Brahmamudi Serial Today Episode: కావ్య వచ్చి స్వప్నను ఎందుకు ఫోటోషూట్‌ చేశావని ఇంటిపరువు ఏమౌతుందని అడుగుతుంది. దీంతో తను క్రెడిట్‌  కార్డు బిల్లు కట్టడానికి యాభైవేలు అడుగుతే లేవని చెప్పారు. పైగా పుట్టింటి నుంచి తెచ్చుకోమని ఉచిత సలహా ఇచ్చారు. అందుకే వీళ్ల బతుకులు అందరికీ తెలియాలని అలా చేశాను.. అంటూ నిన్ను కూడా మీ అత్త నెత్తిన పెట్టుకుంది అనుకున్నావా? ఆ ధాన్యలక్ష్మీతో ఆమెకు పడటం లేదు కాబట్టి నిన్ను నెత్తిన పెట్టుకున్నట్లు నటిస్తుంది. తర్వాత మళ్లీ నిన్ను వంటింటికే పరిమితం చేస్తుంది నువ్వు నీలాగా ఉంటే ఎప్పటికీ బాగుపడవు నాలాగా మారి చూడు అన్నీ నీ కాళ్ల దగ్గరకు వస్తాయి అంటూ చెప్పి వెళ్లిపోతుంది స్వప్న. మరోవైపు ఇందిరాదేవి తన భర్తతో కూర్చుని ఇంట్లో జరుగుతున్న విషయాలు చెప్పి బాధపడుతుంది. ఇవన్నీ ఇలాగే సాగితే ఈ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు ముక్కలవుతుందని అపర్ణ చెప్పిందని చెప్తూ బాధపడుతుంది. దీంతో ఇద్దరూ కలిసి సమస్యలు ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. మరోవైపు కళ్యాణ్‌ రూంలో కూర్చుని కవితలు రాస్తుంటాడు. అనామిక వస్తుంది. కళ్యాణ్‌ దిండు దుప్పటి తీసుకుని  బయటకు వెళ్తుంటే


అనామిక: దేనికి అవి


కళ్యాణ్‌: ఇవి దేనికి వాడతారో కూడా తెలియదా?


అనామిక: తెలుసు.. వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు.


కళ్యాణ్‌: బయట పడుకుందామని


అనామిక: ఈ గదిలో గాలి ఆడటం లేదా?


కళ్యాణ్‌: జైల్లో ఉన్నవాడికి గాలి ఆడుతుంది. బయట తిరిగే వాడికి గాలి ఆడుతుంది. కానీ బయట తిరిగే వాడికి గాలిలో ఒకటి ఎక్కువ దొరుకుతుంది అది ఏంటో తెలుసా? స్వేచ్చ. అది లేనప్పుడు మనిషి ఉన్నా లేన్నట్లే


అనామిక: అంటే ఈ గదిని నువ్వు జైలలా ఫీలవుతున్నావా?


కళ్యాణ్‌: ఈ గదినే కాదు ఈ ఇంటిని కూడా అలాగే ఫీల్‌ అవుతున్నాను.


అంటూ కళ్యాణ్‌ చెప్పి బయటకు వెళ్లి హాల్ లో పడుకుంటాడు. దీంతో వెళ్లు నువ్వే కరెక్ట్‌ అని నా దారికి వస్తావు అని మనసులో అనుకుంటుంది అనామిక. హాల్‌  లో పడుకున్న కళ్యాణ్‌ను చూసిన ధాన్యలక్ష్మీ  కంగారుగా లోపలికి వెళ్లి ప్రకాష్‌ ను తీసుకొచ్చి కళ్యాణ్‌ను లోపల పడుకోమని చెప్పండి అని చెప్తుంది. ప్రకాష్‌ వచ్చి కళ్యాణ్‌ ను నిద్ర లేపుతాడు.


కళ్యాణ్‌: ఏంటి నాన్న  ఇంకా పడుకోలేదా?


ప్రకాష్‌: నువ్వు అందరికీ కనిపించేలా ఇక్కడ పడుకుంటే నేను గదిలో ప్రశాంతంగా ఎలా పడుకుంటాననుకున్నావు. ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా?


కళ్యాణ్‌: తెలిసిందే కదా నాన్నా..


అనడంతో ప్రకాష్‌ సర్దిచెప్పి కళ్యాణ్‌ను లోపలికి పంపిస్తాడు.  ధాన్యలక్ష్మీ వచ్చి ఎవ్వరూ చూడకుండా లోపలికి పంపించారు. అనగానే ముందు కోడలికి భర్తతో ఎలా ఉండాలో అది నేర్పించు అని చెప్పి ప్రకాష్‌ వెళ్లిపోతాడు. మరోవైపు శ్వేతతో రాజ్‌ ఫోన్‌లో  మట్లాడుతుంటాడు.


రాజ్: ఆ కళావతి నన్ను వాళ్ల పుట్టింటికి తీసుకెళ్లి టార్చర్ పెట్టాలని చూసింది. అందుకే నేనే వాళ్లకు షాక్‌ ఇచ్చాను.


శ్వేత: ఏం చేశావు..?


రాజ్‌: ఏం చేయడమేంటి? ఆ బావగాణ్ని చూసుకునే కదా ఆ కళావతి తెగ రెచ్చిపోతుంది. అందుకే వాణ్ణి అక్కడే వదిలేసి వచ్చా? వాడి కాలు కాలి మంచిదైపోయింది.


శ్వేత: ఒక్క విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు.


రాజ్‌: ఎందుకేంటి? వాడిక్కడుంటే నాకు చాలా ఇరిటేటింగ్‌ గా ఉంది.


అనగానే కావ్యతో క్లోజ్‌గా ఉన్నాడని నీకు బాధగా  ఉందా? అని  శ్వేత అడగ్గానే రాజ్‌ అలాంటిదేం లేదని చెప్తాడు. ఇంతలో కావ్య రావడం చూసి ఫోన్‌ కట్‌ చేస్తాడు. మీ బావ రాలేదని ఫీల్ అవుతున్నావు కదా? అని రాజ్‌ అడిగితే ఏం లేదు అంటుంది కావ్య. అయితే నీ మనసు మార్చడానికి మంచి పాట పెట్టనా అని అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అనే పాట పెట్టగానే కావ్య బయటకు వెళ్లిపోతుంది. తర్వాత కావ్య కిచెన్‌లో ఉంటే ఇందిరాదేవి వెళ్లి  నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేసుకొచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది. మళ్లీ మీ బావను పిలిపించు అని ఇందిరాదేవి చెప్పడంతో కావ్య  సరేలే అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: ఓటీటీలో 'వ్యూహం', 'శపథం' - మా అసలు వ్యూహం అదే అంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన!