Brahmamudi Serial Today Episode: స్వప్న రెడీ అవుతుంటే దూరం నుంచి రాహుల్, రుద్రాణి చూస్తుంటారు. నిన్న అంత గొడవ జరిగినా నువ్వు వద్దు అని చెప్పినా చూడు మమ్మీ మోడలింగ్ చేయడానికి ఎలా రెడీ అవుతుందో అని రాహుల్ రుద్రాణితో చెప్తాడు. ఇప్పుడే వెళ్లి దాన్ని ఆపేస్తా అంటాడు.


రుద్రాణి: ఆగురా అది వెళ్తే కదా ఇంట్లో అందరి ముందు తప్పు చేసిన దానిలా దోషిలా నిల్చొపెట్టొచ్చు. నీకొక పని చెప్తా విను. నువ్వు వెళ్లి నీ పెళ్లంతో మోడలింగ్ చేయమని సపోర్ట్ చేయ్. అది ఇళ్లు దాటే సమయానికి నేను చేయాల్సింది చేస్తా. 
రాహుల్: అర్థమైంది మామ్ నువ్వు వెళ్లి రెడీగా ఉండు నేను రెచ్చగొట్టి చేయాల్సింది చేస్తా. రాహుల్ స్వప్న దగ్గరకు వెళ్లి తనని పొగిడి మోడలింగ్ చేయమని సపోర్ట్ చేస్తాడు. ఇంట్లో అందరూ హాల్‌లో ఉంటే కావ్య టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇంతలో స్వప్న షార్ట్ డ్రస్ వేసుకొని కిందకి వస్తుంది. 
రుద్రాణి: స్వప్న ఎక్కడికి..
స్వప్న: ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి. బ్రాండెడ్ బికినీ కంపెనీ వాళ్లు నన్ను మోడల్‌గా సెలక్ట్ చేసుకున్నారు అంట. వాళ్లతో అగ్రిమెంట్ చేసుకొని బికినీ యాడ్ చేయాలి. 
రుద్రాణి: అంటే నువ్వు బికినీ వేసుకుంటావా.. నిన్న అంత పెద్ద గొడవ జరిగినా కూడా నువ్వు వెళ్తుంటే ఏమనాలి.
స్వప్న: ఏమీ అనొద్దు ఏం చేయలేని వాళ్లకి ఏమీ అనే హక్కు కూడా లేదు.
రుద్రాణి: నాకు లేదు సరే ఈ కుటుంబానికి లేదా.
స్వప్న: మధ్యలో మీరు అందర్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది నా సమస్య. ఈ సమస్యకు ఇప్పటి వరకు మీరు కానీ మీ కొడుకు కానీ పరిష్కరించలేకపోయారు. అందుకే నా నిర్ణయాన్ని నేను అమలు చేస్తున్నా. 
పరందామయ్య: అమ్మా స్వప్న నీ సమస్య నాకు అర్థమైంది అమ్మ. అందుకే నేను ఒక పరిష్కారం ఆలోచించా..దాని వల్ల నీకు నీ బిడ్డకు కావాల్సినంత భరోసా దొరుకుతుందని నేను అనుకుంటున్నా. మనకున్న స్థిరాస్థిలో అబిడ్స్‌లో నేను కట్టించిన షాపింగ్ కాంప్లెక్స్ డాక్యుమెంట్స్ ఇవి. దీని వల్ల నెలకు లక్షల్లో ఆదాయం వస్తుంది. నీ బిడ్డకు నువ్వు కోరుకున్న భరోసా కోసం నీ పేరున రాశాను. తీసుకోమా. నీ జీవన భృతి కోసం గర్భవతిగా ఉన్న నువ్వు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. దీన్ని అమ్మే హక్కు నీకు లేదు ఇక్కడ ఎవరికీ లేదు. కేవలం దీని మీద వచ్చే ఆదాయం మాత్రం నువ్వు అనుభవించొచ్చు. 
ధాన్యలక్ష్మి: అదేంటి అత్తయ్య మామయ్య అంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌ని రుద్రాణి కోడలికి రాసిస్తే మీరు అడ్డుకోలేదా. 
చిట్టీ: ఏ నీ పుట్టింటి ఆస్తి ఏమైనా రాసిచ్చారా అది నా భర్త స్వర్జితం. 
ధాన్యలక్ష్మి: తాతయ్య ఆస్తులకు మనవలే కదా వారసులు మరి వారసులు కాని వారికి ధారపోయడం ఎందుకు. 
చిట్టీ: ఈ ఇంటి ఆడబిడ్డ రుద్రాణి. కూతురు తాళుక వారసులకు రాసివ్వకూడదు అని రూల్ లేదు కదా. మధ్యలో నీ అభ్యంతరం ఏమిటి.
ధాన్యలక్ష్మి: రుద్రాణి ఏమీ మీ రక్తం పంచుకొని పుట్టినది కాదు కదా..
రుద్రాణి: అది ఇప్పుడు మీ అసలు రంగు బయటపడింది. 
అనామిక: మా అత్తయ్య అడిగిన దాంట్లో తప్పేముంది. స్వప్న కడుపులోని బిడ్డ ఈ దుగ్గిరాల వంశానికి వారసుడు కాదు కదా. 
స్వప్న: అంటే నువ్వు తాతయ్య గారి నిర్ణయాన్నే కాదు అంటున్నావా.
అపర్ణ: ఈ ఇంట్లో మామయ్య గారి నిర్ణయాన్ని కాదు అనే హక్కు ఎవరికీ లేదు. 
ధాన్యలక్ష్మి: ఏ హక్కు లేని స్వప్నకి అంత ఆస్తి రాసివ్వడం న్యాయమేనా అక్క. స్వప్నకు భర్త ఉన్నాడు. భార్యని బిడ్డను తాను కదా పోషించుకోవాలి.
ప్రకాశ్: మా నాన్న మాటనే దిక్కరిస్తావా నువ్వు నీకు అంత ధైర్యం ఉందా. మా నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని ఆలోచించే తీసుకుంటారు అది తెలీదా నీకు.
రుద్రాణి: అసలు నేను కూతురునే కాదు అంటుంది అది అడగవేంటి చిన్నన్నయ్య.
అనామిక: అది అబద్ధమా..
కల్యాణ్: అనామిక నువ్వేంత నీ అనుభవం ఎంత. ఇన్నాళ్లు అత్తయ్యని ఈ ఇంటి ఆడపడుచు గానే అందరం గౌరవిస్తున్నాం. ఇప్పుడు నువ్వొచ్చి మా అమ్మలాగే వేరు చేసి మాట్లాడుతావేంటి. అసలు ఆ రిలేషన్ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారు.  
పరందామయ్య: అమ్మా ధాన్యలక్ష్మి ఏంటిది ఒక చిన్న స్థిరాస్తి కోసం బంధాలను బంధుత్వాలను వేరు చేసి మాట్లాడటం సరికాదు.
చిట్టీ: ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావ్. ఇది తరతరాల ఆస్తి. మనవులకు సంబంధించిన ఆస్తి. అది మనవులకే కదా.  అవన్నీ నీకు అవసరం లేదు.
అపర్ణ: చూడు ధాన్యలక్ష్మి నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చిన నాలుగేళ్లకు నువ్వు కోడలిగా వచ్చావ్. నీకు వయసు సరిపోదు అనుభవం సరిపోదు. మామయ్య గారి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. అర్హత లేదు. కాబట్టి నీకు నీ కోడలకు ఎదురించే హక్కే లేదు. కాబట్టి నోరు మూసుకో..


అనామికకు తన తల్లి కాల్ చేస్తుంది. అనామిక జరిగింది అంతా చెప్తుంది. కల్యాణ్ బయట పడుకుంటున్నాడు అని తన కొంగుకు కట్టుకోవడం కష్టంగా ఉందని అనామిక అంటుంది. దీంతో అలా వదిలేయకుండా బతిమాలి దారిలో పెట్టుకోవాలి అని ప్రేమతో దారిలోకి తెచ్చుకోవాలి అని అంటుంది. 


మరోవైపు రాజ్ కావ్య బావ లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఉంది అంటాడు. ఇప్పుడు కళావతికి పిలిచి ఏం చెప్తే అది చేస్తుంది అనుకుంటాడు. కావ్యని పిలిచి కాఫీ తెమ్మంటాడు. 


చిట్టీ: మీ బావ లేడు అనుకొని కాన్ఫిడెంట్‌గా కాఫీ అడిగాడు. ఉదయమే వచ్చేశాడు అని తెలిస్తే ఏమైపోతాడు. 
కావ్య: ఏమవ్వడు ఎందుకు పిలిచావు అని నా పీక కొరికినా కొరికేస్తారు. 
చిట్టీ: నేను నీ వెనకే వస్తాను కదా నువ్వు ముందు కాఫీ పెట్టు. ఇక కావ్య రెండు కాఫీలు తీసుకొస్తుంది. ఎందుకు అని రాజ్ అడిగితే మా బావకి ఇవ్వడానికి అని చెప్తుంది.
రాజ్: ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్. నువ్వ మీ పుట్టింటికి వెళ్లి అక్కడున్న మీ బావకి కాఫీ ఇచ్చి వస్తావా. 
కావ్య: పుట్టింటి వరకు అక్కర్లేదు అండి గార్డెన్ వరకు వెళ్తే చాలు. మా బావ గార్డెన్లోనే ఉన్నాడు. ఉదయమే మా బావ వచ్చేశాడు.
రాజ్: వాట్ ఎవరు రమ్మన్నారు.
చిట్టీ: నేనే రమ్మన్నాను. పాపం కాలు కాలింది కదా అందుకే..
రాజ్: ఇక్కడ నాకు కాలింది. నువ్వు ఒక్కదానివి చాలు నానమ్మ నేను అనుకున్నవి చెడగొట్టడానికి. అయినా వాడు ఉంటే నాకు వచ్చిన నష్టం ఏమిటి.
చిట్టీ: చెప్పాను కావ్య మా మనవుడు ఏం అనడు అని. 


కావ్య భాస్కర్‌కి కాఫీ ఇస్తుంది. రాజ్ చూడగానే కావాలని క్లోజ్‌గా మాట్లాడుతారు. ఇక చిట్టీ కూడా అక్కడికి వెళ్లి పక్కన కూర్చొంటుంది. రాజ్ అంతరాత్మ కనిపించి రాజ్‌ని ఏడిపిస్తుంది. జలస్ ఫీలయ్యేలా చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: మేఘనే కరాళి అని తెలుసుకున్న ఫణేంద్ర, పంచమి.. జ్వాల అండ్ కో కన్నింగ్ ప్లాన్!