Podharillu Serial Today Episode: మహా,చక్రి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు లాయర్ చెప్పడంతో కోపంతో ఇంటికి వచ్చిన కేశవ్...చక్రిని పట్టుకుని నిలదీస్తాడు. నీ అబద్ధాల వల్లే ఇదంతా జరిగిందని మండిపడతాడు. మహాకు ఎవరూ లేరనుకుంటున్నావే నేను ఉన్నానని...నేను తనకు మరిదిని కానని కోడుకునని చెప్పి చక్రి చొక్కాపట్టుకుని నిలదీస్తాడు. ఆ మాటలకు చక్రి, మాధవ్ నిశ్చేష్టులైపోతారు. అంతలో మహా కలుగజేసుకని నిజం నేను చెబుతానని అంటుంది. ఇందులోచక్రి తప్పేమిలేదని చెబుుతుంది. నాకు, చక్రికి మధ్య అబద్ధపు పెళ్లి జరిగిందని దానిని రద్దు చేయించుకోవాడనికే ఈ విడాకులని చెప్పడంతో కేశవ్‌తోపాటు కన్నా షాక్ తింటారు. చక్రిని నిజంగా నేను ప్రేమించి పెళ్లిచేసుకోలేదని...మా ఇంట్లో నాకు ఇష్టంలేని పెళ్లిచేస్తుంటే పారిపోవడానికి చక్రి హెల్ప్ చేశాడని చెబుతుంది. ఆ క్రమంలో పోలీసుస్టేషన్‌కు వెళ్తే...తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెబుతుంది. ఈ నిజం మీకు చెప్పలేక, నాతో కలిసి ఉండలేక చక్రి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని అంటుంది.ఇందులో చక్రి తప్పేమీ లేదని అంటుంది.
వదిన అంటే చెప్పలేకపోయింది...నవ్వు ఎందుకు అబద్ధం చెప్పావురా అబద్దాలకోరు అంటూ చక్రిని కేశవ్ నిలదీస్తాడు.మీరిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు ఎందుకు నాటకం ఆడావని అంటాడు. దీంతో చక్రికి కోపం వస్తుంది. అందరికీ నేను అబద్ధాలు చెబుతున్నాని కోపం వస్తుంది గానీ....నా అబద్ధాల వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా అని నిలదీస్తాడు. పెళ్లిళ్లే కావు అంటూ ఊరంతా శాపంగా మాట్లాడుకుంటున్న ఈ ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చి అందరి నోళ్లు మూయించానని....పాడుబడిన ఈ ఇంటిలో ఓదీపం వెలిగించే దేవతను తీసుకొచ్చానని అంటాడు. ఇందులో నేను నష్టపోయిందే తప్ప...ఎవరికీ ఎలాంటి నష్టం చేయలేదని అంటాడు.
మహా వెళ్లే వరకు అయినా మిమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకున్నానని అది తప్పా అంటూ కోప్పడతాడు. ప్రతిఒక్కరూ నన్ను అనేవాళ్లే తప్ప....నా బాధ అర్థం చేసుకునే వాళ్లు ఒక్కరూ కూడాలేరని మండిపడి బయటకు వెళ్లిపోతాడు. మాధవ్ కలుగజేసుకుని వాళ్లిద్దరూ పెళ్లిచేసుకుని వచ్చిన రోజే....మహా వాళ్ల నాన్నకు సీరియస్‌గా ఉందని ఊరు వెళ్లడంతో అందరూ విమర్శిస్తుంటే...వాళ్ల నోళ్లు మూయించడానికే మనం అంత ఖర్చుపెట్టి రిసెప్షన్ ఏర్పాటు చేశామని అంటాడు. ఆ రోజే మహానాకు నిజం చెప్పిందని అప్పటి నుంచి ఈ నిజాన్ని దాచిపెట్టలేక నేను సతమతమవుతున్నానని అంటాడు. ఇప్పటికైనా నీ ప్రశ్నలకు జవాబులు దొరికి ఉంటాయి కదా అని అంటాడు.అందుకే చక్రిని మహా రూమ్‌లో పడుకోవద్దని చెప్పానని...ఇంట్లో పెళ్లి ఫొటోలు కూడా వద్దని చెప్పింది అందుకేనని అంటాడు.
ఈ మాటలు విన్న తర్వాత మహా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మాధవ్ కూడా ఇంటి ముందుకు వెళ్లిపోతాడు. నారాయణ ఈ పెళ్లి ఉత్తుత్తి పెళ్లి అని తెలిసి చాలా బాధపడుతుంటాడు.ఇక కన్నా ఏడుస్తున్నవాడు ఏడ్చినట్లే ఉంటాడు. మాధవ్‌కూడా చాలా బాధపడుతుంటగా...అక్కడికి వచ్చిన కేశవ్ వాళ్ల అన్నయ్య కాళ్లుపట్టుకుని క్షమించమని కోరతాడు. నువ్వు చేస్తున్న పని అర్థం చేసుకోలేక నిన్ను అనరాని మాటలు అన్నానని బాధపడతాడు. నేను చేసిన పని క్షమించరానిదని అంటాడు.ఈ మాటాలన్నీ అక్కడే ఉండి విన్న మహాలక్ష్మీ కూడా చాలా బాధపడుతుంది. వాళ్ల అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, ఒకరంటే ఒకరికి ఉన్న గౌరవం చూస్తుంది. తనవల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరిగాయని మరింత తలుచుకుని కుమిలిపోతుంది. లోపలికి వెళ్లి కన్నాను పలకరించేందుకు ప్రయత్నించగా....అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.దీంతో మహా మరింత బాధపడి ఏడుస్తుంది. ఇంత మంచి కుటుంబంలో తనవల్లే ఇబ్బందులు తలెత్తాయని ఏడుస్తుంది.
మహాకు నిహారిక ఫోన్ చేసి తన ఫ్రెండ్ హైదరాబాద్‌లోనే ఉందని....తన సింగిల్‌గా డబుల్‌బెడ్‌రూమ్‌లో ఉంటోందని...నువ్వు తన వద్ద ఉండొచ్చని చెబుతుంది. నువ్వు ఆ ఇంట్లో ఎంత బాధపడున్నావో అర్థమవుతుందని...అంటుంది. ఐదుగురు మగవాళ్లు ఉండే ఇంట్లో నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావోనని అనగా....మహా వాళ్ల వదనిపై గట్టిగా కోప్పడుతుంది. ఇక్కడ నాకు ఎలాంటి కష్టాలు బాధలు లేవని...నిజం చెప్పాలంటే మన ఇంట్లోఉన్నదానికన్నా చాలా ప్రేమగా చూసుకుంటున్నారని చెబుతుంది.నువ్వు అనవసరంగా లేనిపోనివి చెప్పొద్దంటూ ఫోన్ పెట్టేస్తుంది.
