Janasena flag On Wasdale Mountain: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన సినిమాలనే కాదు, వ్యక్తిగతంగానూ ఎంతో మంది ఇష్టపడుతారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆయన కూటమిలో భాగమై పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన, ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అభిమానులు స్వచ్ఛందంగా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ జనసేనకు ఓటు వేయాలని కోరుకుంటున్నారు. పవర్ స్టార్ అసెంబ్లీలోకి అడుగు పెడితే ప్రజా సమస్యలను బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటున్నారు. ఈసారి పవన్ కల్యాణ్ కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


వాస్‌డేల్ పర్వతం మీద జెనసేన జెండా


ఏపీ, తెలంగాణలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులు సైతం జనసేన గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ లో ఓ యువకుడు జనసేన గెలుపు కోసం ఏకంగా వాస్‌డేల్ పర్వతాన్ని అధిరోహించాడు. ఎంతో కష్టపడి పర్వత శిఖరానికి చేరుకుని జనసేన జెండాను ఎగురవేశాడు. తన వెంట తీసుకెళ్లిన గాజు గ్లాసులో చాయ్ తాగుతూ, జనసేనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. తన కోసం, తన పార్టీ కోసం ఆ యువకుడు అందించిన మద్దతుకు ధన్యవాదాలు చెప్పారు. “జనసైనికుడు ఇంగ్లాండ్ లోని పర్వతం మీద సగర్వంగా జనసేన జెండాను ప్రదర్శించడం ఎంతో సంతోషాన్ని నింపింది. ఆయన కష్టపడి పర్వతాన్ని అధిరోహించడం చూస్తుంటే, నా హృదయం ఉప్పొంగుతోంది. అతడు వేసే ప్రతి అడుగు మార్పు, న్యాయం కోసం పరితపిస్తోంది. మీ నిరంతర మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా మీద మీరు కనబరుస్తున్న నమ్మకానికి ధన్యవాదాలు” అని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.






వాస్‌డేల్ పర్వతం ప్రత్యేకత ఏంటంటే?


వాస్‌డేల్ పర్వతం ఇంగ్లండ్ లో అత్యంత కీలకమైనది. కుంబ్రియాలోని లేక్ డిస్ట్రిక్ట్ నేషనల్ పార్క్ కు వెస్ట్ భాగంలో ఉన్న లోయ. ఇర్ట్ నది ఈ లోయ గుండా రావంగ్లాస్ వరకు ఈ పర్వతశ్రేణి పక్క నుంచి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. పర్యాటకులు ఈ వాస్‌డేల్ పర్వతాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. పర్వతారోహకులు  తరచుగా అధిరోహిస్తుంటారు.


పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతున్నారు. మహాకూటమితో  పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను కేటాయించారు.


Read Also: సునీత జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క పాట - హీరోయిన్‌గానూ అవకాశాలు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?