Brahmamudi Serial Today Episode:  ఏమిరోయ్‌ అంత స్టైలిష్‌గా తయారయ్యావు అని ప్రకాష్‌, రాజ్‌ను అడుగుతాడు. ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్తాడు. అపర్ణను దీవించమని అడిగితే పిల్లా పాపలతో చల్లగా ఉండు నాన్నా అని ఆశీర్వదిస్తుంది. రాజ్‌ కోపంగా నీ దీవెనలు ప్రిజ్ లో పెట్టు అని చెప్తాడు. ఇక్కడ ఇంతకు మించి రావు అక్కడేమైనా ట్రై చేయ్‌ అని ఇందిరాదేవిని చూపిస్తుంది. నాన్నమ్మ బ్లెస్‌ మీ అని వెళ్లగానే సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తుంది.


రాజ్‌: అసలు నేను వెళ్తున్న పనేంటి మీరు దీవిస్తున్న దీవేనలు ఏంటి..? అసలు నేను గెలుస్తున్నాను. కళావతి ఓడిపోతుంది. ఇంకెప్పటికీ ఇంటికి రాదు.


ఇందిర: ఏరా కడుపు అన్నం తినే వారెవరైనా మొగెడు పెళ్లాం విడిపోవాలని కోరుకుంటారా..?


స్వప్న: అయితే మా అత్త అన్నం తిడదా..? బామ్మ..


రుద్రాణి: జస్ట్‌ షడప్‌ నన్నెందుకు లాగుతావు.


రాహుల్‌: చాలా ఓవర్‌ గా మాట్లాడుతున్నావు స్వప్న.


స్వప్న: ఓ మీరు తల్లీ కొడుకులు ఏదైనా షేర్‌ చేసుకుంటారు కదా..? మర్చిపోయాను సారీ రాహుల్‌.


రాజ్‌: డాడీ మీరు పుత్రోత్సాహంతో పొంగిపోయే తరుణం ఆసన్నమైంది.


సుభాష్‌: నిజమా నాన్నా..


రాజ్‌: ఎస్‌ డాడ్‌


సుభాష్‌: ఏ తండ్రికైనా కొడుకు కాపురం చేసుకుంటూ మనవడినో మనవరాళినో ఇస్తే సంతోషంగా ఉంటుంది.


రాజ్‌: డాడీ మీరు జనరేషన్‌ పంచడం గురించి మాట్లాడుతున్నారు. నేను పందెంలో గెలవడం గురించి మాట్లాడుతున్నాను. నన్న దీవించండి.


అనగానే అయితే ఇద్దరికీ ఆల్‌ ది బెస్ట్‌ అని సుభాష్‌ చెప్తాడు. దీంతో రాజ్‌ తాతయ్య అయితే బాగా ఆశీర్వదిస్తాడు. అంటూ సీతారామయ్య దగ్గరకు వెళ్తే.. ఆయన కూడా పుత్రపౌత్రాభిరస్తు అంటాడు. దీంతో రాజ్ ఇరిటేటింగ్‌ గా నేను గెలిస్తే మాత్రం ఆ కళావతిని ఎప్పటికీ ఆఫీసుకు రానివ్వను ఇంట్లోకి రావ్వకూడదు అని చెప్తాడు. ఇంతలో రుద్రాణి వచ్చి ఆల్‌ ది బెస్ట్‌ చెప్తుంటే స్వప్న తుమ్ముతుంది. తర్వాత నేను గెలిచి తిరిగి వస్తాను. ఇంట్లోనే నేను నా టీమ్‌ కు గ్రాండ్‌ పార్టీ ఇస్తాను అని చెప్తాడు. మరోవైపు కావ్యను ఆటో డ్రైవర్‌ మెల్లగా తీసుకుని పోతుంటే కావ్య స్పీడుగా వెళ్లమని చెప్తుంది. డ్రైవర్‌ మాత్రం త్వరగా తీసుకెళ్తే ఆ రాజ్‌ సార్‌ నన్ను చంపేస్తాను అనుకుంటాడు. మరోవైపు ఆఫీసులో జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ వచ్చి ఉంటాడు.


జగదీష్‌: మన మీటింగ్‌ పది గంటలకు అనుకున్నం కదా..? కావ్య గారు ఇంకా రాలేందేంటి…


రాజ్: తన తరుపున నేను సారీ చెప్తున్నాను సార్‌


జగదీష్‌: ఇట్స్‌ ఓకే మేబీ ఈ ట్రాఫిక్‌ జామ్‌ లో లేట్‌ అయిందనుకంటాను. వెయిట్‌ చేద్దాం.


రాజ్‌: లేడిస్‌ సంగతి తెలిసిందే కదా సార్‌.  లేవటం ఆలస్యంగా లేస్తారు. రెడీ అవ్వడానికి మేకస్‌ వేసుకోవడానికి అంటూ చాలా టైం వేస్ట్‌ అయిపోతుంది.


శృతి: అవకాశం దొరికిందని అల్లుకుపోతున్నాడు గురుడు. ఈనేమో ఈగోకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ( అని మనసులో అనుకుంటుంది.)


రాజ్‌: వినబడింది ( మనసులో అనుకుని) శృతి మీ మేడంకు ఫోన్‌ చేసి ఎక్కడుందో కనుక్కో..


   అలాగే అని శృతి బయటకు వెళ్లి ఫోన్‌ చేస్తుంది. దారిలోనే ఉన్నానని చెప్తుంది. ఇంతలో ఆటోకు బైక్ వచ్చి గుద్దుతుంది. చిన్న గొడవ జరగుతుది. మరోవైపు రాజ్‌ తన డిజైన్స్‌ జగదీష్‌ చంద్ర ప్రసాద్‌కు చూపిస్తుంటాడు. ఆ డిజైన్స్‌ చూసి శృతి షాక్‌ అవుతుంది. ఇవి కావ్య మేడం వేసిన డిజైన్స్‌ కదా సార్‌ దగ్గరకు ఎలా వచ్చాయి అనుకుంటుంది. ఇంతలో కావ్య వస్తుంది. ఆ డిజైన్స్‌ చూసి కావ్య కూడా షాక్‌ అవుతుంది.


శృతి: మేడం అవి మీరు వేసిన డిజైన్స్‌ కదా..?


కావ్య: అది నాకు కూడా అర్థం అవుతుంది. క్లయింట్‌ ముందు ఏమీ మాట్లాడకు. దాని వల్ల కంపెనీకి బ్యాడ్‌ నేమ్‌ వస్తుంది.


శృతి: కానీ మీరు పడిన కష్టం..


రాజ్‌: ఏయ్‌ శృతి ప్రజెంటేషన్‌ జరుగుతుంటే ఏంటి..? సార్‌ భక్తి శ్రద్దలతో వేసినవే ఈ డిజైన్స్‌ సార్‌.


అని చెప్పగానే జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ డిజైన్స్‌ బాగున్నాయని మెచ్చుకుంటారు. కావ్యను డిజైన్స్‌ చూపించమని అడుగుతాడు. తన డిజైన్స్‌ ఇంకా పూర్తి కాలేదని చెప్తుంది. నిజం చెప్పాలంటే ఈ డిజైన్స్‌ చాలా బాగున్నాయని మీకు కావాలంటే ఇవే తీసుకోండని చెప్తుంది. దీంతో జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ కాంట్రాక్ట్‌ మీకే ఇస్తున్నాను అని చెప్తాడు. దీంతో   ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.



Also Read: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!