Brahmamudi Serial Today Episode: రాజ్, రాహులకు అఫీసు బాధ్యతలు అప్పగిస్తాడు. అందుకు సంబంధించిన జాయినింగ్ లెటర్ ను రాహుల్ కావ్య తీసుకొచ్చి ఇస్తుంది. లెటర్ తీసుకుంటారు రాహుల్.
రాహుల్: ఏంటి రాజ్ ఇది
రాజ్: ఓపెన్ చేసి చూడు
రాహుల్: జాయినింగ్ లెటరా..?
రాజ్: అవును నువ్వు రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లు.. ఇది నీ జాయినింగ్ లెటర్.. నేను ఆఫీసుకు రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు కంపెనీ వ్యవహారాలన్నీ నీకు అప్పగిస్తున్నాను. అన్ని పనులు నువ్వే చూసుకోవాలి
రుద్రాణి: ( మనసులో) నా కొడుకు మొత్తానికి సాధించాడు
రాజ్: కంపెనీ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను రాహుల్ రేపే జాయిన్ అవ్వు..
రాహుల్: వద్దు రాజ్ నాకు ఇంత పెద్ద బాధ్యతలు వద్దు
కావ్య: ఏం రాహుల్ ఎందుకు వద్దంటున్నావు..?
రాహుల్: 20 లక్షల బాధ్యత అప్పగిస్తేనే ఫెయిల్ అయిపోయిన వాడిని ఇప్పుడు అంత పెద్ద బాధ్యత నాపై పెడితే ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోరు.. వీళ్లందరికీ ఇష్టం లేకుండా నేను ఆఫీసుకు వెళ్లలేను రాజ్
కావ్య: రాహుల్ 20 లక్షల విషయంలో నువ్వు ఫెయిల్ అవ్వలేదు రాహుల్.. నీ నిజాయితీని నిరూపించుకున్నావు.. ఆ నిజాయితీ గుర్తించబడింది కాబట్టే నీకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది.
రాజ్: నీకు ఇంకో అవకాశం ఇవ్వాలని కళావతి చెప్పింది.. నాకు నీ మీద కన్నా కళావతి మీద నమ్మకం ఎక్కువ కాబట్టి తన నమ్మకాన్ని నిలబెడతావని నమ్ముతున్నాను..
రాహుల్: తప్పకుండా రాజ్ ఇదే మీరు నాకిచ్చే చివరి అవకాశం మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వను.. రాత్రింబవళ్లు కష్టపడైనా మీ నమ్మకాన్ని నిలబెడతాను
అంటూ చెప్పగానే.. ధాన్యలక్ష్మీ చూశావా రుద్రాణి ఇప్పుడు మేము రాజ్ నిర్ణయాన్ని ఎవ్వరం అడ్డుకోవడం లేదు.. ఇప్పుడేమంటావు అని అడుగుతుంది. రుద్రాణి సైలెంట్‌గా ఉంటుంది. తర్వాత రూంలో రాహుల్ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి.
రుద్రాణి: ఇది నేను అసలు నమ్మలేకపోతున్నానురా..? రాజ్ ఇంత త్వరగా నిన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తాడని అసలు నమ్మలేదు
రాహుల్: ఇప్పుడు కూడా రాజ్ నన్ను పూర్తిగా నమ్మలేదు మామ్. స్వప్న కోసమే కావ్య ఇదంతా చేసింది
రుద్రాణి: ఆ కావ్య మరీ ఇంత పిచ్చిదా… స్వప్న కళ్లల్లో వచ్చిన నాలుగు కన్నీటి చుక్కలకే ఇంత కరిగిపోతుందా..?
రాహుల్: మన శత్రువు అయినా సరే కావ్య గొప్పదనాన్ని మెచ్చుకోక తప్పదు మమ్మీ.. ఇన్ని మోసాలు చేసినా మళ్లీ అక్క జీవితాన్ని నిలబెట్టడానికి రిస్క్ తీసుకుంది చూడు నిజంగా తను గ్రేట్
రుద్రాణి: ఇవన్నీ తర్వాత ముందు అంది వచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించుకో..
రాహుల్: ఇందులో ఆలోచించడానికి ఏముంది మమ్మీ రేపే ఆ కంపెనీ బాధ్యతలు తీసుకుంటాను. రాజ్ స్థానంలో వెళ్లి కూర్చుంటాను..
రుద్రాణి: రాజ్ స్థానంలో కూర్చోవడం కాదు నిన్ను ఎలాగైతే కంపెనీ నుంచి తరిమేశారో నువ్వు అలాగే చేయాలి
రాహుల్: నేను మునుపటి రాహుల్ కాదు మమ్మీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తాన్ని నా గుప్పిట్లోకి తెచ్చుకుంటాను
అని రాహుల్ చెప్పగానే రుద్రాణి హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత రాజ్, కావ్య కలిసి అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు రాహుల్ ఆఫీసుకు రావడంతో శృతి భయపడుతుంది. వీడేంటి మళ్లీ వచ్చాడు అని బాధపడుతుంది. ఇక సుభాష్, అపర్ణల కోసం కావ్య డ్రెస్ లు బుక్ చేస్తుంది. అవి ఇంటికి రావడంతో అందరికీ విషయం తెలిసిపోతుంది. దీంతో అందరూ కలిసి అపర్ణ, సుభాష్‌ల పెళ్లి చూపుల తతంగం నిర్వహించాలని డిసైడ్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!