Krishna Mukunda Murari Today Episode  ముకుంద పాల గ్లాస్‌తో గదిలోకి వెళ్తుంది. ఆదర్శ్ ముకుంద చేతిలోని పాల గ్లాస్ తీసుకోబోతే పక్కన పెట్టేస్తుంది. దీంతో ఆదర్శ్‌ షాక్ అయి ముకుంద వైపు చూస్తాడు. ఇక ఆదర్శ్ ముకుంద సిగ్గు పడింది అనుకొని ఏవేవో మాట్లాడుతాడు. ఇక ముకుందని టచ్ చేయడానికి ట్రై చేస్తే ముకుంద బెడ్ మీద కూర్చొండిపోతుంది. దీంతో ఆదర్శ్ తనలో తాను కంగారు ఎక్కువరా నీకు కాసేపు కబుర్లు చెప్పలేవా అని అనుకుంటాడు. 


ఆదర్శ్‌: నీతో చాలా విషయాలు పంచుకోవాలి అని నా గురించి చెప్పాలి అని ఎప్పటి నుంచో అనుకునేదాన్ని ముకుంద. కానీ అపార్థాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం లోనే సగం జీవితం అయిపోయింది. అసలు నేను ఈ ఇంటికి ఎలా వచ్చానో తెలుసా..
ముకుంద: తెలుసు మురారి చెప్పాడు. 
ఆదర్శ్‌: చెప్పేశాడా.. ఇక ఆదర్శ్‌ చెప్పాలి అనుకున్నవన్నీ ముకుంద చెప్పేస్తుంది. అయితే నాకోసం నేను చెప్పే అవకాశం లేకుండా నా గురించి మొత్తం చెప్పేశాడు అన్నమాట. ఇలా మాట్లాడితే ఇద్దరి మధ్య బెరుకు పోయి చనువు వస్తుందని.
ముకుంద: అర్థమైంది నేనుకూడా ఆ బెరుకు పోయి ఏదైనా ఫ్రీగా మాట్లాడే టైం కోసం వెయిట్ చేస్తున్నా.. 
ఆదర్శ్‌:  నాకు తెలుసు ముకుంద నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని.. ఇప్పుడు పాలు పంచుకోవచ్చా.. ఏమంటావు ముకుంద.
ముకుంద: సరే..
ఆదర్శ్‌:  పాల గ్లాస్ తీసుకొని సగం తాగుతాడు. 


కృష్ణ: టెన్షన్ ఎక్కువ అయిపోతుంది ఏసీపీ సార్ అక్కడేం జరుగుతుందో. 
మురారి: ముకుంద కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు.
కృష్ణ: అక్కడ కాంప్రమైజ్ అవ్వరు ఏదో ఒకటి చేసి శోభనం ఆపేస్తుంది. కానీ ముకుందకు అంతకన్నా కూడా మన శోభనం ఆగిపోవాలి అని కదా. ఈపాటికే ఏదో ఒకటే చేసే ఉంటుంది. కామ్‌గా ఉండదు కదా.
మురారి: కామ్‌గా ఎందుకు ఉంటుంది. ఈపాటికి ఆదర్శ్‌తో మాట్లాడుతుంటుంది. ఏం చెప్తుందో ఆదర్శ్‌ ఎలా రియాక్ట్ అవుతున్నాడో..


ఆదర్శ్‌: సగం పాలు తాగి ముకుందకు ఇస్తే ముకుంద వద్దు అంటుంది. దీంతో ఆదర్శ్‌ వద్దు అనకూడదు అని అంటాడు. భార్యాభర్తలిద్దరూ ఈపాలు చెరిసగం పంచుకోవాలి. ఆ క్షణం నుంచి జీవితంలో అన్నింటి నుంచి పాలు పంచుకోవడం మొదలవుతుంది.
ముకుంద: తెలుసు కానీ ఎంగిలి చేశారు కదా. 
ఆదర్శ్‌: ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద భార్యభర్తలు ఒకటి అని చెప్పడం కోసమే కదా ఇదంతా. నువ్వేమో ఎంగిలి పాలు అంటున్నావ్.
ముకుంద: ఆది నాకు తెలుసు.. ఇవే ఎంగిలి పాలు మురారి చేతితో ఇచ్చేంటే సంతోషంగా తాగుండేదాన్ని. ఎందుకు అంటే నేను జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నది మురారితో కదా.. ఆదర్శ్‌ కుప్పకూలిపోతాడు. 
ఆదర్శ్‌: ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద.
ముకుంద: నిజం ఆది ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. నా మనసులో ఆలోచినలో అణువణువునా మురారే నిండిపోయి ఉన్నాడు. మురారి తప్ప మరొకరు నా జీవితంలోకి కాదు నా ఆలోచనలోకి రావడం ఆసాధ్యం. మరి ఇన్నాళ్లు నాతో క్లోజ్‌గా ఉన్నావని మీకు అనుమానం రావొచ్చు. అలా ఉండాల్సి వచ్చిన ప్రతీ సారి నరకం చూశాను. కానీ వెంటనే నీలో మురారిని చూసుకునేదాన్ని. అంతే నరకం స్వర్గంగా మారిపోయేది. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నానేంటి నువ్వు రాకముందే చెప్పొచ్చు కదా మారిపోయాను అని ఇప్పుడు చెప్తున్నానేంటి అని మీరు అడగొచ్చు. నేను మారిపోయాను అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నా మౌనాన్ని మార్పులా అర్థం చేసుకున్నారు. మౌనంగా ఎందుకు ఉన్నానంటే మిమల్నినా జీవితంలోకి ఆహ్వానించాలి అని కృష్ణ, మురారిలు సంతోషంగా ఉంటే చూడాలి అని ఇలా చాలా అనుకున్నాను. కానీ మురారినే ప్రతీక్షణం నా కళ్లముందు తిరుగుతుంటే తనని మర్చిపోయి బతకడం నా వల్ల కావడం లేదు. మీరు కూడా వేరే ఇంట్లో ఉండుంటే అక్కడికి నేను వచ్చుంటే మీతో కాపురం చేసుండేదాన్నేమో. కానీ కళ్ల ముందే మురారి ఉంటే తనని మర్చిపోయి మిమల్ని అంగీకరించలేకపోయాను. మురారి లేకుండా బతకడం తను లేకుండా బతకడం నా వల్ల కాదు ఇది కన్ఫమ్.. ఇది చెప్పాక కూడా మనం కలిసి బతకాలి అనుకుంటే ఇద్దర్ని ఇద్దరం మోసం చేసుకున్నట్లే. 
ఆదర్శ్‌: కోపంతో.. హాల్‌లోకి వచ్చి మురారి మురారి అని అరుస్తాడు. రేయ్ మురారి బయటకు రారా అని గట్టిగా పిలుస్తాడు. ఇంతలో మధు, శకుంతల, రేవతి వచ్చి ఏమైందని అడుగుతారు. 
రేవతి: ఆదర్శ్‌ ఏమైంది నాన్న ఎందుకు అలా అరుస్తున్నావ్.. మొదటి రాత్రి ఇలా గదిలో నుంచి బయటకు రాకూడదు. 
ఆదర్శ్‌:  అసలు నాకు లోపలికి వెళ్లే అర్హతే లేదు. నేను ఉండాల్సింది బయటే. 
శకుంతల: ఏమైంది అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. ఆదర్శ్‌ నీకు ఆ అర్హత లేకపోవడం ఏంటి.
ఆదర్శ్‌: లేదు మీకు తెలీదు. తెలిసిన వాళ్లు నోరు విప్పలేదు. అందుకే ఈ రోజు నా పరిస్థితి ఇలా తయారైంది. 
మధు: మనసులో.. నేను ఏదైతే జరుగుతుంది అని భయపడ్డానో అదే జరిగింది. ఆదర్శ్‌ అంటే ఇష్టం లేదు అని ముకుంద చెప్పేసినట్లుంది. 
ఆదర్శ్‌: రేయ్ మురారి బయటకు రారా ఎంత సేపు.. ఇక అందరూ నవ్వుతున్నట్లు ఆదర్శ్‌ ఊహించుకొని తల పట్టుకొని ఇబ్బంది పడతాడు. ఏడుస్తాడు. 
మురారి: ఆదర్శ్‌..
రేవతి: మురారి ఏమైందిరా వీడికి ఏదేదో మాట్లాడుతున్నాడు.
ఆదర్శ్‌: వాళ్లకి తెలుసు. కానీ చెప్పరు. ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం వీళ్లే. నా జీవితాన్ని నాశనం చేసేశారు. వీళ్లిద్దరూ కలిసి నా జీవితాన్న సర్వనాశనం చేశారు. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకున్నారు. ఏం అన్యాయం చేశానురా మీకు. అందరూ కలిసి నా జీవితంతోనే ఆడుకున్నారు. అని కింద పడి ఆదర్శ్‌ కొట్టుకొని ఏడుస్తాడు. అందరూ తనని ఆపడానకి ప్రయత్నిస్తారు.
ముకుంద:  ఈ శోభనం ఆపమని మురారికి చిలకకు చెప్పినట్లు చెప్పాను. వినకుండా నాతో నిజం చెప్పిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేస్తావో చేయ్..
ఆదర్శ్‌: ఆదర్శ్‌ మురారి కాలర్ పట్టుకొని రేయ్ చేయాల్సింది అంతా చేసి ఏంటిదని నన్నే అడుగుతున్నావా.. నీకు తెలీదారా ఇలా జరుగుతుంది అనీ తెలీదా.. 
రేవతి: ఏం జరిగిందో చెప్పకుండా ఏంటీ గొడవ. ముందు నువ్వు గదిలోకి పద రా..
ఆదర్శ్‌: వదులు పిన్ని వదులు పిన్ని.. ఎక్కడికి వెళ్లమంటావ్ ఆ గదిలోకి వెళ్లాల్సింది నేను కాదు ఇదిగో వీడు. కృష్ణ ఏడుస్తుంది. ఆ గదిలో ముకుంద ఎదురు చూసేది నా కోసం కాదు నీ కోసం అని నీకు తెలీదా.. వెళ్లు ఆ గదిలో నీకోసం వెయిట్ చేస్తుంది వెళ్లు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కల్కి 2898: 'కల్కి' నుంచి ఊహించని అప్‌డేట్‌ - ప్రభాస్‌ పాత్రను పరిచయం చేసిన టీం, అదిరిపోయిన 'డార్లింగ్' కొత్త లుక్