Brahmamudi Serial Today Episode: రాజ్ గతం మర్చిపోవడాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది యామిని. అయితే ఇలా చేయడం తప్పని తన తల్లిదండ్రులు చెప్పినా వినకుండా తన ప్రేమని మళ్లీ దక్కించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం అని చెప్తుంది. మరోవైపు హాస్పిటల్‌లోనే అపర్ణ ఏడుస్తూ ఉంటుంది.
ఇందిర: రాజ్ ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడు అపర్ణ నువ్వేం కంగారు పడొద్దు.
ప్రకాష్: మన అప్పు పోలీస్ డిపార్ట్మెంట్‌లోనే ఉంది కదా.. అప్పు ద్వారా స్పెషల్ పర్మిషన్ తీసుకుని మనం కూడా ఆ లోయలో వెతుకుదాం.
ధాన్యలక్ష్మీ : ఏవండి మన కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి వచ్చాడు. అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి వాడిలో వాడే కుమిలిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఏదో ఉందండి. వీళ్లు మనకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది.
అపర్ణ: ఏంట్రా ఏం ఉంది. ఇంకా నువ్వు చెప్పాల్సింది. మేము వినాల్సింది ఇంకా ఏమైనా ఉందా..?
కళ్యాణ్: పెద్దమ్మా అది..
అపర్ణ: మాట్లాడవేంట్రా.. అప్పు ఏం అయింది అమ్మా వెళ్లి ఏం తెలుసుకున్నారు. కావ్య చెప్పినట్టు ఈ షర్ట్ వల్ల వాడు చనిపోయాడని ఎలా అనుకోవాలి చెప్పు.
కనకం: అప్పు ఏమైందే చెప్పవే.. కావ్య ప్రాణాలతో ఉంది కదా.. మరి అల్లుడు గారు కూడా అదే కారులో ఉన్నారు కదా..? మరి ఎందుకు తను అక్కడ దొరకలేదు. మీ పోలీసులు వెళ్లి ఏం తెలుసుకున్నారు చెప్పవే.. ఇంకా మా అందరి గుండెల్లో చిచ్చు పెట్టు మాటలు ఉన్నాయా..?
అప్పు: అమ్మా ఏం చెప్పమంటావు.. బావ మన కుటుంబానికి దేవుడు.. ఆ దేవుడు ఉన్నాడని చెప్పనా..? అసలు లేడని చెప్పనా..? లేడమ్మా.. బావ ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయాడు.
అని చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. యామిని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి రాజ్ వస్తువులు అన్ని పోలీసులకు దొరికేలా చేశానని.. అందరూ రాజ్ చనిపోయాడని నమ్ముతున్నారని.. చెప్పి వెళ్లిపోతాడు.
వైదేహి: ఏంటమ్మా ఇదంతా..
యామిని: నా కథ నేనే రాసుకుంటున్నాను. రాజ్ జీవితంలో ఒక కొత్త ఆధ్యాయం మొదలుపెట్టబోతున్నాను. రాజ్ ఇప్పుడు రామ్ గా మారిపోతున్నాడు.
రాజ్ స్పృహలోకి వస్తాడు. యామిని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది.
యామిని: బావ నువ్వు మళ్లీ నాకు దక్కుతావని అనుకోలేదు. ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి తిండి నిద్ర మానేసి నేను ఇక్కడే ఉన్నాను.
రాజ్: ఎవరు నువ్వు…?
యామిని: ఎవరు నేనా.. నేను నీ యామినిని బావ..!
రాజ్: యామినియా..? నాకు తెలియదు
యామిని: అమ్మా నాన్న ఇటు రండి.. చూడండి బావ నన్ను గుర్తు పట్టడం లేదు. మీరైనా చెప్పండి.. సరిగ్గా చూడు బావ మా మమ్మీ, మా డాడీ కనీసం వీళ్లైనా గుర్తు న్నారా..? నీకు
రాజ్: లేదు నాకేం గుర్తు రావడం లేదు. అసలు నేను ఎవరు..? నా వాళ్లు ఎవరు…
యామిని: డాక్టర్.. డాక్టర్
డాక్టర్: మీరు కూల్ గా ఉండండి.. పేషెంట్‌ను డిస్టర్బ్ చేయోద్దు. అతన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి.
అని చెప్పి డాక్టర్ వెళ్లిపోగానే.. వైదేహి, యామిని పక్కకు తీసుకెళ్లి నువ్విలా చేయడం కరెక్టు కాదు మాకు నచ్చడం లేదు. నిజం చెప్పేస్తాము అంటుంది. అయితే యామిని కోపంగా రాజ్ నాకు కావాలి. అందుకోసం ఏం చేయడానికైనా నేను సిద్దం. అంతే కానీ మీరు నిజం చెబితే నేను మళ్లీ డ్రగ్స్ తీసుకుంటాను. అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో వైదేహి సైలెంట్‌గా వెళ్లి రిసెప్షన్‌లో కూర్చుంటుంది. అక్కడే ఏడుస్తూ కనకం ఉంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకుని మాట్లాడుకుంటారు. ఇంతలో కావ్యకు స్పృహ వస్తుంది. రాజ్ ఎక్కడని అడుగుతుంది. అందరూ నా దగ్గర ఎందుకున్నారని ఆయన్ని వెతకండని చెప్తుంది. అప్పును తిడుతుంది. దీంతో అపర్ణ ఏడుస్తూ.. రాజ్ ఎక్కడున్నాడో తెలియడం లేదని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!