Brahmamudi Serial Today Episode:  అప్పును అరెస్ట్‌ చేసిన ఏసీబీ వాళ్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సెల్ లో వేయబోతుంటే కావ్య లాయర్‌ను తీసుకుని స్టేషన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. సెల్‌లోకి వెళ్తున్న అప్పును ఆపేస్తుంది.

కావ్య: అప్పుకు బెయిల్‌ తీసుకొచ్చాము.. లాయర్‌ గారు బెయిల్‌ పేపర్స్‌ ఇవ్వండి.

ఏసీబీ ఆఫీసర్‌: అప్పుడే బెయిల్‌ ఎలా వచ్చింది. మామూలుగా ఇలాంటి కేసుల్లో బెయిల్‌ ఇవ్వరు కదా..?

లాయర్‌: అరెస్ట్‌ అయిన వ్యక్తి సొసైటీలో మంచి పేరు ఉండి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోతే బెయిల్‌ ఇస్తారు ఆఫీసర్‌

ఏసీబీ ఆఫీసర్‌:  అంత బ్యాగ్రౌండ్ ఉందా ఈవిడకు

కావ్య: నా చెల్లెలు అంటే ఎవరనుకున్నారు దుగ్గిరాల ఇంటి కోడలు

ఏసీబీ ఆఫీసర్‌:  వాట్‌ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి చీఫ్‌గా లంచం తీసుకున్నారా..?

కావ్య:  మీకు తెలిసింది ఇంతే దీని వెనక ఎవరున్నారో ఎవరు ఫ్లాన్‌ చేశారో కోర్టులో అన్నీ తెలుస్తాయి

ఏసీబీ ఆఫీసర్‌: మీ పలుకుబడి వాడి నిజాలను తారుమారు చేయాలనుకుంటున్నారేమో సాక్ష్యాలతో పట్టుకున్నాము మేడం

లాయరు: అది తేల్చాల్సింది కోర్టు.. మీరు కాదు ఆఫీసర్‌..

కావ్య: ఇప్పుడు మా చెల్లిని మేము తీసుకెళ్తున్నాము..

ఏసీబీ ఆఫీసర్‌:  ఇప్పుడు తీసుకెళ్లండి కానీ ఎల్లుండి కోర్టుకు రావాల్సి ఉంటుంది.

అని ఆఫీసర్‌ చెప్పగానే ఆ విషయం మాకు తెలుసులే ఆఫీసరు అంటూ అప్పును తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తారు. బయటకు వచ్చిన అప్పు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. రాజ్ ఇంటికి వెళ్లగానే యామిని ఎదురుగా వస్తుంది.

యామిని: ఏంటి బావ అప్పుడే వచ్చేశావు.. వెళ్లిన పని అయిపోయిందా..? కళావతికి ప్రపోజ్‌ చేసేశావా..? తను నీ లవ్‌ను యాక్సెప్ట్‌ చేసిందా…?

రాజ్: లేదు యామిని నేను ప్రపోజ్‌ చేయలేదు

యామిని:  ఎందుకు చేయలేదు బావ

రాజ్: కళావతి గారికి ఆఫీసులో ఒక ప్రాబ్లమ్‌ వచ్చింది అది సాల్వ్‌ చేశాక చెప్పాలనుకున్నాను. ఇంతలో అప్పు అరెస్ట్‌ అయినట్టు తెలియడంతో కళావతి వెళ్లిపోయింది

యామిని: నాకెందుకో  అనుమానంగా ఉంది బావ. కళావతి కావాలనే నిన్న అవైడ్‌ చేయడం కోసం ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది.

రాజ్‌: యామిని ఇక ఆపుతావా..? కళావతి గారి గురించి నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు. తనేంటో తన వ్యక్తిత్వం ఏంటో నాకు బాగా తెలుసు. పైగా తనకు నేనంటే ప్రాణం కూడా అలాంటి మనిషి నాకు అబద్దం చెప్పి నా నుంచి తప్పించుకుని వెళ్లడం ఏంటి..? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని డైరెక్టుగానే చెప్తుంది కానీ అబద్దాలు మాత్రం ఎప్పటికీ చెప్పదు. తనకు నిజంగానే ఫోన్‌ వచ్చింది నా ముందే మాట్లాడింది. నాకు చెప్పే వెల్లిపోయింది. ఇంకోసారి నా ముందు ఇలా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను.

అని రాజ్‌ కోపంగా చెప్పి వెళ్లిపోతాడు.

యామిని: నా ముందు నువ్విలా కావ్యను పొగిడనా.. తనకు సపోర్టుగా మాట్లాడినా.. నాకు నచ్చదు బావ. నేను తట్టుకోలేను బావ

వైదేహి: బేబీ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా..?

యామిని: నాకు పిచ్చి పట్టడం ఏంటి మామ్‌

వైదేహి: మరి లేకపోతే ఏంటే.. జరిగింది అంతా నీకు తెలిసి కూడా ఏమీ తెలియనట్టు అలా మాట్లాడటం ఎందుకు..? అల్లుడి గారి చేత ఇలా తిట్టించుకోవడం ఎందుకు..?

అంటూ అడగ్గానే ప్రతిదానికి ఒక రీజన్‌ ఉంటుంది మామ్‌ వెయిట్‌ అండ్‌ సీ అని చెప్తూ యామిని వెళ్లిపోతుంది. రుద్రాణికి అప్పు విషయం తెలియడంతో ఇంట్లో అందరికి చెప్పి ఇంటి పరువు బజారుకెక్కిందని అప్పును తిడుతుంది. ఇంతలో కావ్య, అప్పు వస్తారు. ధాన్యలక్ష్మీ అప్పును తిడుతుంది. ఏ ముంఖం పెట్టుకుని ఇంటికి వచ్చావంటుంది. దీంతో కావ్య అప్పు తప్పు చేయలేదని అప్పు నిర్దోషి అని నేను నిరూపిస్తాను అంటుంది. ఒకవేళ అప్పు చేసినట్టు ఫ్రూవ్ అయితే ఏం చేస్తావు అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. అలా అయితే అప్పు మీరు కోరినట్టే ఇంట్లో ఉండిపోతుంది అని చెప్తుంది. ధాన్యలక్ష్మీ సరే అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!