Brahmamudi Serial Today Episode: గార్డెన్‌లో ఒంటరిగా కూర్చున్న సుభాష్‌ ఏదో ఒకటి చేసి ఈ సమస్యకు పరిష్కరించాలని అపర్ణకు నిజం చెప్పాలని డిసైడ్‌ అవుతాడు. అపర్ణ కాళ్లు పట్టుకునైనా క్షమించమని అడుగుతానని అనుకుంటాడు. మరోవైపు రుద్రాణి, రాహుల్‌ ఎలాగైనా అపర్ణను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపాలని.. రాజ్‌ను వెళ్లగొట్టేలా చేయాలని ప్లాన్‌ చేస్తుంటుది. మరోవైపు అపర్ణ బ్యాగు సర్దుకుని వెళ్లిపోవడానికి హాల్లో రెడీగా ఉంటుంది. అందరూ అడిగినా అపర్ణ తన నిర్ణయం మారదని చెప్తుంది. ఇంతలో రాజ్‌ బిడ్డతో బ్యాగ్‌ వేసుకుని వెళ్లిపోవడానికి కిందకు వస్తాడు.


రుద్రాణి: ఏంట్రా మీ అత్త వెళ్లిపోతుంది అనుకుంటే వీడే వెళ్లిపోతున్నాడేంట్రా?


రాహుల్‌: దేవుడు మంచివాళ్లకే కాదు అప్పుడప్పుడు మనలాంటి వాళ్లకు కూడా పొరపాటున సాయం చేస్తుంటాడు మమ్మీ.


రాజ్‌: మమ్మీ నామూలంగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి పోయి మాటపడటం పేరు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే వెళ్లిపోతున్నాను.


అపర్ణ: అదే నీ నిర్ణయమా?


రాజ్‌: అవును.


అపర్ణ: అర్థమైందిరా ఆ రహస్యం నీ ప్రాణం పోయినా బయటపెట్టవని అర్థమైంది. నిన్ను ఇంట్లోంచి పంపించేస్తానని చెప్తే అప్పుడైనా నిజం చెప్తావని అన్నాను. ఇప్పుడు నిన్ను పంపిస్తానంటే ఈ ఇల్లు రచ్చబండ అవుతుంది. నేనొక్కదాన్నే దోషిని అవుతాను. అందుకే నేనే వెళ్లిపోతాను.


 అంటూ అపర్ణ వెళ్లబోతుంటే.. రాజ్‌ అపుతాడు. దీంతో నాకు నిజం కావాలని లేకుంటే నేను వెళ్లిపోవాల్సిందే.. అంటూ కరాకండిగా చెప్పి వెళ్లబోతుంటే..


సుభాష్‌: ఒక్క నిమిషం అపర్ణ.. నువ్వు వెళ్లిపోయే ముందు నీకు నిజానిజాలు తెలియాలి. రాజ్‌ తప్పు చేశాడని మాత్రమే తెలుసు కానీ వాడు ఎందుకు నిజాలు దాస్తున్నాడో ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా?


అపర్ణ: ఆ నిజం మీకు తెలుసా? ఆ కారణం మీకు తెలుసా? ఆ బిడ్డ తల్లి ఎవరో మీకు తెలుసా?


సుభాష్‌: అసలు ఇవాళ్టీతో ఈ రహస్యం బద్దలైపోవాలి. రాజ్‌ ఎలాంటివాడో మీరందరూ తెలుసుకోవాలి. అసలు రాజ్‌ ..


కావ్య: మామయ్య గారు మీరు ఆగండి. మామయ్య గారు నేను అడగాల్సినవి చాలా ఉన్నాయి. మీ అబ్బాయిని అడగాలి మా అత్తగారిని అడగాలి.


సుభాష్‌: కానీ నేను చెప్పాల్సినవి చెప్పి తీరాలి.


కావ్య: ఏం చెప్తారు మామయ్యగారు. బిడ్డతో వచ్చిన మీ కొడుకు గుణవంతుడు అని చెప్తారా? ఆ గుణవంతుడు తల్లి నిర్ణయానికి తల వంచి కట్టుకున్న పెళ్లాన్ని వదిలేసి పోతుంటే అప్పుడు ఆయనకు మీరేంటి చెప్పలేదండి. మీ భార్యవెళ్లిపోతుంటే ముందుకొచ్చారా? ఇదెక్కడి న్యాయం మామయ్యగారు. 


సుభాష్‌: నా ఉద్యేశ్యం అది కాదమ్మా..?


 అనగానే ముందు  మా అత్తగారితో నేను తేల్చుకునే లెక్కలు చాలా ఉన్నాయి అని చెప్తుంది కావ్య. దీంతో అపర్ణ కావ్య మీద కోప్పడుతుంది. దీంతో నువ్వేం సాధించావని ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు అంటూ ప్రశ్నిస్తుంది. ఓడిపోయానన్న బాధతో ఇంట్లో వాళ్లకు ముఖం చూపించలేక ఇంట్లోంచి వెళ్లిపోతున్నారు అనగానే అపర్ణ కోపంగా కావ్యన తిడుతుంది. దీంతో కావ్య మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదు. మీ కొడుకు మీద మీకే నమ్మకం లేదు అంటూ మీకు ధైర్యం లేదని.. ఓడిపోయానని ఒప్పుకుని వెళ్లిపోండి అని చెప్తుంది.


రాజ్‌: కళావతి మా అమ్మనే ఎదురించి మాట్లాడతావా? మా అమ్మ తప్పొప్పులనే ఎంచే దానివి అయిపోయావా?


కావ్య: మీ అమ్మగారు వెళ్లిపో అనగానే నన్ను దిక్కులేని దానిలా ఇక్కడే వదిలేసి మీ దారి మీరు చూసుకోవాలనుకున్నారు. మీకు నన్ను అనే రైట్‌ లేదు. మిమ్మల్ని దులిపేసే టైంలో మిమ్మల్ని దులిపేస్తాను అంతవరకు ఆగండి.


అనగానే అపర్ణ కావ్యను తిడుతుంది. నేను ఇంట్లో ఉంటే పిల్లిలా ఉండేదానివి నీకు కూడా నోరు లేస్తుందే.. అనగానే అవును మీరు వెళ్లిపోతే నిజంగా అదే జరుగుతుంది. ఈ ఇంట్లో పిల్లి కూన కూడా పులి అయిపోతుంది. అంటూ ఎవరెవరు ఎలా మారిపోతారో వివరంగా చెప్తుంది కావ్య.  దీంతో అపర్ణ తన నిర్ణయాన్ని మార్చుకుంటానని ఇదంతా భరించే సత్తా తనకు ఉందని మరి నిజాన్ని భయటపెట్టే సత్తా నీకుందా? అని కావ్యను అడగడంతో కావ్య షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్న 'లవర్‌' బ్యూటీ రిద్ది కుమార్‌