Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంటి దగ్గర రాజ్ కోసం వెయిట్ చేస్తున్న అప్పు చాలా కంగారుపడుతుంది. ఇంతలో రాజ్ వస్తాడు. రాజ్ ను చూసిన అప్పు కావ్యను కిడ్నాప్ చేసిన విషయం చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఎక్కడ కిడ్నాప్ చేశారని అడుగుతాడు. మల్కాజ్ గిరిలో చేశారని అప్పు చెప్పడంతో రాజ్, అప్పు అక్కడికి బయల్దేరుతారు. మరోవైపు కిడ్నాప్ అయిన అమ్మాయిలు అందరూ ఏడుస్తుంటారు. కావ్య అందరిని తిట్టి ఎందుకు ఏడుస్తున్నారని ఏడిస్తే బయటపడిపోతామా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఆ అమ్మాయిలు ఇక్కడికి అమ్మాయిలు రావడమే తప్పా బయట పడటం లేదని ఏడుస్తూ చెప్తారు. మనల్ని తీసుకెళ్లి దుబాయ్‌లో అమ్మేస్తారట అని చెప్పగానే కావ్య షాక్ అవుతుంది. అరగంటలో బయటపడటమే కాకుండా వీళ్లందరినీ తీసుకెళ్లాలని అనుకుంటుంది కావ్య. మరోవైపు రాజ్ పోలీసులకు ఫోన్ చేసి కావ్య కిడ్నాప్ గురించి చెప్తాడు.
రాజ్: సార్ మీరే ఎలాగైనా పట్టుకోవాలి సార్ ఆ కారు డీటెయిల్స్ మీకు సెండ్ చేశాను.
పోలీస్: సార్ ఆల్ రెడీ ట్రాఫిక్ వాళ్లకు చెప్పాను. కానీ ఆ కారు మల్కాజ్‌గిరి మెయిన్ రోడ్డు మీదకు రాలేదంట. తప్పకుండా అక్కడే ఎక్కడో బస్తీలో పెట్టి ఉంటారు.
రాజ్: అక్కడ వెతికితే సరిపోతుంది కదా?
పోలీస్: మేము మా టీంను ఆల్ రెడీ అక్కడికి పంపించాము. కానీ మీరు పెట్టిన కారు నెంబర్ తో పట్టుకోవడం కష్టం.
అనగానే రాజ్ మీరెలాగైనా పట్టుకోవాలని చెప్తాడు. పోలీస్ సరే అంటాడు. తర్వాత అప్పు అక్కకు ఏం కాదని అనడంతో రాజ్ కోపంగా తిడతాడు. మరోవైపు రౌడీలు అమ్మాయిలను తీసుకెళ్లడానికి వ్యాన్ వస్తుందని మాట్లాడుకోవడం కావ్య విని మిగతా అమ్మాయిలకు ఏదో చెప్తుంది. మరోవైపు పోలీసు రాజ్‌కు ఫోన్ చేసి ఆ కారు జాడ తెలిసిందని.. కిడ్నాప్ చేసింది జేమ్స్ బ్యాచ్ అని వాళ్లను పట్టుకోవడానికి బెస్ట్ టీం రంగంలోకి దిగిందని చెప్తాడు. దీంతో అప్పు, రాజ్ కూడా మల్కాజ్‌గిరి బస్తీలో వెతకడానికి వెళ్తారు. మరోవైపు అమ్మాయిలకు కాపలా ఉన్న రౌడీకి తెలియకుండా వాడి ఫోన్ నుంచి కావ్య రాజ్‌కు లోకేషన్ షేర్ చేసి మెస్సెజ్ పెడుతుంది. దీంతో రాజ్, అప్పు ఆ లోకేషన్ వెళ్తుంటారు. కావ్య మెసేజ్ పెట్టిన విషయం రౌడీ గమనించి వాళ్ల బాస్‌కు చెప్తాడు. వెంటనే వాళ్లకు చేతులు కట్టేసి.. ప్లాస్టర్ వేయమని చెప్తాడు. ఇంతలో రాజ్, అప్పు రౌడీలు ఉన్న దగ్గరకు వస్తారు.
రౌడీ బాస్: ఎవరు కావాలి?
రాజ్: ఎవరో కావాలి?
రౌడీ: ఇక్కడికి మీరెందుకు వచ్చారు.
రాజ్: ఇక్కడ యాంటి సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియానా? ఎందుకు అంతలా ఆరా తీసుస్తున్నావు.
రౌడీ: హలో నువ్వు వచ్చింది నా ప్లేస్‌కు ఇది ప్రై వేట్ ప్రాపర్టీ.. మాకు చాలా పనులున్నాయి. వెళ్లండి.
రాజ్: మేము కూడా ఒక పని మీద వచ్చాము అది పూర్తి కాగానే వెళ్లిపోతాము.
అని రాజ్ అటూ ఇటూ తిరిగి చూస్తాడు. లోపలి నుంచి రాజ్‌ను చూసిన కావ్య అరవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో రౌడీ చూసింది చాలు ఇక బయలుదేరండి అనగానే అప్పు వాడి మీద కోప్పడుతుంది. ఇంతలో రాజ్, అప్పు వెళ్లిపోయినట్లు నటిస్తారు. వాళ్లు వెళ్లిపోయారనుకుని లోపల నుంచి కావ్యను, మిగతా అమ్మాయిలను రౌడీలు వ్యాన్‌లో తీసుకుని వెళ్లిపోతుంటే రాజ్, అప్పు పోలీసులతో వచ్చి కిడ్నాపర్లను పట్టుకుని కావ్యను మిగతా అమ్మాయిలను కాపాడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.