Brahmamudi Serial Today Episode:  గార్డెన్‌లో కూర్చున్న అపర్ణ దగ్గరకు సుభాష్‌ వెళ్లి మాట్లాడబోతే అపర్ణ కోపంగా తిడుతుంది. మీ ముఖం చూడలేనని చెప్పి వెళ్లిపోతుంటే సుభాష్‌ బాధపడుతూ నేను బలహీన క్షణంలో తప్పు చేశాను. కానీ అవతలి వ్యక్తి నన్ను మాయలో పడేసింది. ఇంతలోనే జరగాల్సిన తప్పు జరిగిపోయింది అంటూ ఏడుస్తూ సుభాస్‌ చెప్తూ.. రాజ్‌ నన్ను సేవ్‌ చేయడం కోసం తప్పులు తన మీద వేసుకున్నాడు కానీ ఇప్పుడు నువ్వు ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను అంటాడు సుభాష్. ఇంతలో పైనుంచి బాబు ఏడుపు వినిపిస్తుంది. దీంతో అపర్ణ కోపంగా వెళ్లిపోతుంది. తర్వాత కావ్య గార్డెన్‌లో ఆలోచిస్తుంటే అప్పు వస్తుంది.


కావ్య: ఇదేంటి ఇంత ఉదయాన్నే అప్పు ఇక్కడికి వచ్చింది. ఏయ్‌ నువ్వేంటే ఇక్కడ..


అప్పు: నువ్వు రా అక్క చెప్తాను.


కావ్య: ఏమైంది అప్పు ఏంటి ఇంత సడెన్‌గా వచ్చావు. కనీసం కాల్‌ కూడా చేయలేదు.


అప్పు: మీ ఇంట్లో గోడలకే కాదు ఫోన్లకు చూడా చెవులున్నాయి. అందుకే నేరుగా వచ్చి చెప్పాలనుకున్నాను.


కావ్య: అంత ముఖ్యమైన విషయం ఏంటి?


అప్పు: ఆ వరిజినల్‌ మాయ కోమాలోంచి బయటకు వచ్చిందట. ఇందాకే డాక్టర్‌ ఫోన్‌ చేసి చెప్పారు.


కావ్య: ఏంటి నువ్వు చెప్పేది నిజమా?


అప్పు: ఊ కాదు జోక్‌ చేశాను. కాసేపు నవ్వుకుని లోపలికి వెళ్లు నేను వెళ్లిపోతాను. లేకపోతే ఏంటి ఇంపార్టెంట్‌ విషయం అనే కదా ఇంతదూరం వచ్చాను.


 అనడంతో కావ్య హ్యాపీగా ఫీలవుతూ వెంటనే వెళ్దాం పద అంటూ వెళ్లబోతుంటే దూరం నుంచి మొత్తం విన్న కళ్యాణ్‌. చాలా బాగుంది వదిన అంటూ వస్తాడు. నేను మాత్రం అన్ని విషయాలు మీకు చెప్పాలి. మీరు మాత్రం నాకు ఏ విషయం చెప్పడం లేదు అంటూ బాధపడగానే అదేం లేదని కావ్య చెప్పగానే నేను హాస్పిటల్ కు వస్తానని కళ్యాణ్‌ కూడా వాళ్లతో పాటు హాస్పిటల్‌కు వెళ్తాడు.  మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న మాయ కోమాలొంచి వచ్చిందని ఎవరో ఫోన్‌ చేసి రుద్రాణికి చెప్పడంతో మాయను కిడ్నాప్‌ చేయమని రాహుల్‌ కు చెప్తుంది రుద్రాణి. సరేనని రాహుల్‌ వెళ్తాడు. హాస్పిటల్‌ లో మాయ దగ్గరకు ఇద్దరు రౌడీలు వచ్చి కావ్య మేడం తీసుకు రమ్మాన్నారని చెప్పి తీసుకెళ్తారు. హాస్పిటల్‌కు వచ్చిన కావ్య, అప్పు, కళ్యాణ్‌ మాయ లేకపోవడం చూసి షాక్‌ అవుతారు. డాక్టర్‌ ను అడిగితే మీరు ఫోన్‌ చేసి చెబితేనే డిశ్చార్జ్‌ చేశామని ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు చెప్పారని తీసుకెళ్లారు అనగానే కావ్య షాక్‌ అవుతుంది.  వెంటనే బయటకు వెళ్లి కిడ్నాపర్ల కార్లను ఫాలో అవుతారు. మరోవైపు అపర్ణకు టాబ్లెట్స్‌ ఇస్తాడు రాజ్.


రాజ్: ఒక్కమాట అడుగుతాను చెప్తావా? మమ్మీ..


అపర్ణ: నువ్వు నన్ను ఎమి అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేనేమీ అడక్కూడదు అనుకుంటున్నావో నీకు తెలుసు.


రాజ్: అయినా తప్పడం లేదు మమ్మీ.. ఈ ఇల్లు ఇల్లులా లేదు. ఈ కుటుంబం అంతా స్థబ్దుగా మారింది. ఇంతకు ముందలా లేదు.


అపర్ణ: వీటన్నింటికీ కారణం నీకు తెలుసు? మళ్లీ నాచేత చెప్పించాలనా?


రాజ్‌: ఒక మనిషిని ధ్వేషించినంత కాలం మనకు మనఃశాంతి ఉండదు మమ్మీ. ఒక్కసారి క్షమించి చూడు మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంత చిన్న జీవితంలో కోపాలు తాపాలు పెట్టుకుంటే ఏం సాధిస్తాం చెప్పు.


 అనగానే అపర్ణ ఏడుస్తూ నువ్వు నా కడుపున పుట్టినా.. నేనే నీ నుంచి ఏంతో నేర్చుకోవాలి. నేను నీకు వేసిన శిక్షలో సగభాగం నీ భార్యకు పడింది. కానీ ఇద్దరూ ఎక్కడా తొణకలేదు. అంటూ బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఈ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టకుంటే అదృష్టం కలిసి వస్తుందా? ఏ దిక్కున పెట్టాలి?