Trinayani Today Episode విశాలాక్షి తీసుకొచ్చిన బంగారు కొబ్బరి కాయను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక విశాలాక్షి అందరితో ఆ కొబ్బరి బంగారం విలువ చూడకండి అందులో ఇంకా విలువైనది ఉంటుందని అంటుంది. అందరూ మళ్లీ షాక్ అయిపోతారు. విశాల్ విశాలాక్షిని లోపలికి తీసుకెళ్లమంటాడు. ఇక విశాలాక్షి ఆ బంగారు కొబ్బరిని జాగ్రత్తగా ఉంచమని చెప్తుంది.


వల్లభ: మమ్మీ గోల్డ్ కాయిన్ ఉంటుంది కానీ గోల్డ్ కాయ ఉంటుందా.. అది అదంతా బంగారమే అంటుంది. అది నిజమేనా..
తిలోత్తమ: డౌటే లేదు. అది బంగారు కొబ్బరికాయే. 
సుమన: బంగారు కొబ్బరిని సమయం వచ్చినప్పుడు పగలగొట్టాలి అని చెప్పింది కదా అత్తయ్య అందులో కొబ్బరి నీళ్లు ఉంటాయా అది ఎలా సాధ్యం. 
వల్లభ: చిన్న మరదలకి వచ్చిన అనుమానం నాకు వచ్చింది మమ్మీ.
తిలోత్తమ: కొబ్బరికాయ అయితే నీళ్లు ఉంటాయి. కానీ అది బంగారు కాయ. అందులో విలువైనదే ఉంటుందని నా అంచనా.
సుమన: పైన అంతా బంగారం ఉందంటే లోపల వజ్రాలు పెట్టి ఉంటారా.
వల్లభ: అంత విలువైనది ఆ గారడీ పిల్ల దగ్గర ఎందుకు ఉంటుంది.
తిలోత్తమ: గతంలో అమ్మవారి బంగారం తీసుకొచ్చింది గుర్తుందా. విశాలాక్షికి గుడిలోపటికి వెళ్లడానికి యాక్సెస్ ఉన్నట్లుంది. 
సుమన: అందుకే లోపలికి వెళ్లి దొరికినవి దొరికినట్లు దాచేస్తున్నట్లుంది.
తిలోత్తమ: నయని పరిచయంతో దాని జీవితం మారిందిరా. ఇక్కడికి రాకపోకలు సాగిస్తూ విలువైనవి మనకి చూపిస్తూ మనకు తెలీకుండా ఏమైనా వ్యాపార వ్యవహారాలు నడిపిస్తుంది ఏమో.
సుమన: మా అక్క స్మగ్లింగ్ చేస్తుందా. ఛాఛా అక్క అలా చేయదు. నాకు నమ్మకం లేదు అత్తయ్య.
తిలోత్తమ: నయనిని అనుమానించి మనకు లాభం లేదు. ఇప్పుడు విశాలాక్షి తీసుకొచ్చిన బంగారు కొబ్బరి గురించి ఆలోచించండి. దాన్ని మనం కొట్టేసి అందు లోపల ఉన్న విలువైన దాన్ని మనం మూడు వాటాలుగా పంచుకుందాం. 


సుమన నయని గదిలో అంతా వెతుకుతూ ఉంటుంది. తిలోత్తమ ఎవరూ రాకుండా బయట కాపలాగా ఉంటుంది.  నయని వాళ్లు హాల్‌లో ఉంటారు. ఇక పావనామూర్తి చేతిని పట్టుకొని జాతకం చెప్తుంది. ఇక గత జన్మలో పావనామూర్తికి 12 మంది పిల్లలు అంటే ఈ జన్మలో భార్యగా ఉన్న దురంధర ఫీలైపోతుంది. 


ఇక అందరూ తిలోత్తమ, సుమన, వల్లభ వాళ్ల ముగ్గురు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఇంతలో వల్లభ గాయత్రీ పాపని తీసుకొని సుమన, తిలోత్తమ దగ్గరకు వస్తుంది. గాయత్రీ పాపే టెంకాయని పట్టుకొస్తుందని తీసుకురమ్మని కింద దించుతాడు. దీంతో గాయత్రీ పాప వెళ్లి బెడ్ పక్కన ఉన్న డెస్క్‌లో నుంచి బంగారం కొబ్బరిని తీసుకొస్తుంది. 


ఇక వల్లభ సంచిలోని కొబ్బరిని పట్టుకొని బయటకు తీయగానే కొబ్బరి మళ్లీ పరుగులు తీస్తుంది. ముగ్గురు దాని వెనక పరుగెడతారు. ఆ కొబ్బరి కింద హాల్‌లోకి మెట్ల వెంట వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అందరూ వద్దు అని చెప్తున్నా వినకుండా సుమన ఆ కొబ్బరిని తీసుకొని పగలకొడుకుతుంది. దీంతో ఆ కొబ్బరి నుంచి తేనె టీగలు వస్తాయి. 


ఇక విశాలాక్షి ఉండటం వల్ల నయని, విశాల్ అందరి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది. సుమన, తిలోత్తమ, వల్లభలను తేనేటీగలు విపరీతంగా కుట్టేస్తాయి. ముగ్గురు నొప్పుతో విలవిల్లాడిపోతారు.


విశాలాక్షి: విలువైనవి ఉన్నాయి అంటే దురాశపడ్డారు.
తిలోత్తమ: తేనే టీగలు విలువైనవా..
విశాలాక్షి: చాలా.. అవి పెట్టే తేనె బంగారంగా మారేది. అందరూ నోరెళ్ల బెట్టారు. మీరు తొందరపడి ఆ కొబ్బరికాయను ముక్కలు చేశారు. 
సుమన: ఎక్కడ నుంచి తెచ్చావు నువ్వు ముఖం అంతా వాచిపోయేలా కుట్టేశాయి.
నయని: నన్ను అడగకుండా తీసినందుకు తగిన శాస్తి జరిగింది. 
తిలోత్తమ: గాయత్రీ పాపే ఇచ్చింది. 
విక్రాంత్: పాప తీసి ఇచ్చిందా.
విశాలాక్షి: తను ఇస్తే మాత్రం మీరు తీసుకుంటారా.


గదిలో సుమన తేనె టీగలు కుట్టడంతో విలవిల్లాడిపోతుంది. ఇక నయని అక్కడికి గంజి పట్టుకొని వస్తుంది. విక్రాంత్ భార్యని చీవాట్లు పెడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: జ్వాల గర్భంలో గరుడ అంశ ఉందని తెలుసుకున్న నాగేశ్వరి.. జ్వాలని చూసి గజగజ వణికిపోయిన పంచమి!