Brahmamudi Serial Today Episode: రేఖ ఆంటీ ఆస్తి మొత్తం తన పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యే వరకు తనను ఏమీ చేయదని.. తాను కూడా ఆస్థి కోసం రేఖతో యుద్దం చేయడానికైనా సిద్దంగా ఉంటానని అయితే టైం కోసం ఎదురుచూస్తున్నానని అపర్ణతో చెప్తుంది ఇందు. అప్పటి వరకు తనను బెదిరించడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుందని చెప్పడంతో అపర్ణ బాధపడుతుంది. ఇందు: నాన్నమ్మ నాకోసం అమ్మానాన్నలు చేసిన త్యాగాలు చాలు నా వల్ల మీకు ఏదైనా జరిగితే ఆ బాధను నేను జీవితాంతం నా గుండెల్లో మోయాలి. ఆ శిక్ష చావడం కంటే చాలా పెద్దది నాన్నమ్మ అపర్ణ: ఇందు అలా మాట్లాడకు మన వంశానికి నువ్వు వారసురాలివి మాత్రమే కాదు మా ఆశయాలకు ఒక్కగానొక్క ఆశవి నువ్వు ఈ కుటుంబాన్ని నమ్ముకుని ఎన్నో వేల మంది బతుకుతున్నారు.. వాళ్లందరి భవిష్యత్తువు నువ్వు నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి.. నిండు నూరేళ్లు బతకాలి వాళ్లందరికీ నువ్వు ఆసరా అవ్వాలి ఇందు: బాధగా అలా జరగాలంటే నువ్వు నాకు ఒక మాటివ్వు అంటూ ఇందు అడగ్గానే.. ఏంటోనని ఆశ్చర్యంగా చూస్తుంటుంది అపర్ణ కట్ చేస్తే.. రాజు రోడ్డు మీద నిలబడి లక్కీతో బాధపడుతుంటాడు. రాజు: ఒరేయ్ ఆ శ్రీకాంత్ గాడు చాలా మంచోడు అని తీసుకెళ్లావు.. యాభై వేలతో ఐదు లక్షలు సంపాదించొచ్చు అనుకున్నాను.. తీరా చూస్తూ ఆ ల్యాప్‌టాప్స్ పడేయడానికి తప్పా దేనికి పనికి రావు.. ఆ ల్యాప్‌టాప్‌తో సంపాదించిన డబ్బులన్నీ ఆ లాప్‌టాప్స్‌కే పోయాయిరాలక్కీ: మావ జీవితం అంటే ఒక యుద్దంరా.. యుద్దంలో గెలుపోటములు ఎంత సాదారణమో బిజినెస్‌లో లాభనష్టాలు అంతే కామన్ రా.. అంత మాత్రానికి అతిగా ఆలోచించి బిపీ, షుగర్ లు తెచ్చుకుని మన అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటామా..? మావ ఓటమికి లొంగిపోయే వాడు కాదు మావ నా ఫ్రెండ్.. జరిగిన నష్టాన్ని కూకటి వేళ్లతో మర్చిపోయి మళ్లీ కొత్తగా నాతో బిజినెస్ చేసేవాడేరా నా ఫ్రెండ్ ఏం జరిగినా నేనున్నాను అంటూ తప్పులు క్షమించి నన్ను విజయం వైపు నడిపించేవాడేరా నా ఫ్రెండ్ అదిరా నా ఫ్రెండ్ రాజు: మనం మోసపోయాం.. నీ ఫ్రెండ్ గాడి వల్ల బ్లాక్‌లో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చేశావు కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టావు కదా అంటూ లక్కీని కొడుతుంటే.. ఇంతలో వాళ్ల ఫ్రెండ్ రాంబాబు కారులో వస్తాడు. రాంబాబును చూసిన రాజు, లక్కీ షాక్ అవుతారు. కూటికి గతిలేనోడు.. క్వాటర్ కు కూడా మనల్ని అడుక్కునేవాడు ఇప్పుడేంట్రా కారులో దిగుతున్నాడు అని అనుకుంటారు. దగ్గరకు వచ్చిన రాంబాబు ఒక డబ్బును ఫిగర్‌ను పట్టాను పెళ్లి చేసుకున్నాను.. జీవితం ఎంజాయ్ చేస్తున్నాను.. మీరు ఎంజాయ్ చేయండిరా అంటూ పదివేలు వాళ్ల చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. దీంతో రాజు, లక్కీ బాగా డబ్బున్న అమ్మాయిలను పటాయించాలని పబ్బుల దగ్గరకు వెళ్తారు. అక్కడ లక్కీకి ఐశ్వర్య కనిపించగానే.. మావ నాకు దొరికేసింది నేను వెళ్తున్నాను అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు అపర్ణ, ఇందుకు మాటిస్తుంది.
అపర్ణ: సరే ఇందు ఈరోజు నుంచి నా గుండెను రాయి చేసుకుని మౌనంగా భరిస్తాను.. నువ్వు చెప్పినట్టు గానే చేస్తాను. కానీ నువ్వు కూడా నాకు ఒక మాటివ్వు.. ఇందు: ఏంటది నాన్నమ్మ చెప్పుఅపర్ణ: నువ్వు మా కోసం ఈ ఆస్తిని వదులుకోవడానికి వీల్లేదు.. ఆ రేఖ చేతుల్లో ఒడిపోకూడదు. ఏం జరిగినా సరే మీ అమ్మా నాన్నలు అనుకున్నది జరిగి తీరాలి ఇందు: అది నా చేతుల్లో లేదు.. దానికి కాలమే సమాధానం చెప్పాలిఅని వెళ్లిపోతుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. భ్రమరాంబ, రేఖ ఇద్దరూ కలిసి అపర్ణను రెచ్చగొట్టి మళ్లీ కొట్టాలని అనుకుంటారు. తమ మాటలతో రెచ్చగొడుతుంటే.. ఇందుకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి అపర్ణ మౌనంగా ఉంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
