Ammayi garu Serial Today Episode బంటీ తాత సూర్యప్రతాప్‌లా డ్రస్‌ వేడుకొని కళ్లద్దాలు పెట్టుకొని వస్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. రాజు బంటీ అని పిలవగానే నా పేరు బంటీ కాదు సూర్యప్రతాప్‌దేవ్ అని అంటాడు. విరూపాక్షి, రూప నవ్వుకుంటారు. సూర్యప్రతాప్‌ బంటీతో అవునా సూర్యప్రతాప్‌గారు నిల్చొన్నారు ఏంటి వచ్చి కూర్చొండి అంటాడు. బంటీ కూర్చొంటాడు. 

చంద్రతో చంద్ర ఈ మధ్య నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు అంటాడు. చంద్ర బంటితో సారీ అన్నయ్య అంటాడు. బంటీ చంద్రతో నేను అడిగింది సారీ కాదు గుడ్ మార్నింగ్.. వెళ్లి కూర్చొ అంటాడు. అమ్మా  సుమ అంటే గుడ్ మార్నింగ్ బావగారు అంటే నేను అడిగింది గుడ్ మార్నింగ్ కాదు కాఫీ అమ్మ తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. సుమ సరే బావగారు అని వెళ్తుంది. ఇక రాజుతో ఏరా రాజు ఆ పేపర్ ఇవ్వు అంటాడు. ఇక సుమతో ఇంతకీ తను నిద్ర లేచిందా సుమ అంటాడు. ఏమైందా తినిందా..అల్లర చేస్తుందా.. ఏదీ కనిపించడం లేదు అని బంటీ అంటే ఇక్కడున్నా నాన్న అని రుక్మిణి అంటుంది. దాంతో బంటీ సూర్యప్రతాప్‌లా అరిచి నిన్ను కాదు బేబీని అంటాడు. సూర్యప్రతాప్‌ బేబీ అని పిలుస్తాడు. కుక్క వస్తుంది. 

రుక్మిణి ఎమోషనల్ అవుతూ అంటే మీరు పిలిచింది కుక్కనా నాన్న నన్ను కాదా.. లేచిందా తినిందా అల్లరి చేస్తుందా అని అంత ప్రేమగా అడుగుతుంటే నా గురించి ఏమో అనుకున్నా.. మీ మనసులో కనీసం కుక్కకి ఉన్న విలువ కూడా నాకు లేదా నాన్న అని రుక్మిణి అడుగుతుంది. సూర్యప్రతాప్‌ రూప గతంలో తనని ప్రశ్నించినట్లు గుర్తు చేసుకుంటాడు. జూనియర్ సూర్యప్రతాప్‌ పొలమారితే రుక్మిణి నీరు తీసుకొస్తుంది. గతంలో రూప సూర్యప్రతాప్‌కి ఇస్తే సూర్యప్రతాప్‌ నీటిని విసిరి కొట్టినట్లు జూనియర్ సూర్యప్రతాప్‌ గ్లాస్ విసిరేసి నీకు ఎన్ని సార్లు చెప్పాలి నాకు ఎదురుగా రావొద్దు అని అంటూ అరుస్తాడు. సూర్యప్రతాప్‌ గతంలో రూపతో తాను ఎలా కోప్పడ్డాడో గుర్తు చేసుకుంటారు. అందరూ ఆ సీన్ తలచుకొని బాధ పడతారు. 

విజయాంబిక దీపక్‌తో వేస్తే గెటప్ వేశాడు కానీ వీళ్లకి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. ఆ గెటప్‌లో ఉన్న పవర్ అలాంటిది అంటుంది. జూ. సూర్యప్రతాప్‌ కాళ్లకి దండం పెట్టాలని రుక్మిణి అనుకుంటే లాగి పెట్టి కొడతాడు. సూర్యప్రతాప్‌ షాక్ అయిపోతారు. గతంలో రూపని సూర్యప్రతాప్‌ కొట్టడం గుర్తు చేసుకుంటాడు. ఇక దీపక్‌ని ఓరేయ్ దీపక్ ఏంట్రా పిలుస్తుంటే అలా అడ్డ గాడిదలా చూస్తున్నాడు రా ఇటు అని అంటాడు. మీ మామయ్య గెటప్లో ఉన్నాడు కదా వెళ్లు అని విజయాంబిక అంటుంది. దీపక్ వెళ్లి చెప్పండి మామయ్య అంటే మందారం విషయంలో నువ్వు చేసిన తప్పు నాకు తెలుసు నీ తప్పు తెలుసుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది లేదంటే నీ జీవితమే జైలు అవుతుంది.. చూసింది చాల్లే వెళ్లు అంటాడు. 

రూపకి సూర్యప్రతాప్‌ పెళ్లి సంబంధం తెచ్చినట్లు రూప, రాజులు పెళ్లి చేసుకోవడం.. సూర్యప్రతాప్‌ కోప్పడటం.. రాజుని సూర్యప్రతాప్‌ గన్‌ గురి పెట్టడం రూప రాజుని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోవడం ఇలా గతం మొత్తం కళ్ల ముందు కనిపించేలా చేస్తాడు. తర్వాత రుక్మిణితో అమ్మా రూప నువ్వు ఉన్నంత కాలం నీ మీద అసహ్యించుకోవడం నిన్ను కోప్పడం దూరం పెట్టడమే జరిగింది.. నువ్వు నా నుంచి కోరుకున్న ప్రేమ నీకు పంచలేకపోయాను.. నువ్వు కోరుకున్న ప్రేమ గెలిపించలేకపోయాను.. నన్ను క్షమించమ్మా.. నేను చేసిన అన్ని తప్పులు సరిదిద్దుకోవాలి అంటే ఇప్పుడు అందరి ముందు నీకు రాజుకి పెళ్లి జరిపిస్తాను అంటాడు. మీ ఇష్టం నాన్న అని రూప జూ. సూర్యప్రతాప్‌తో చెప్తుంది. రాజుని అడిగితే మీరు ఆర్డర్ చేయాలి కానీ అనుమతి కోరకూడదు పెద్దయ్యగారు అంటాడు.  జూ. సూర్యప్రతాప్ సుమతో రాజుకి పసుపు తాడు ఇవ్వు అని అంటాడు. సుమ ఇదిగో రాజు అని అంటే రాజు తన చేతిలో పసుపు తాడు ఉన్నట్లు ఊహించుకొని రుక్మిణికి తాళి కట్టడానికి వెళ్తాడు. ఇంతలో విజయాంబిక ఆపి నీకు కీర్తికి పెళ్లి ఫిక్స్ అయింది అని అంటే జూ. సూర్యప్రతాప్‌ ఆపి నీ మాటలు వినే నా కూతుర్ని ఇబ్బంది పెట్టా ఇప్పుడు నువ్వు మా విషయాల్లో జోక్యం చేసుకుంటే చంపేస్తా అంటాడు. సూర్యప్రతాప్‌ మనసులో నువ్వు గ్రేట్‌రా బంటీ నా మనసులో ఉన్నది నువ్వు చేశావ్ కానీ నేను ఇప్పుడు ఏం చేయలేను అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి జైలులో చిత్రహింసలు.. సూపర్ ఉమెన్‌తో అంబిక 60 లక్షల డీల్!