలా ఉంది మన వాడి ప్యాలెస్‌


ధాన్యలక్ష్మీ: అవుట్‌ హౌసా ఇది మీరు ఉండే ఇల్లు ఎక్కడరా..?


కళ్యాణ్‌: ఈ గదే అమ్మా మేము ఉండే అవుట్‌ హౌస్‌, అసలు హౌస్‌.


ధాన్యలక్ష్మీ: ఏంటి మన ఇంట్లో పని చేసే డ్రైవర్లకు కూడా ఇంత కన్నా పెద్ద క్వార్టర్స్‌ ఇస్తాము కదరా..?


అప్పు: డ్రైవర్లకే క్వార్టర్స్‌ ఇస్తామంటుంది. ఈమె కొడుకు ఓ ఆటో డ్రైవర్‌ అని తెలిస్తే ఇంకెంత షాక్‌ అవుతుందో..( అరి మనసులో అనుకుంటుంది)


ధాన్యలక్ష్మీ: ఏంట్రా నీకీ ఖర్మా.. చూస్తుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను.


అని ధాన్యలక్ష్మీ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో కళ్యాణ్‌ నన్ను నేను ఫ్రూవ్‌ చేసుకోవడానికి నేను కష్టపడుతున్నాము అమ్మా.. అంటాడు కళ్యాణ్‌. ఇంతలో ప్రకాష్‌ ఇవన్నీ ఉండని కానీ ఇప్పుడు నీకో శుభవార్త తీసుకొచ్చామని దీపావళి పండగకి నిన్ను అప్పును ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాం అని చెప్తాడు. సరే ఆలోచిస్తానని కళ్యాణ్‌ చెప్పగానే ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!