Nindu Noorella Saavasam Serial Today Episode: అరుంధతి మర్డర్‌ కేసులో మిస్టరీ తెలుసుకునేందు అమర్‌ మరోసారి కొడైకెనాల్‌ వెళ్తాడు. అక్కడ తాము ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లి బయటి నుంచే ఇంటిని చూస్తూ.. ఆరును గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంటాడు. అప్పుడే అక్కడికి గుప్త వస్తాడు. అమర్‌ ను చూసి షాక్‌ అవుతాడు.  

గుప్త: అమరేంద్రుడు తన పూర్వపు నివాసమునకు వచ్చెను. పాపం అరుంధతి బాలికకు సంబంధించిన గత స్మృతులు అతన్ని వెంటాడుచున్నట్టు ఉన్నవి. అమరేంద్రకు అరుంధతి బాలిక లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. (అప్పుడే అక్కడికి నారదుడు వస్తాడు. నారదుడిని చూసిన గుప్త షాక్‌ అవుతాడు.) ఈ సమయమున నారద మహర్షి వచ్చుచుండెను ఏమిటి..? ( నారదుడు దగ్గరకు వస్తాడు.) నారద మహర్షులకు ప్రణామములు

నారదుడు: ప్రణామములు విచిత్రగుప్త అంతా కుశలమేనా

గుప్త: ( మనసులో) తమరు వచ్చినాక ఎవరు కుశలముగా ఉండెదరు..?

Also Read:నిండు మనసులు: వ్రతం బట్టలు చింపిందెవరు? అదిరిపోయిన మామకోడళ్ల కామెడీ!

నారదుడు: ఏమిటి గుప్త నీలో నీవే ఏమో సంభాషించుకుంటివి

గుప్త: ఏమీ లేదు మహర్షి తమరుండగా మా సుఖసంతోషములకు కొరత ఏమి ఉండును అని అనబోతుంటిని తమరు అడ్డు పడుచుంటిరి

నారదుడు: అవును నీవు ఈ మధ్య తరచుగా అ భూలోకమందే సంచరించుచుంటివి ఏమైనా కార్యము ఉన్నదా

గుప్త: ( మనసులో వచ్చిన వెంటనే ఆరాలు మొదలు పెట్టితిరా) ఏ కార్యము లేదు మహర్షి ఆ బాలకుణ్ని చూచుటకు వచ్చితిని

నారదుడు: ఆ బాలకుడు ఏదో కార్యార్థమై ఇక్కడకు వచ్చినట్టు ఉన్నాడు.

Also Read: ఆఫీస్‌లో పీరియడ్స్ సడెన్‌గా వస్తే? ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

గుప్త: త్రిలోకా సంచారులు తమకు తెలియని విషయమా స్వామి

నారదుడు: తన ధర్మపత్ని మరణ రహస్యం కనుగొనుటకై వచ్చునని మాకు అనిపించుచున్నది

గుప్త: ప్రతి సంవత్సరం అది కనుగొనుటకే వచ్చుచున్నాడు. ఈ సంవత్సరం అయిననూ నిజం తెలియునా స్వామి

నారదుడు: మమ్ములను అడుగుతావేంటి..? విచిత్రగుప్త అక్కడకేదో నీకేమీ తెలియనట్టు

గుప్త: మాకు కొంతనే తెలియును కదా స్వామి తమకైతే సర్వము తెలియును కదా

నారదుడు: విధాత తలపు ఎట్లుండునో ఎవ్వరమూ గ్రహించలేము విచిత్రగుప్త వేచి చూడుము ఏమి జరుగునో

అమర్‌ ఇంటి ముందు నిలబడి చూస్తూ.. తర్వాత అక్కడి నుంచి ఆరు చనిపోయిన ప్లేస్‌ దగ్గరకు వెళ్తాడు. అమర్‌ వెనకాలే మనోహరి కారులో వెళ్తుంది. మనోహరిని చూసిన గుప్త షాక్‌ అవుతాడు.

Also Read: పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే

గుప్త: మహర్షి ఆ దుష్ట బాలిక కూడా వచ్చిందేమిటి

నారదుడు: ఆ దుష్ట బాలిక గురించే తెలుసుకొనుటకే కదా అతను వచ్చినది..

గుప్త: ఈ బాలిక ప్రతిసారి తప్పించుకొనుచున్నది మహర్షి

నారదుడు: ఈ సారి విధి మరోలా సంకల్పించినది

గుప్త: అనిన అమరేంద్రకు నిజం తెలియునా మహర్షి

నారదుడు: తెలియును కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి

గుప్త: ఆ సంఘటనలు ఏమీ స్వామి

 నారదుడు: నన్నడుగుట ఏలా నువ్వే వీక్షించుము

అంటూ అమర్‌ దగ్గరకు వెళ్తారు. అమర్‌, అరుందతి చనిపోయిన ప్లేస్‌ దగ్గర కారు ఆపి దిగి చూస్తుంటాడు.

మనోహరి: ఇల్లు తర్వాత నువ్వు ఇక్కడికే వస్తావని నాకు తెలుసు అమర్‌. నీకోసం అరుంధతిని చంపించింది. నేను గెలిచింది ఇక్కడే..

అమర్‌: నా సగం ఊపిరిని ఇక్కడే పోగొట్టుకున్నాను. నువ్వు నాకు దూరం అయింది ఇక్కడే ఆరు. నీ శ్వాస ఈ గాలిలో కలిపిసోయింది. నా జీవితం అంతా వెతికిన అప్పుడు పోగొట్టుకున్న నీ శ్వాసను ఎప్పటికీ  దక్కించుకోలేను. నువ్వు మిగిల్చన జ్ఞాపకాలు. పిల్లలు తొడుగా లేకపోతే నేను కూడా ఈ గాలిలో కలిసిపోయేవాడిని..

అని ఏడుస్తూ.. అమర్‌ ఏమోషనల్‌ అవుతుంటాడు. మనోహరి, నారదుడు, గుప్త ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.