Seethe Ramudi Katnam Today Episode సీత ఇంట్లో మహాలక్ష్మి, సుమతి ఉన్న ఫొటో చూపించి రచ్చ చేస్తుంది. మహాలక్ష్మి వస్తే నిజం తెలుస్తుందని అందరూ అంటారు. రామ్ తన పిన్నితో నిజం చెప్పిస్తాను అని అంటాడు. ఇంతలో మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. అందరూ సుమతి ఫొటోని సీక్రెట్‌గా దాయడం వెనక రహస్యం ఏంటని నిలదీస్తారు. దానికి మహాలక్ష్మి తాను ఏం చేసినా ఓ కారణం ఉంటుందని చెప్తుంది. గిఫ్ట్ ఫ్యాక్ చేసిన ఓ కవర్‌ని రామ్‌కి ఇచ్చి చూడమని చెప్తుంది. రామ్ చూడగా అందులో సుమతి ఫొటో ప్రేమ్ ఉంటుంది. రామ్ చాలా సంతోషిస్తాడు. అందరికీ చూపిస్తాడు. రామ్, జనార్థన్ బాధ పడటం చూడలేక తన దగ్గర ఉన్న ఒక్క ఫొటో ఇలా చేశానని చెప్తుంది. ఇంత సడెన్‌గా ఫొటో తేవడం వెనక ఏదో రహస్యం ఉందని సీత అంటుంది. ఏదో తప్పు చేస్తున్నారు అని అంటుంది. 


మహాలక్ష్మి: మీ అందరికీ ఈ కొత్త ఫొటో గురించి అనుమానాలు ఉన్నాయా. ఈ ఫొటో ఇప్పుడే ఎందుకు తెచ్చాను అంటే రేపు సుమతి వర్ధంతి కాబట్టి. రేపు వర్ధంతి కార్యక్రమం జరిపించాలి అనుకున్నాను. మీకు తర్వాత చెప్పాలి అనుకున్నా ఇంతలో సీత ఇలా తప్పుగా మీతో చెప్పింది. 
విద్యాదేవి: బతికి ఉన్న నాకు వర్థంతి చేయాలి అనుకుంటావా మహాలక్ష్మి. 
రామ్: మీరు నిజంగా చాలా గ్రేట్ పిన్ని. అమ్మ వర్థంతి గుర్తు పెట్టుకొని చేస్తున్నారు.
జనార్థన్: సారీ మహా సీత మాటలు విని నీ గురించి ఏదో అనుకున్నాను.
ప్రీతి: ఇంకోసారి మా పిన్నిని ఏమైనా అన్నావు అంటే ఊరుకునేది లేదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.
మహాలక్ష్మి: ఇప్పటి కైనా నా మంచి తనం అర్థమైందా సీత. ఆవేశంతో నా దగ్గర ఉన్న ఫొటో లాక్కొచ్చావ్. కానీ నేను ఏం చేశానో నీకు తెలీదు. నీ దగ్గర ఉన్న ఆ ఫొటోలోని సుమతి ఫొటో సపరేట్ చేసి ఫ్రేమ్ కట్టించా. రేపు అందరం ఈ ఫొటోకి దండలు వేసి వర్థంతి కార్యక్రమం చేసుకుందాం.
విద్యాదేవి: ఒకసారి నన్ను చంపించి నా ఫొటోకి దండ వేశావ్. ఇప్పుడు నీ ముందే బతికి తిరుగుతున్న నాకు మళ్లీ దండ వేయాలి అనుకుంటున్నావ్. నీ పాపం పండే రోజు దగ్గర్లేనే ఉంది.


సీత మహాలక్ష్మి వెళ్లిపోతుంటే ఎవరూ లేని దగ్గర ఆపి మాట్లాడుతుంది. అందరి ముందు మీరే గెలిచారు అనుకున్నారు కానీ గెలిచింది నేను అని సీత అంటుంది. ఇంట్లో సుమతి అత్తమ్మకు సంబంధించిన ఒక్క ఫొటో లేదు అని మీ చేతులతో ఫొటో కాల్చేశారు అని అనుమాన పడ్డానో అదే చేతులతోనే ఫొటో తీసుకొచ్చి పెట్టారు అని మీకు మీరే ఇంట్లో ఫొటో పెట్టి అందరూ రోజూ చూస్తూ సుమతి అత్తమ్మ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటారు అని గెలిచింది నేనే అని సీత అంటుంది. సీత మాటలకు మహాలక్ష్మి రగిలిపోతుంది. 


మహాలక్ష్మి: ఆ సీత నాకు మనస్శాంతి లేకుండా చేస్తుంది.    ఒక స్పైలా నన్ను వెంటాడుతుంది. ఆ సుమతి బతికే ఉంది కదా అని సుమతి గురించి వెతికిద్దామని దాని ఫొటో కోసం వెతికితే ఆ పాత ఫొటో కనిపించింది. అప్పుడే ఆ సీత అది చూసి నా వెంట పడింది. నేను ఒకడికి సుమతి ఫొటో ఎంక్వైరీ చేయమని చెప్పాను. అది సీత చాటుగా చూసింది. నన్ను నమ్మించి కారులో నుంచి నడి రోడ్డు మీద దింపేసింది.
అర్చన: ఇందాక సీత అలా చెప్తే నువ్వు దొరికిపోయావు అనుకున్నా మహా కానీ సుమతి ఫొటో తెచ్చి భలే ట్విస్ట్ ఇచ్చావ్. 
మహాలక్ష్మీ: ఆ ఫొటో విషయంలో సీత నాకు మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది. నా టైం బాగుండి రేపు సుమతి వర్థంతి అని కవర్ చేశాను.
అర్చన: కానీ సుమతి చనిపోలేదు కదా వర్థంతి ఎలా చేస్తాం.
మహాలక్ష్మి: సుమతి బతికే ఉంది అని నీకు నాకు మాత్రమే తెలుసు మరెవరికీ తెలీదు. 
అర్చన: ఇంట్లో ఉన్న విద్యాదేవి వల్ల కూడా ఇబ్బందిగా ఉంది మహా. తనని కూడా పంపించేయాలి.
మహాలక్ష్మి: వీలైనంత తొందరగా సీత, విద్యాదేవిలను ఇంటి నుంచి పంపేయాలి. సుమతిని వెతకాలి. రామ్‌ని మధుని కలపాలి.


మధు ఆరు బయట బట్టలు మడతపెడుతుంటే తన ఫ్రెండ్స్ ఇంటికి వస్తారు. ఇక్కడ ఉన్నావు ఏంటి నువ్వు సిటీలో ఉండాలి కదా ఇది ఇలాంటి చిన్న ఇంటిలో ఉన్నావు ఇది మీ బంధువుల ఇళ్లా అని అడుగుతారు. జలజ తన భర్త బయటకు వచ్చి ఇది మధు అత్తారిళ్లు అని సూర్య తన భర్త అని చెప్తారు. సూర్యని చూసి ఈయన తన భర్త ఏంటి మధు భర్త పేరు రామ్‌ అని తను చాలా అందంగా ఉంటాడు, ఆస్తి బాగా ఉందని రామ్‌ని పొగుడుతారు. సూర్య రగిలిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.   


Also Read: 'త్రినయని' సీరియల్: గుమ్మడికాయతో తిలోత్తమకు ముప్పుతిప్పలు.. చేతి రహస్యాన్ని విశాలాక్షి బయట పెడుతుందా!