Brahmamudi Serial Today Episode:  తెల్లారితే పెళ్లి అనగా రాజ్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. కావ్యను పక్కకు తీసుకెళ్లి తనకు ఇష్టమైన వ్యక్తి దూరం అవుతుందంటే బాధను తట్టుకోలేకపోతున్నానని మీకు అలాగే ఉందా అని అడుగుతాడు. దీంతో తనకెందుకు అలా ఉంటుందని ఈ టైంలో నన్ను ఇలా తీసుకొచ్చి మాట్లాడటం సరికాదు. ముందు మీకేం కావాలో క్లారిటీగా ఆలోచించుకోండి అంటూ కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంటారు కనకం, అపర్ణ, ఇందిరాదేవి వాళ్లను దూరం నుంచి గమనించిన రాహుల్‌, రుద్రాణి వీళ్లు ఏం చేయబోతున్నారో చూద్దాం అని చాటుగా నిలబడి చూస్తుంటారు. ఇంతలో అప్పు, కళ్యాణ్, స్వప్న వస్తారు.

ఇందిరాదేవి: ఏంట్రా మనవడా వెళ్లిన పని ఏమైంది

కళ్యాణ్‌: సక్సెస్‌ అయింది నాన్నమ్మ

అపర్ణ: ఏంటి కళ్యాణ్‌ నువ్వు చెప్పేది నిజమా

కళ్యాణ్‌: అబద్దం నేనెందుకు చెప్తాను పెద్దమ్మ.. ఆ యామిని రౌడీకి డబ్బులు ఇస్తున్నప్పుడు సాక్ష్యం దొరికింది

స్వప్న: అంతే కాదు అమ్మమ్మ గారు ఆ సాక్ష్యాన్ని కళ్యాణ్‌ తన ఫోన్‌లో వీడియో కూడా తీశాడు. కళ్యాణ్‌ ఆ వీడియో చూపించు

కళ్యాణ్‌ వీడియో చూపిస్తాడు.

అప్పు: ఇంక ఈ సాక్ష్యంతో ఆ యామిని పీడ వదిలిపోతుంది అమ్మమ్మ గారు అరెస్ట్‌ చేసి లోపల వేశామంటే జీవితాంతం జైళ్లోనే చస్తుంది

రాహుల్‌, రుద్రాణి షాక్‌ అవుతారు.

రాహుల్‌: అంతా అయిపోయింది మమ్మీ ఎవరికి దొరకకూడదో వాళ్లకే దొరికింది. ఆ అప్పుకు ఏ సాక్ష్యం దొరకకపోతేనే విడిచిపెట్టదు. ఇంత సాలీడ్‌ సాక్ష్యం దొరికితే ఇక విడిచిపెడుతుందా..? అసలు విడిచిపెట్టదు

రుద్రాణి: విడిచిపెడుతుందో పట్టుకుంటుందో తర్వాత వెంటనే వెళ్లి ఈ విషయం యామినికి చెప్పాలి పద వెళ్దాం

రాహుల్, రుద్రాణి యామిని దగ్గరకు వెళ్లిపోతారు.

కనకం: వెంటనే వెళ్లి ఆ యామినిని అరెస్ట్‌ చేసి తీసుకెళ్లవే అప్పు

అప్పు: అంత తొందరగా అరెస్ట్‌ చేయడం కుదరదు దానికో ప్రొసీజర్‌ ఉంటుంది. రేపు పొద్దున్న అరెస్ట్‌ చేస్తాను.

అని చెప్తుంది. ఇక రాహుల్‌, రుద్రాణి.. యామిని దగ్గరకు వెళ్లి నిజం చెప్తారు.

రుద్రాణి: ఇప్పుడు ఏం చేద్దాం యామిని..

యామిని: ఏమీ చేయోద్దు.. మీరు ఏమీ విననట్టు తెలియనట్టే ఉండండి

రాహుల్‌: అలా ఉంటే వాళ్లు పెళ్లి ఆపేస్తారు కదా యామిని

యామిని: వాళ్లు ఆపరు. ఆపనివ్వను.. కానీ వాళ్లకు మాత్రం నిజం మనకు తెలిసినట్టు వాళ్లకు తెలియకూడదు

అని చెప్పగానే రాహుల్‌, రుద్రాణి సరే అంటారు. కావ్య దగ్గరుండి మరీ పెళ్లి పనులు చేయిస్తుంది. ఇంతలో కావ్య దగ్గరకు యామని వాళ్ల డాడీ వస్తాడు. దయచేసి ఈ పెళ్లి ఆపోద్దని వేడుకుంటాడు. నా కూతురును చిన్నప్పటి నుంచి అతి గారాబంగా పెంచానని చెప్తాడు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే నా కూతురు సూసైడ్‌ చేసుకుంటుందని బాధపడతాడు. అయితే కావ్య తాను ఈ పెళ్లి ఆపనని ఆ దేవుడే ఈ పెళ్లి ఆపేస్తాడని చెప్పి వెళ్లిపోతుంది. రాజ్‌ రూంలో ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే దుగ్గిరాల ఫ్యామిలీ వస్తుంది. అసలు కావ్య తనను ప్రేమిస్తుందా అని వాళ్లను రాజ్‌ నిలదీస్తాడు. తనను అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదని బాధపడతాడు. ఇంతలో పంతులు పిలుస్తున్నాడని రాజ్‌ను ఒక వ్యక్తి తీసుకెళ్తాడు. రాజ్‌, యామిని పెళ్లి పీటల మీద కూర్చుని ఉంటారు. పంతులు మంత్రాలు చదువుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!