Brahmamudi Serial Today Episode:  మనం మన వాళ్లకు సపోర్టుగా ఉన్నట్టు నటిద్దాం మమ్మీ అని రాహుల్‌ చెప్పగానే.. రుద్రాణి సరే అంటూ వెళ్లి పక్కనే కూర్చుంటుంది. ఎవ్వరూ కూడా ఎందుకని పెళ్లి చెడగొట్టేందుకు ఏమీ చేయడం లేదని అడుగుతుంది.

ఇందిరాదేవి: నువ్వు కూడా  ఆ ఇంటి నుంచే వచ్చావు కదా నువ్వెందుకు ఆపడానికి ప్రయత్నించడం లేదు

రుద్రాణి: నాకంత బలం, బలగం లేదు. ఒకవేళ ఉంటే నా కొడుకును ఎప్పుడో ప్రయోజకుణ్ని చేసేదాన్ని

అపర్ణ: ఈ ఒక్క విషయం కరెక్టగా చెప్పావు రుద్రాణి

రుద్రాణి: అయితే కావ్య కూడా ఎందుకు ఏ ఉలుకు పలుకు లేకుండా హ్యాపీగా కూర్చుని పెళ్లి చూస్తుంది. అసలు అక్కడ జరుగుతుంది నీ మొగుడు పెళ్లేనా..? లేక ఆ యామిని చెప్పిన కట్టుకథను నిజం చేయాలనుకుంటున్నావా కావ్య.. రాజ్‌కు న్యాయం చేసేవాళ్లు ఎవరు..? ఈ పెళ్లి ఆపేవాళ్లు ఎవరు..?

కావ్య:  అసలు నాకు పెళ్లి ఆపాలనే ఉద్దేశమే లేదు రుద్రాణి గారు

అందరూ షాక్‌ అవుతారు. రాహుల్ మరింత షాకింగ్ గా..

రాహల్‌:  మమ్మీ కావ్య చెప్పింది నిజమేనా లేక నాకు అలా వినిపించిందా..?

కావ్య:  నేను నిజమే చెప్తున్నాను రాహుల్‌.. మీరు కంగారుపడకండి నేను ఈ పెళ్లిని అస్సలు ఆపను. కానీ ఈ పెళ్లి జరగదు.

రుద్రాణి: అసలు ఏమంటున్నావు కావ్య పెళ్లి ఆపను.. అంటున్నావు.. పెళ్లి జరగదు అంటున్నావు అసలు ఏం జరుగుతుంది కావ్య

అంటూ రుద్రాణి అడగ్గానే కావ్య స్టోరీ చెప్తుంది. రుద్రాణి వినలేక వెళ్లిపోతుంటే.. పట్టుబట్టీ మరీ చెప్తుంది. ఇంతలో కళ్యాణ్‌, అప్పుకు సైగ చేస్తాడు. ఇద్దరూ కలిసి బటయకు వెళ్తారు.

పంతులు: అమ్మా ఈ అక్షింతలు పంచాలి ఎవరైనా ఇటు రండి

అపర్ణ: అత్తయ్యా అక్షింతలు కూడా పంచుతున్నారు. ఈ అప్పు ఎక్కడికి వెళ్లింది.

పంతులు: బాబు ఇక మాంగళ్య ధారణ కానివ్వండి

రాజ్‌ తాళి పట్టుకుని కావ్యను చూస్తుంటాడు. అపర్ణ, ఇంద్రాదేవి, కనకం ఎమెషనల్‌ గా చూస్తుంటారు. రాజ్‌ లేచి తాళి కట్టబోతుంటే.. పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులను రుద్రాణి చూస్తుంది.

రుద్రాణి: అదిగోరా రాహుల్‌  పోలీసులు వచ్చారు

రాహుల్‌: ఇంకేంటి మమ్మీ లేచి మన వాళ్లకు సఫోర్ట్‌ చేస్తున్నట్టుగా నీ యాక్టింగ్‌ స్టార్ట్‌ చేయ్‌

రుద్రాణి: ( గట్టిగా) ఆపండి.. పెళ్లి ఆపండి..

పంతులు: అవ్వదు ఈ పెళ్లి ఇక అవ్వదు.. ఈ పెళ్లి ఆపడానికి ఇప్పటి వరకు కనకమే ఉందనుకున్నా..? ఇప్పుడు కొత్త క్యారెక్టర్‌ వచ్చింది.

అపర్ణ: ఇదేంటి అత్తయ్యా మనం చెప్పాల్సిన డైలాగు రుద్రాణి చెప్పింది ఏంటి..?

ఇందిరాదేవి: నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ

వైదేహి:  ఏమైంది అపర్ణ ఎందుకు ఆపాలి..?

రుద్రాణి: పెళ్లి మండపం అంటే ముత్తైదువులు రావాలి కానీ ఇలా పోలీసులు ఎందుకు వస్తున్నారు..?

అంటూ రుద్రాణి అడుగుతుండగానే పోలీసులు పెళ్లి మండపం దగ్గరకు వస్తారు. ఎందుకు వచ్చారని వైదేహి అడగ్గానే యామిని చేసిన క్రైమ్‌ గురించి చెప్పి అరెస్ట్‌ చేస్తున్నామంటారు. అప్పు రౌడీని  లోపలికి పిలిపించి యామిని గురించి నిజం చెప్పమంటుంది. రౌడీ ఏ యామిని అంటూ ఎదురు తిరుగుతాడు. తనకు ఎవ్వరూ తెలియదని ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదని అంటాడు. అయితే తన దగ్గర వీడియో ఉందని అప్పు తన ఫోన్‌ ఓపెన్‌ చేసి చూస్తుంది. అందులో వీడియో డిలీట్‌ అయి ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి రాహుల్‌, అప్పు రూంలోకి వెళ్లి ఫోన్‌ లో వీడియో డిలీస్‌ చేసి ఉంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!