Brahmamudi Serial Today Episode: రాజ్‌ రింగ్‌ తొడిగినట్లు కలగన్న కావ్య తర్వాత హ్యాపీగా రెడీ అయ్యి కిందకు వస్తుంది. అందరూ ఫంక్షన్‌ కోసం ఎదురుచూస్తుంటారు. గుంపులుగుంపులుగా చేరి ముచ్చట్లు పెడుతుంటారు. ఇంతలో రాజ్‌ వస్తాడు. కారు దిగి మరోవైపు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేస్తాడు. అందరూ సర్‌ప్రైజింగ్‌గా చూస్తుంటారు. ఏదో పెద్ద గిఫ్టే తెచ్చినట్టున్నాడు అని రుద్రాణి అంటుంది. ఇంతలో రాజ్‌ ఒక చిన్న బాబును కారులోంచి ఎత్తుకుని వస్తుంటాడు. అందరూ షాక్‌ అవుతారు. రాజ్‌ బాబును ఎత్తుకుని కావ్య పక్కన వచ్చి నిలబడతాడు.


అపర్ణ: రాజ్‌ ఎవరీ బిడ్డ..


ఇందిర: ఏవరీ బిడ్డ..


రుద్రాణి: బాబులా ఉన్నాడే.. అనాథ


అపర్ణ: ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవు ఎంటి నాన్నా..


 ఇందిర: నువ్వు వస్తావని ఎదురుచూస్తుంటే హఠాత్తుగా బిడ్డను ఎత్తుకుని వచ్చావేంటి? ఈ బిడ్డకు ఈ ఇంటికి సంబంధం ఏంటి?


అపర్ణ: చెప్పరా బిడ్డకు తల్లి లేదా? తండ్రి లేడా? చెప్పరా?


రాజ్‌: అందరూ అడిగారు నువ్వు అడగవా? నువ్వు అడిగినా అడగకపోయినా  నేను సమాధానం చెప్తాను. మరీ ముఖ్యంగా ఇది నీకే చెప్తాను. కాసేపట్లో ఈ వేదిక మీద వేడుక జరుగుతుందన్న ఆశతో నువ్వు ఎదురుచూస్తుంటావన్న విషయం నాకు తెలుసు. కానీ ఇదే వేదిక మీద నేనొక నిజాన్ని చెప్పబొతున్నాను. అది విని తట్టుకునే శక్తి నీలో ఉందని నమ్ముతున్నాను.


అంటూ రాజ్‌ ఆ బాబును చూపిస్తూ వీడు నా రక్తం.. దుగ్గిరాల వంశ వారసుడు అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. అపర్ణ రాజ్‌ను తిడుతుంది. మిగతావాళ్లు పెళ్లిరోజు ఫ్రాంక్‌ చేస్తున్నావా? అని అడుగుతారు. మేం ఎవ్వరం నువ్వు చెప్పేది నమ్మం అంటారు. దీంతో అబద్దాన్ని నిజం అని చెప్పలేని నేను నిజాన్ని కూడా అబద్దం అని చెప్పలేను అంటూ ఇది నిజం  ఈ బిడ్డ నా బిడ్డ  అంటాడు రాజ్‌. ఇక నుంచి ఈ ఇంటి వారసుడు అనడంతో అందరూ షాక్‌ అవుతారు. ఇందిరాదేవి వెళ్లి రాజ్‌ను తిడుతుంది.


రుద్రాణి: అదేంటమ్మా.. వాడు కచ్చితంగా నమ్మకంగా నిజమే అని చెబుతుంటే వాడు ఏ తప్పు చేయలేదని ఇంకా నమ్ముతావేంటి? ఇది ఎవరో చెప్పిన నిజం కాదు వాడే బయటపెట్టిన నిజం. ఏంటి వదిన అలా కొయ్యబారిపోయావు.  ఇన్నాళ్లు నా కొడుకుని నేను సరిగ్గా పెంచలేదని దుమ్మెత్తిపోశారుగా మరి నువ్వు నీ కొడుకుని ఎలా పెంచావు.


అపర్ణ: అరేయ్‌ విన్నావా?  మీ అత్త ఏమంటుందో విన్నావా? నా పెంపకం గురించి మాట్లాడుతుంది. ఈ అవకాశం ఇచ్చింది ఎవరు..? నీ తల్లిని ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? నువ్వు .. నన్ను మీ అమ్మను ఒక మరబొమ్మలా మార్చిపడేశావు. ఇలాంటి పాపిస్టి పని ఎలా చేయగలిగావు నీకు నీ భార్య గుర్తుకు రాలేదా?


సుభాష్‌: ఏం అడగమంటావు అపర్ణా.. అన్నీ తెలిసినవాడు ఇలాంటి పరిస్థితుల్లో దోషిగా నిలబడితే నిలదీసినంత మాత్రాన నిజం అబద్దం అవుతుందా? తల్లిగా నువ్వెలా ఓడిపోయావో.. తండ్రిగా నేను ఓడిపోయాను..


అందరూ రాజ్‌ను ప్రశ్నిస్తుంటారు. రాజ్‌ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. మాకెవ్వరికీ సమాధానం చెప్పకపోయినా నీ భార్యకు సమాధానం చెప్పు అని ఇందిరాదేవి అడగ్గానే నేనొక ప్రశ్నలా మారిపోయాను.. నా దగ్గర సమాధానం లేదు. అంటూ బాబును తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు రాజ్‌. కావ్య కూడా లోపలికి వెళ్తుంది.


కావ్య: ఇప్పుడు నేను ఏం చేయాలి. ఏడవాలా? సర్దుకుపోవాలా? బట్టలు సర్దుకునిపోవాలా? విడాకులు ఇచ్చి శాశ్వతంగా వెళ్లిపోవాలా?


రాజ్‌: ఏం చెప్పాలి. అడిగే స్థానంలో నువ్వున్నావు. చెప్పలేనంత దూరంలో నేనున్నాను.


అంటూ రాజ్‌ అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.


Also Read: బురద నీళ్లలో 'విశ్వంభర' భారీ ఫైట్ - మెగాస్టార్‌ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!