Brahmamudi Serial Today Episode: నీ చెల్లి అప్పును ఇచ్చి కళ్యాణ్‌కు పెళ్లి చేయాలని నువ్వు ప్లాన్‌ చేశావు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నావు అంటూ కావ్యను తిడుతుంది ధాన్యలక్ష్మీ. దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. కావ్య కూడా ధాన్యలక్ష్మీని గడ్డిపోచలా తీసిపారేస్తుంది. మేము ఇప్పుడు మా పుట్టినింటి నుండే వస్తున్నామని.. అక్కడ అప్పుకు సంబంధం చూశామని పెళ్లి కూడా పదిహేను రోజులో జరగబోతుందని కావ్య చెప్పగానే ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతుంది. అయితే నువ్వు నిజంగా మీ చెల్లిని కళ్యాణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకోకపోతే వేరే పెళ్లికి కళ్యాణ్‌ను ఒప్పించమని ధాన్యలక్ష్మీ, కావ్యకు చెప్తుంది.

అపర్ణ: నువ్వు నిజంగా కళ్యాణ్‌ శ్రేయస్సు కోరుకునే దానివే అయితే వాణ్ని ఈ సమయంలో ఇలా ఇబ్బంది పెట్టవు.

ధాన్యలక్ష్మీ: అక్క నీ కొడలు ఎంత చెప్తే అంత అన్నట్లు ఉన్నాడు నా కొడుకు. నిజంగా కావ్య మనసులో ఆ ఉద్యేశం లేకపోతే తనే ఈ పెళ్లికి ఒప్పిస్తుంది. ఒప్పించలేదని చూస్తే అప్పుతో పెళ్లి చేయాలని చూస్తుందని అనుకోవాల్సి వస్తుంది.

   అని ధాన్యలక్ష్మీ చెప్పగానే కావ్య సరే అంటుంది. మీరు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమని కవిగారిని నేను ఒప్పిస్తానని చెప్తుంది కావ్య. మరోవైపు అప్పు, కళ్యాణ్‌ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. నువ్వు ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నావా? అని కళ్యాణ్‌, అప్పును అడుగుతాడు. అవునని చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ బాధగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్‌ కోపంగా కావ్య దగ్గరకు వస్తాడు.

రాజ్‌: నేను విన్నది నిజమేనా?

కావ్య: నిజమే

రాజ్‌: ఎం విన్నానో అడగవా?

కావ్య: ఏం విన్నారో చెప్పరా?

రాజ్‌: మరి నిజమే అని ఎందుకు అన్నావు..?

కావ్య: సరే అయితే మీరు విన్నది అబద్దమే.. ఇప్పుడు ఏం విన్నారో చెప్పండి. నిజమేంటో నేను చెప్తాను.

రాజ్: ఇంట్లో వాళ్లు అంతా కలిసి కళ్యాణ్‌కు పెళ్లి చేయాలనుకుంటున్నారా?

కావ్య: అబద్దం ఇంట్లో వాళ్లు అంతా అనుకోలేదు. మీ పిన్ని గారు మాత్రమే అనుకున్నారు.

రాజ్: దానికి నువ్వేమన్నావు.

కావ్య: ఇన్ఫర్మేషన్‌ ఇచ్చిన వాళ్లు నీకు పూర్తిగా చెప్పలేదా?

   అని ఇద్దరూ మాట్లాడుకుంటారు. ధాన్యలక్ష్మీ తనని తిట్టిందని.. కవి గారు ఉన్న పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు అంటే అప్పును కళ్యాణ్‌ కు ఇచ్చి చేస్తున్నావని తనని తిట్టారని చెబుతుంది కావ్య. అయితే కళ్యాణ్‌, అప్పును ప్రేమిస్తున్నాడని రాజ్‌ చెప్పడంతో కావ్య షాక్‌ అవుతుంది. దీంతో మీరు కూడా అనామికలా మాట్లాడుతున్నారా? అప్పుకు వచ్చే వారమే పెళ్లి అని చెప్తుంది. కావ్య.

రాజ్: అనామిక వల్ల వాడు మెంటల్‌గా డిస్టర్బ్‌ అయ్యాడు. ఇప్పుడు అప్పు కూడా దూరమైతే వాడు మనకు దక్కడు.

కావ్య: మీరు అనుకున్నంతగా ఏం జరగదండి. అప్పు మీద కవిగారికి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు.

రాజ్‌: ఉంది. అది నాకు అర్థం అయ్యింది కాబట్టే నేను ఇంత గొడవ చేస్తున్నాను. ఇంత టెన్షన్‌ పడుతున్నాను.

కావ్య: మీరు డైరెక్టుగా అడిగారా?  

రాజ్: లేదు. అడగలేదు.

కావ్య: మరి మీకు మీరే అనుకుంటే ఎలా?

రాజ్‌: నాకు అర్థమైంది.

కావ్య: నాకు అర్థం కాలేదు.

రాజ్‌: ఇప్పుడు ఏం చేద్దాం.

కావ్య: నన్ను అడిగితే నేనేం చేయను.

రాజ్‌: ఖాయం చేసుకునే ముందు ఒక మాట చెప్పొచ్చు కదా?

కావ్య: పెళ్లిచూపులకు వెళ్తున్నానని మీకు తెలుసు కదా?

   అనగానే రాజ్‌ ఈ పెళ్లి జరగకూడదు. అనగానే నిజంగా కవిగారి మనసులో అప్పు ఉందో లేదో నేరుగా కవిగారిని అడిగి తెలసుకుంటాను అంటుంది కావ్య. దీంతో రాజ్‌ సరే త్వరగా  కనుక్కో అంటాడు. మరోవైపు రుద్రాణి హ్యాపీగా నవ్వుతుంది. అప్పును ఇంటి కోడలు కాకుండా అడ్డుపడ్డాను. ఇప్పుడు ధాన్యలక్ష్మీ చచ్చినా అప్పు ఈ ఇంటి కోడల్ని చేయడానికి ఒప్పుకోదు అని రాహుల్ కు  చెప్తుంది. తర్వాత కళ్యాణ్‌ దగ్గరకు కావ్య వెళ్లి మీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్లి మీరు అప్పును ప్రేమిస్తున్నారా? ఒక ఫ్రెండుగానే  చూస్తున్నారా? అని అడుగుతుంది. మీ పెళ్లి జరిగితే రుద్రాణి మాటలే నిజం అవుతాయి. మీ అమ్మగారు అప్పును కోడలుగా ఒప్పుకోరు అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మనవడిని స్వయంగా స్కూల్‌కు తీసుకువెళ్లిన రజనీ - బెస్ట్‌ గ్రాండ్‌ఫాదర్‌ అంటూ మురిసిపోయిన కూతురు