Brahmamudi Serial Today Episode: కావ్య కూడా రాజ్‌తో ఎలా సుఖపడుతుంది. రాజ్‌ మరో వ్యక్తితో కాపురం చేస్తున్నప్పుడు కావ్య ఎలా సంతోషంగా ఉంటుంది. అందుకే నేనిప్పుడు కావ్యకు న్యాయం చేస్తాను. తనకు కావాల్సినంత ఆస్థి రాసిద్దాము. రాజ్‌ నిజం చెప్పకపోతే ఇక నేనే ఇంట్లోంచి వెళ్లిపోతాను. అంటూ అపర్ణ చెప్పడంతో సుభాష్‌ షాక్‌ అవుతాడు. నేను చేసిన తప్పుకు ఇంతమంది శిక్ష అనుభవించాలా? అంటూ సుభాష్‌ మనసులో బాధపడతాడు. ఏదో ఒకటి చేసి ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటాడు. మరోవైపు రాహుల్ కోపంగా రుద్రాణిని తిడతాడు.


రాహుల్‌: ఎం చేసైనా సరే ఆ రాజ్‌ను ఇంట్లోంచి పంపించేస్తాను అంటూ తెగ ప్లాన్స్‌ వేసుకున్నావు. కానీ చివరికి అత్తయ్య నీకే పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది. నేను ఇందాకే అత్తయ్య ముఖం చూస్తే అనుమానంగా ఉందని చెప్పానా? అందరి ముందు నాటకం ఆడి తనే ఇంట్లోంచి వెళ్లిపోతానని మాట మార్చింది.


రుద్రాణి: మా వదిన ఏ ఉద్దేశ్యంతో ఇంట్లోంచి వెళ్లిపోతానని చెప్పిందో నాకు తెలియదు కానీ అది మాత్రం అసలు జరగనివ్వను.


రాహుల్‌: ఎం చేస్తావేంటి?


రుద్రాణి: వదిన మీద ప్రేమ ఉన్నట్లు నటించైనా సరే రాజ్‌ను తప్పు పట్టి వదిన ఇంట్లోంచి వెళ్లిపోకుండా చేసి రాజ్‌ ఇంట్లోంచి వెళ్లిపోయేటట్లు చేస్తాను.


అంటూ రుద్రాణి తన ప్లాన్‌ గురించి రాహుల్‌కు చెప్తుంది. మరోవైపు కావ్య ఆలోచిస్తూ బెడ్‌రూంలో కూర్చుని ఉంటే రాజ్‌ ఏడుస్తూ లోపలకి వస్తాడు. కావ్య రాజ్‌ను ఓదారుస్తుంది. ఎంతో ఆత్మావిశ్వాసంతో ఉండే మీరు ఇలా మారిపోయారేంటండి అని అడుగుతుంది. అమ్మ ఇల్లు విడిచి మనకు దూరంగా వెళ్లిపోవడానికి నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ బాధ అంటాడు రాజ్‌. దీంతో కావ్య రాజ్‌కు ధైర్యానిస్తూ.. నేను మీ అమ్మను ఆపుతానని మీరేం బాధపడొద్దని రాజ్‌ను ఓదారుస్తుంది. మరోవైపు అనామిక ఈ టైంలో నేను మా అత్తగారితో మంచిగా ఉండాలని అనుకుని ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది. అనామికను చూసిన ధాన్యలక్ష్మి లేచి వెళ్లిపోతుంటే..


అనామిక: ఇంకా ఎన్నాళ్లని ఇలా మాట్లాడకుండా ఉంటారు ఆంటీ?


ధాన్యలక్ష్మీ: మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీ నిర్ణయాలు నువ్వు తీసుకున్నప్పుడు నాతో పనేం ఉంది.


అనామిక: అంటే మన మధ్య ఇంక ఏ బంధమూ లేదా ఆంటీ?


ధాన్యలక్ష్మీ: ఉందని నేను అనుకుంటే సరిపోదు. నువ్వు కూడా అనుకోవాలి కదా?


అనామిక: తప్పు చేశాను దానికి ఇంత శిక్ష వేయాలా?


ధాన్యలక్ష్మీ: శిక్ష వేయడానికి నేనెవరు అనామిక?  


అనగానే అనామిక ఏడుస్తుంది. మీరంతా నన్ను ఇలా దూరం పెడితే ఎలా అంటూ బాధపడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఊరుకో అనామిక నువ్వు ఇక బాధపడకు నేను నీకు అండగా ఉంటానని ధాన్యలక్ష్మీ చెప్పి వెళ్లిపోతుంది. ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి ఈవిడని నా దారిలోకి తెచ్చుకున్నాను. ఇక కళ్యాణ్‌ను తెచ్చుకోవడమే నెక్ట్స్‌ అని మనసులో అనుకుంటుంది. మరోవైపు రాహుల్‌, రుద్రాణి ముసుగు వేసుకుని స్వప్న గదిలోకి వెళ్లి కోటి రూపాయలు కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో స్వప్న నిద్రలేచి చంద్రముఖిలా మారిపోయి రాహుల్‌, రుద్రాణిలను చెడుగుడు ఆడుతుంది. పిచ్చకొట్టుడు కొడుతుంది. దీంతో రాహుల్‌, రుద్రాణి ఇద్దరూ స్వప్న రూంలోంచి బయటకు పారిపోతారు. మరోవైపు సుభాష్‌ ఒంటరిగా గార్డెన్‌ కూర్చుని అపర్ణ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: ఇంగ్లాండ్ వాస్‌డేల్ పర్వతంపై జనసేన జెండా, పవన్ కల్యాణ్ కోసం యువకుడి సాహసం