Brahmamudi Serial Today Episode: రాజు చెప్పినట్టు గుడిలోకి వెళ్లి ఇందును చూస్తుంది రేఖ. వెంటనే భూషణ్‌కు కాల్ చేసి ఇందు దొరికిందని డబ్బులు ఇవ్వమని చెప్తుంది. భూషణ్ సరే అంటూ లక్కీకి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతాడు. రేఖ ఇందును తీసుకుని వెళ్లిపోతుంది. వెళ్లిపోతూ ఇందు రాజును అదో రకంగా చూస్తుంది. రాజు ఇందును చూస్తూ.. బాధపడుతుంటాడు. అప్పుడే డబ్బులు తీసుకుని లక్కీ వస్తాడు.
లక్కీ: డబ్బులు అందాయిరా.. ఏంట్రా అంతలా ఫీలవుతున్నావు..? ఇందాక కూడా ఏదో తెగ ఫీలవుతున్నానని చెప్పావు. ఇప్పుడు ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు..? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా..? అందుకే అంతలా ఫీలవుతున్నావా..?
Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: కొడైకెనాల్ వెళ్లిన అమర్ - నిజం తెలుసుకున్న నారదుడు
రాజు: ఓరేయ్ పిచ్చోడా… ప్రేమా తొక్కా..? మనకి డబ్బులే ముఖ్యంరా.. అవి వచ్చేయిగా ఇలా ఇవ్వు
లక్కీ: మరి ఎందుకు అంతలా ఫీలవుతున్నావు
రాజు: రేయ్ ఫీల్ లేదు ఏం లేదు..
లక్కీ: సరేలే మన వాటా పది.. నా ఫిగర్ వాటా పది ఇచ్చేయ్
రాజు డబ్బులు లెక్క పెడుతూ.. ఇందును గుర్తు చేసుకుంటూ లెక్కపెట్టడం ఆపేస్తాడు.
లక్కీ: ఒరేయ్ మామ డబ్బులు అందాయి కదరా..? అయినా కూడా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు
రాజు: ఇందు కారెక్కుతూ కూడా నా వైపు ఒక లుక్కు ఇచ్చిందిరా.. తను అలా దూరంగా వెళ్తున్నా కూడా నావైపే చూస్తుంది. ఆ కళ్లల్లో ఏదో కాంతి కనిపించింది. తన కళ్లల్లో ఏవో చక్రాలు తిరుగుతున్నట్టు అనిపించిందిరా దాని అర్థం ఏంటో అర్థం కాలేదురా..?
Also Read: నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!
లక్కీ: నేను కూడా చూశాను మామ నాకు ఒకటి అర్థం అయింది
రాజు: ఏంటి ఏం చూశావు.. ఏం అర్థం అయింది
లక్కీ: రాత్రి మిగిలిపోయిన కూరలు ఫ్రిజ్‌లో ఉన్నాయని అవి మర్చిపోకుండా తినండని తన కళ్లతో చెప్తుంది. ఏం కాదంటావా..?
రాజు: నీ దగ్గర నుంచి ఇంతకన్న ఎక్కువ ఎక్స్‌ఫెక్ట్ చేయలేనురా.. రేయ్ ఆ డబ్బు ఆ సాహు గాడికి ఇచ్చేయ్
లక్కీ: ఏం నువ్వు రావా..?
రాజు: నేను తర్వాత వస్తాను నవ్వు వెళ్లి ఆ సాహు గాడికి డబ్బు ఇచ్చేయ్ నా ఫ్యామిలీ సేఫ్‌గా ఉంటుంది
అని చెప్పగానే.. లక్కీ వెళ్లిపోతాడు. మరోవైపు ఇందును ఇంట్లోకి తీసుకెళ్లిన రేఖ కోపంగా ఇందును హాల్లో తోసేస్తుంది. అపర్ణ చూసి హ్యాపీగా ఫీలవుతూనే.. కోపంగా రేఖను చూస్తుంది.
Also Read: ఆఫీస్‌లో పీరియడ్స్ సడెన్‌గా వస్తే? ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
అపర్ణ: ఏయ్ నీకు బుద్దుందా ఎందుకు అలా తోసేస్తున్నావు.. ఏదైనా గాయం అయితే
రేఖ: నాకు అయినా గాయం కన్నా పెద్దది కాదులే నీ మనవరాలు కిడ్నాప్ అయిందని మీడియాకు చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నావు కదా..? ఇప్పుడు చూడు నేనే నీ మనవరాలిని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చాను
భ్రమరాంబ: వాళ్ల ముఖాలు చూస్తే తెలుస్తుంది కదా రేఖ వాళ్లు ఎంత సంతోషంగా ఉన్నారో
శేషు: అవును అవును వాళ్ల కన్నా ఎక్కువ మనమే సంతోషంగా ఉన్నామని మన ముఖాలు కూడా చెప్తున్నాయి
ఐశ్వర్య: ఇందు ఇంటికి వచ్చింది నా ప్లాన్ సక్సెస్ అయింది.
భూషణ్: ఈ కిడ్నాప్ ఏంటో కానీ కిడ్నాపర్ కు ఇచ్చే డబ్బుల కోసం మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ప్రతి ఒక్కరి చేత మాటలు పడాల్సి వచ్చింది
భ్రమరాంబ: నా బంగారం మొత్తం లాగేసుకున్నాడు ఆ చక్రిగాడు.. ఇదంతా నీవల్లే కాస్త జాగ్రత్తగా ఉండి ఉటే.. మనకి ఈ బాధలు వచ్చేవి కాదు కదా అందరి ముందు గంభీరంగా తల ఎత్తుకుని బతికే మా రేఖ నీకోసం అందరి ముందు తల దించుకుని బతకాల్సి వచ్చింది
అని తిట్టగానే.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇందు కిడ్నాప్ జరిగిన విషయం మొత్తం అపర్ణ, సుభాష్‌కు చెప్తుంది. ఇక రాజు ఎవరికోసమో హాస్పిటల్ లో బిల్లు కడుతుంటాడు. ఎలాగైనా సరే వాళ్లను బతికించమని డాక్టర్‌తో మాట్లాడుతుంటే.. శృతి రాజును చూసి ఫాలో అవుతుంది. చలపతి, లక్ష్మీని కలిసి రాజు దుగ్గిరాల వారసుడని నిజం చెప్తుంది. దీంతో చలపతి, లక్ష్మీ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
